మంత్రాలయం నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం అడుగడుగునా నీరాజనాలు… వినతుల వెల్లువ నేడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి యువనేత పాదయాత్ర

మంత్రాలయం: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 82వరోజు మంత్రాలయం అసెంబ్లీ నియోకజకవర్గంలో హోరెత్తింది. మాధవరం శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా జనం నీరాజనాలు పట్టారు. మాధవరం గ్రామస్తులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మాధ‌వ‌రం సమీపాన పాద‌యాత్ర చేస్తుండగా తారసపడిన వలసకూలీలను యువనేత లోకేష్ కలిశారు.  వలసకూలీల కష్టం చూస్తుంటే గుండె త‌రుక్కుపోతోందని యువనేత నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులకు నీరిచ్చి వలసలను నివారిస్తామని భరోసా ఇచ్చారు.  పాదయాత్ర దారిలో మహిళా రైతు సిద్దా లింగమ్మ యువనేత లోకేష్ ను కలిసి టమోటా పంటను చూపి గోడు వెళ్లబోసుకుంది. మాకు 3ఎకరాల పొలం ఉంటే ఎకరాలో టమోటా, రెండెకరాల్లో చెరకు వేశాను. ఎకరా టమోటా పంటకు రూ.70వేలు ఖర్చయితే 10వేలు రాబడి వచ్చింది.  కిలో 6రూపాయలు పలుకుతోంది. కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను చేలోనే వదిలివేశానని ఆవేదన వ్యక్తంచేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా రైతులను ఆదుకుంటామని తెలిపారు. అనంతరం రాయచూర్ సర్కిల్, చెట్నిహల్లి మీదుగా పాదయాత్ర మంత్రాలయం చేరుకుంది. మంత్రాలయంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. మంత్రాలయం ఎబోడ్ హోటల్ వద్ద బిసిలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం పాదయాత్ర కొనసాగించిన యువనేత మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రాలయం శివార్లలో విడిది కేంద్రానికి చేరుకుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

వికలాంగుడినని చూడకుండా ఉద్యోగం నుంచి తీసేశారు-యలకటి శ్రీరాములు, పెద్దబొంపల్లి

 మా నాన్న వెలుగు ఆఫీసులో వివోఏ గా చేసేవారు. ఆయనకు వయోభారం కారణంగా మా కుటుంబ పరిస్థితి చూసి గతంలో నాకు ఉద్యోగం ఇచ్చారు. 2019లో చేరిన నన్ను 2021లో నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.  నాతో పాటు మరో 12 మందిని కూడా తొలగించారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే మమ్మల్ని తొలగించారు.  నెలకు రూ.8,000 వచ్చేవి.  ఇంటి ఖర్చులకు సరిపోయేది. వికలాంగుడిని అన్న కనికరం కూడా లేకుండా తీసేశారు.  ప్రస్తుతం పొలం పనులు చేసుకుంటున్నా.

బిసి మహిళ తరపున మాట్లాడానని కేసుపెట్టారు-మెలిగిరి కుడుగూరప్ప, ఉరుకుంద గ్రామం.

మా గ్రామంలోని ఈరన్నస్వామి దేవాలయం వద్ద ఓ బీసీ మహిళ కొబ్బరికాయలు అమ్మకుని జీవనం సాగిస్తుంది. కానీ ఆమె అంగడికి కొబ్బరికాయలు వేయొద్దని కొబ్బరికాయల కాంట్రాక్టరును వైసీపీ ఎమ్మెల్యే బెదిరించి, ఒత్తిడి తెచ్చారు. బీసీ మహిళ జీవనోపాధి ఎందుకు దెబ్బతీస్తున్నారు, కొబ్బరికాయలు ఆమె అంగడికి కూడా వేయండని అడిగినందుకు నాపై కేసులు పెట్టారు. మూడేళ్లుగా ఇంకా కేసులో కోర్టుకు తిరుగుతున్నాం. కేసులో రాజీపడొద్దని ఆ కాంట్రాక్టరపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఒత్తిడి తెస్తున్నారు.

కరెంటు రెట్టింపు అయింది! -బి.ఈరేషా, మాలపల్లి, మంత్రాలయం మండలం

నాకు చిన్న అంగడి ఉంది. 2019కి ముందు రెండు నెలలకు కలిపి అంగడికి రూ.500, ఇంటికి రూ.150 – రూ.200 కు మించి విద్యుత్ బిల్లు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఒక్క అంగడికే రూ.1200 వస్తోంది. ఇంటికి వెయ్యి రూపాయలు వస్తోంది. మళ్లీ విద్యుత్ బిల్లులు పెరుగుతాయని అంటున్నారు. ఇలా అయితే సామాన్యులం ఎలా బతకాలి? పనిచేసుకునేవాళ్లకు పని లేదు..వ్యాపారం కూడా గతంలో మాదిరి లేవు.

ఆధార్ కార్డు మాదిరిగానే బిసిలకు శాశ్వత సర్టిఫికెట్లు! బిసిలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్న జగన్ ప్రభుత్వం ఉపాధి హామీతో కల్లుగీత కార్మికులను అనుసంధానిస్తాం బ్రాండ్ల అమ్మకాల కోసం గీతకార్మికుల పొట్టగొట్టిన వైసీపీ మత్స్యకారుల పొట్టగొట్టే 217 జిఓను రద్దుచేస్తాం! బిసిలు నమ్మిన సిద్ధాంతంకోసం కలసికట్టుగా పోరాడాలి బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

మంత్రాలయం: ఆధార్ కార్డు మాదిరిగానే బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంత్రాలయం ఎబోడ్ హోటల్ వద్ద బిసిలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసే విధానం తీసుకొస్తాం. వైసీపీ ప్రభుత్వం బిసిలపై అడ్డగోలుగా కేసులు పెడుతోంది, ఎవరూ భయపడాల్సిన పనిలేదు, నమ్మిన సిద్ధాంతాల కోసం అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల భద్రత కోసం టిడిపి అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.  దామాషా ప్రకారం బీసీ ఉప కులాలకు నిధులు కేటాయిస్తాం. సబ్సిడీ రుణాలు అందిస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తిరిగి ప్రారంభిస్తాం.  జగన్ కాన్వాయ్ కి అడ్డం పడుకొని నిరసన తెలిపిన రైతుల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ప్రభుత్వం పై పోరాడాలి. వైసిపి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది బీసిలపై కేసులు పెట్టి వేధించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల కాపరులను ఆదుకుంటాం. కనకదాసు జయంతి రాష్ట్రపండుగగా నిర్వహిస్తాం. మాదాసి కురబలకు ఎస్సీ సర్టిఫికేట్ పై తప్పకుండా మేము సర్టిఫికేట్లు ఇస్తాం. బీరప్ప గుడుల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు కేటాయించి, అర్చకులకు జీతాలందిస్తాం.

ఉపకులాల వారీగా కమ్యూనిటీ హాళ్లు

 ఉప కులాల వారీగా ముందు నియోజకవర్గం స్థాయిలో, ఆ తరువాత మండల స్థాయిలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. బోయ, వాల్మీకి లను వైసీపీ నమ్మించి మోసం చేశారు. ఎన్నో సార్లు జగన్ ప్రధానిని కలిశారు. ఒక్క సారి అయినా బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని అడిగారా? అంత మంది ఎంపిలు ఉన్నారు ఒక్క రోజైనా పార్లమెంట్ లో ఈ అంశం గురించి మాట్లాడారా? టిడిపి హయాంలో సత్యపాల్ కమిటీ వేసి అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. జగన్ నాలుగేళ్లుగా డ్రామాలు ఆడి ఇప్పుడు కేవలం 4 జిల్లాలో ఉన్న బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని కొత్త తీర్మానం చేసి మీకు తీరని అన్యాయం చేశారు. కల్లుగీత కార్మికుల పొట్ట కొట్టారు వైసీపీ. చెట్లను కొట్టేయడం తో పాటు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైసీపీ తన బ్రాండ్ల మద్యం అమ్ముకోవడానికి కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. తాటి చెట్ల పెంపకాన్ని ఉపాధి హామీతో అనుసంధానిస్తాం.

రజకులకు వాషింగ్ మెషీన్లు,ఉచిత విద్యుత్

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రజకులకు వాషింగ్ మెషీన్, ఐరెన్ బాక్సులు అందజేసాం. దోబి ఘాట్స్ ఏర్పాటు చేశాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాషింగ్ మెషీన్ తో పాటు రజకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. రజకులకి ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేసింది వైసీపీ. మంత్రాలయం లో మత్స్యకారులను వేధిస్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే. వైసిపి పెత్తందారుల చేతిలోకి వెళ్లిపోయిన మత్స్యకారులకు చేసిన చెరువులు అన్ని తిరిగి మత్స్యకారులకు కేటాయిస్తాం. మత్స్యకారుల పొట్ట కొట్టేలా వైసీపీ తెచ్చిన జీఓ లు అన్ని రద్దు చేస్తాం. బీసీలకు నిజమైన రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే. బిసిలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది TDP. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. ఆదరణ 2 లో కొన్న పనిముట్లు బిసిలకు ఇవ్వకుండా వాటిని తుప్పు పట్టేలా చేసింది వైసీపీ ప్రభుత్వం. జగన్ స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేశారు.

బిసి ప్రతినిధులు మాట్లాడుతూ…

బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేరుస్తామని వైసీపీ మోసం చేశారు. బోయ, వాల్మీకిలకి ఎటువంటి కుల వృత్తి లేదు. బిసిలకు అమలు అయ్యే ఏ సంక్షేమ కార్యక్రమం మాకు అందడం లేదు. మాదాసి కురువ లకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. టిడిపి హయాంలో గొర్రెల పెంపకం కోసం సహాయం అందించేవారు. ఇప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమాలు జగన్ ప్రభుత్వం ఆపేసింది. వడ్డెర కులస్తులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. మాకు కార్పొరేషన్ ద్వారా ఎటువంటి రుణాలు అందడం లేదు. కల్లు గీత కార్మికులను వైసిపి ప్రభుత్వం కోలుకోలేని దెబ్బకొట్టింది. రజకులను జగన్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. ఎటువంటి సహాయం అందడం లేదు. జిఓ నెం. 217తో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల పొట్టగొడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

ముఖాముఖి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

కురబ భానుప్రకాష్ : మాది గొర్రెలు కాచుకునే వృత్తి. గతంలో గొర్రెలకు సబ్సీడీ ఇచ్చారు..ఇన్సూరెన్స్ ఇచ్చేవారు. మీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఏం చేస్తారు.? మాదాసి కురుబలకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. గెజిట్ నెంబర్ 53 ద్వారా ప్రభుత్వం మోసం చేస్తోంది.

వడ్డే ఎల్లప్ప, వడ్డెర : బీసీల్లో ఎక్కువగా నష్టపోయింది వడ్డెరలే. వడ్డెర్లు ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం రావడం లేదు. వడ్డెర్లను ఎస్సీల్లో చేర్చాలి.

హనుమంతు, పెద్దబొంపల్లి : వాల్మీకీలకు సొంత వృత్తిలేదు. వాల్మీకీలను వివాదాలకే వాడుకుంటున్నారు. ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే అన్ని విధాలా బాగుంటాం.

సత్తెన్న గౌడ్ : మేము అమ్మే కల్లు ఇతరులు అమ్ముతున్నారు. మా వృత్తి మాకే చెందేలా చర్యలు తీసుకోవాలి.

దస్తగిరి, ఒగులూరు గ్రామం : మంత్రాలయంలో రజకులకు దోబీఘాట్లు లేవు. విద్యలో రజకులు వెనకబడి ఉన్నాం. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోండి.

వ‌ల‌స‌ల‌తో ప‌ల్లె క‌న్నీరు పెడుతోంది! వలసకూలీలను కలిసిన యువనేత లోకేష్

వలసకూలీల కష్టం చూస్తుంటే గుండె త‌రుక్కుపోతోందని యువనేత నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. గురువారం మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గం మాధ‌వ‌రం మీదుగా పాద‌యాత్ర చేస్తుండగా తారసపడిన వలసకూలీలను యువనేత లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…కుటుంబాల‌న్నీ వ‌ల‌స‌లు పోతుంటే ప‌ల్లె క‌న్నీరు పెడుతోంది. ఇంటిల్లిపాదీ మండుటెండ‌ల్లో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లి తిరిగి వస్తున్న దృశ్యాలు ఆందోళ‌న‌కి గురిచేస్తున్నాయి. బ‌డిలో చ‌క్క‌టి రాత‌లు నేర్చాల్సిన చిట్టిచేతులు మ‌ట్టి ప‌నుల‌కి త‌ల్లిదండ్రుల‌తో త‌ర‌లిపోతున్నారు. మెతుకు కోసం, బ‌తుకు కోసం వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌మాద‌క‌ర ప్ర‌యాణం చేస్తున్న వ‌ల‌స జీవులు మ‌న ప‌ర‌దాల హెలికాప్ట‌ర్ సీఎం గారికి క‌నిపించే అవ‌కాశ‌మే లేదు. డిసిఎం వ్యానులో పిల్ల‌ల‌తో క‌లిసి వలస వెళ్లి వస్తున్న కుటుంబాలు ఎదుర‌య్యాయి. వారితో మాట్లాడేందుకు వ్యాన్ ఎక్కాను. వ్య‌వ‌సాయానికి నీటివ‌స‌తి లేక‌, చేసేందుకు ప‌నిలేక‌, ధ‌ర‌లు భార‌మై తెలంగాణ ప్రాంతానికి, గుంటూరుకి వెళ్లి పనులు చేసుకొని తిరిగి వస్తున్నామని చెప్పారు. ఏడాదిలో ఆరు నెలలు పనులు కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన దుస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ‌ల‌స‌లు వైసీపీ విధ్వంస పాల‌న విష‌ఫ‌లితం.  తెలుగుదేశం ప్ర‌భుత్వం రాగానే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్య‌వ‌సాయానికి నీరందిస్తాం. స్థానికంగానే ఉపాధి దొరికే మార్గాలు చూపుతాం. వ‌ల‌స క‌ష్టాలు లేకుండా చేస్తాం.  ప‌ల్లె క‌న్నీరు తుడుస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

యువనేతను కలిసిన మాధవరం గ్రామస్తులు

మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం మాధవరం గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో చెరకు అధికంగా పండిస్తున్నాం. చెరకు అమ్ముకోవడానికి కర్నూలులో ఎక్కడా సుగర్ ఫ్యాక్టరీలు లేవు. ఫలితంగా రోడ్లపైనే చెరకు అమ్ముకోవాల్సి వస్తోంది. నకిలీ విత్తనాల సమస్య అధికంగా ఉంది. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో సుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలి. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు నియంత్రించాలి. రైతులు పండించిన ప్రతిపంటకు మద్దతు ధర నిర్ణయించాలి. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలి. మా గ్రామానికి తాగునీటి సమస్య అధికంగా ఉంది. తుంగభద్ర మా గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్నా తాగునీరు లేదు. మాకు ఇళ్లకు నీటి కుళాయి కనెక్షన్ కావాలి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నిర్మించాలి.

*యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…*

పాదయాత్ర సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి రైతులను ఆదుకుంటానని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందేలా చర్యలు చేపడతాం. చెరకు రైతుల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

యువనేతను కలిసిన చెట్నిహళ్లి గ్రామస్తులు

మంత్రాలయం నియోజకవర్గం చెట్నిహళ్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో మంచినీరు, డ్రైనేజి, వీధిదీపాల సమస్య ఉంది. ఇసుక మాఫియా కారణంగా గ్రామంలో రోడ్లు దెబ్బతింటున్నాయి. శ్మశానవాటికకు రహదారి సౌకర్యం లేదు. గత ప్రభుత్వంలో మంజూరుచేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది. టిడిపి ప్రభుత్వం వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

*యువనేత లోకేష్ మాట్లాడుతూ…*

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి.  టిడిపి హయాంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాం. అధికారంలోకి వచ్చిన వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం. చెట్నిహళ్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తాం.

*కూలీ ఖర్చులు కూడా రావడం లేదు*

*యువనేత ఎదుట మహిళా రైతు ఆవేదన*

మంత్రాలయం నియోజకవర్గం మాధవరం శివార్లలో మహిళా రైతు సిద్దాలింగమ్మ యువనేత లోకేష్ ను కలిసి టమోటా పంటను చూపి గోడు వెళ్లబోసుకుంది. మాకు 3ఎకరాల పొలం ఉంటే ఎకరాలో టమోటా, రెండెకరాల్లో చెరకు వేశాను.  ఎకరా టమోటా పంటకు రూ.70వేలు ఖర్చయితే 10వేలు రాబడి వచ్చింది.  కిలో 6రూపాయలు పలుకుతోంది. కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను చేలోనే వదిలివేశాను. గత ఏడాది రెండెకరాల్లో మిర్చి పంటవేస్తే 2.5లక్షల రూపాయల పెట్టుబడి అయింది. వాగువచ్చి పంట కొట్టుకుపోతే ప్రభుత్వం ఒక్కరూపాయి పరిహారం ఇవ్వలేదు.  టిడిపి ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే రూ.70వేల పంటల బీమా సొమ్ము వచ్చింది. ఏటికేడు నష్టాలతో అప్పులు పెరిగిపోతున్నాయో తప్ప లాభం లేదు. ప్రభుత్వం సాయం అందించకపోతే వ్యవసాయం చేయడం కష్టమని తెలిపింది.

*యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…*

టమోటా రైతులను ఆదుకోవడానికి కెచప్ ఫ్యాక్టరీలు పెడతానన్న జగన్ పత్తా లేకుండా పోయారు. పంటలబీమాకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి అన్నదాతలను నట్టేట ముంచాడు. రైతులు పంటనష్టపోతే కనీసం పరిశీలించి అంచనావేసే నాథుడే లేడు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెటింగ్, నిల్వ సౌకర్యం కల్పించి టమోటా రైతులను ఆదుకుంటాం. పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.

Also, read this blog: Building Youth Futures with Yuvagalam’s Awareness

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *