Yuvagalam Padayatra

పత్తికొండలో పోటెత్తిన ప్రజానీకం, యువనేతకు నియోజకవర్గంలోకి ఘనస్వాతం, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు

*పత్తికొండ:* టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 71రోజు డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఎస్.రంగాపురం వద్ద లోకేష్ వద్దకు మహిళలు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. సర్పంచ్ లు, డీసీ కొండ గ్రామస్తులు, కలచెట్ల గ్రామస్తులు తమ సమస్యలపై యువనేతకు వినతిపత్రాలు అందించారు. వాటిపై లోకేష్ స్పందించి తమ సమస్యలను అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు కదిలారు. శభాష్ పురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. నియోజకవర్గం ప్రారంభంలో పత్తికొండ TDP నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. మహిళలు పాదయాత్రకు పోటెత్తి తమ సంఘీభావం తెలిపారు. వృద్దులు, యువకులు, రైతులు పాదయాత్రకు తమ సంఘీభావం తెలిపారు. పెద్దకొండ వద్ద భోజనవిరామం అనంతరం పాదయాత్ర పునఃప్రారంభమైంది. గుడిసెగుప్పరాళ్ల మీదుగా పాదయాత్ర రాంపల్లి సబ్ స్టేషన్ సమీపంలోని బహిరంగ సభకు చేరుకుంది. సభకు వేలాది మంది ప్రజలు పోటెత్తారు. సభ అనంతరం రాంపల్లి శివార్లలోని విడిది కేంద్రానికి పాదయాత్ర చేరుకుంది.

*పాదయాత్రలో లోకేష్ దృష్టికి వచ్చిన సమస్యలు:*

*తలారి యంకమ్మ,శభాష్ పురం:* నా వయసు 68 ఏళ్లు. 25 ఏళ్ల క్రితం నాభర్త చనిపోయారు. అప్పటి నుండి నాకు పెన్షన్ వస్తోంది. కానీ మొన్నటి జనవరి నెల నుండి పెన్షన్ ఆపేశారు. నా పేరుపై 4 ఎకరాల పొలం మాత్రమే ఉంది. అందులో ఒక ఎకరా కూడా నా మనవరాలు పెళ్లికి కట్నంగా ఇవ్వగా మూడెకరాలు మాత్రమే ఉంది. పెన్షన్ ఎందుకు తీసేశారని అడిగితే సమాధానం చెప్పడం లేదు.  

*తలారి రంగమ్మ, శభాష్ పురం:* నా వయసు 66 ఏళ్లు. 15 ఏళ్ల క్రితం నా భర్త చనిపోయారు. నా కన్ను కూడా ఒకటి కనబడదు. జనవరి నుండి పెన్షన్ రావడం లేదు. కుటుంబమంతా ఒకే రేషన్ కార్డుపై ఉన్నాం. కానీ నా పేరును సెంటు భూమి కూడా లేదు. తలపోటుతో ఇబ్బంది పడుతున్న నాకు నెలకు మందుల ఖర్చుకే రూ.2 వేలు అవుతుంది.

*రాంపల్లి సర్కిల్ వద్ద నారా లోకేష్ బహిరంగ సభ:*

*పత్తికొండపై నడవడం నా అదృష్టం*

శోకుడు పరిపాలించిన ప్రాంతం పత్తికొండ. వజ్రాల్లాంటి ప్రజలు పత్తికొండలో ఉన్నారు. నవ్యంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ. కృష్ణమూర్తి గారు ఇక్కడ నుండే ఎమ్మెల్యే గా గెలిచారు. పెరవళి రంగనాథ స్వామి ఆలయం, పత్తికొండ సాయిబాబా ఆలయం ఉన్న పుణ్య భూమి ఇది. ఎంతో ఘన చరిత్ర ఉన్న పత్తికొండ లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

*యువగళం దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలాయి*

యువగళం…మనగళం… ప్రజాబలం. యువగళం పాదయాత్ర తో తాడేపల్లి ప్యాలస్ షేక్ అయ్యింది. సింహం సింగిల్ వస్తుంది అన్న వాడు నన్ను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసుల్ని పంపాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బ తగిలే సరికి జగన్ కి భయం పట్టుకుంది. బిడ్డ ఎంత భయపడ్డాడో తెలుసా? ఫేక్ వీడియోలు రిలీజ్ చేసుకునే దుస్థితి కి దిగజారిపోయాడు.

*నా ఛాలెంజ్ పై భారతీ రెడ్డి మౌనం అర్ధాంగీకారమే:*

దళితులకు వైసీపీ ప్రభుత్వం పీకింది, పొడిసింది ఏమి లేదు అని నేను అంటే, దళితుల్ని నేను అవమానించానని ఒక ఫేక్ వీడియో వదిలారు. ఆ వీడియో చూపించి నన్ను అడ్డుకోవడానికి వస్తున్నారు. బ్రదర్ భయం నా బయోడేటా లేదు. నేను ఏమి జగన్ లా పరదాలు కట్టుకొని పర్యటించడం లేదు కదా. భారతి రెడ్డి గారికి ఛాలెంజ్ చేశాను సౌండ్ లేదు.తాడేపల్లి ప్యాలస్ ఫేక్ గ్యాంగ్ మొత్తం అడ్డంగా బుక్కయింది. అమ్మా భారతి రెడ్డి గారు దళితులకు ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారు?

*వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసింది..*

జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసివేసింది. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసింది. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. వైసీపీ ప్రభుత్వం విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

*మహిళల తాళిబొట్లు తెంచుతున్న వైసీపీ ప్రభుత్వం*

వైసీపీ ప్రభుత్వం మహిళల తాళిబొట్లు తెంచుతున్నాది. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు జగన్. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.

*రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్న వైసీపీ ప్రభుత్వం:*

వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.

*ఉద్యోగస్తులు,పోలీసుల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం:*

వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టింది. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు జగన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు.

*బీసీల నడ్డివిరిచిన వైసీపీ ప్రభుత్వం:*

బీసీలకు బ్యాక్ బోన్ విరిచింది వైసీపీ ప్రభుత్వం. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేశాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.

*వైసీపీ ప్రభుత్వ పాలనలో మైనారిటీలపై పెరిగిన అఘాయిత్యాలు:*

మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేసింది. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.

* వైసీపీ ప్రభుత్వ పాలనలో రెడ్లకు గౌరవం లేదు:*

పత్తికొండలో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఒక్క సారి ఆలోచించండి. మీరు వైసీపీ ప్రభుత్వంని గెలిపించడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం ఉందా? కేవలం పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి తప్ప మిగిలిన రెడ్లు ఎవరైనా బాగుపడ్డారా?

*రాయలసీమకు బిడ్డ అంటాడు కానీ కాదు:*

జగన్ నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ కాదు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ . ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ  వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

*పత్తికొండలో శ్రీదేవి దోపిడీ ఫుల్…అభివృద్ధి నిల్…*

పత్తికొండ ఎమ్మెల్యే గారి పేరు శ్రీదేవి గారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని మీరు భారీ మెజారిటీ తో గెలిపించారు. కానీ జరిగింది ఏంటి? నియోజకవర్గాన్ని, ప్రజల్ని గాలికి వదిలేసి ఫ్యామిలీ మాఫియాని రంగంలోకి దింపారు. ఆమె నేను నియోజకవర్గం లోకి రాకముందే నా అవినీతి గురించి మాట్లాడొద్దు అని ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడనంత మాత్రానా మీరు చేసిన అవినీతి మాయం అవుతుందా శ్రీదేవి గారు? ప్రతి రోజూ సాయంత్రం ఫ్యామిలీ మాఫియా మొత్తం కూర్చొని వాటాలు వేసుకుంటారు. పత్తికొండ ని కేకు ముక్కల్లా కోసి ఫ్యామిలీ మాఫియాకు పంచేసారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారి కొడుకు రామ్మోహన్ రెడ్డి, బంధువులు ప్రదీప్ రెడ్డి, జగన్నాధ రెడ్డిలకు ఒక్కో మండలాన్ని పంచేశారు. ఇసుక, మట్టి, అక్రమ మద్యం రవాణా, భూకబ్జాలకు పాల్పడుతూ ఫ్యామిలీ మాఫియా పత్తికొండను దోచుకుంటుంది. ఈ రోజు చెర్లకొత్తూరు కు చెందిన దళిత రైతులు నన్ను కలిశారు. వారు 1986 లో కొన్న 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబ సభ్యులు కొట్టేశారు. దానికి సంభందించిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మద్దికెర రైల్వేస్టేషన్ లో కప్పం కట్టలేదు అని  రైల్వే కాంట్రాక్టర్ పై దాడి చేసి… వాహనాలు ఎత్తుకెళ్లారు ఫామిలీ మాఫియా సభ్యులు. బంగారు గనుల యజమానులను బెదిరించి పనులు జరగకుండా ఆపేశారు. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు, సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల నియామకం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి 12 లక్షలు తీసుకున్నారు. టమాటో మార్కెట్ ని కూడా వదలలేదు ఈ ఫ్యామిలీ మాఫియా. వ్యాపారస్తులను బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఆఖరికి రేషన్ బియ్యాన్ని కూడా అక్రమ రవాణా చేస్తుంది ఈ ఫ్యామిలీ మాఫియా. పార్వతికొండ,బుజుగుండ్ల కొండ నుండి  ఎర్రమట్టి తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడ నుండి ఇసుకను బెంగుళూరు కి తరలిస్తారు. ఆ బల్లు తిరిగివచ్చేప్పుడు కర్ణాటక మద్యం ఇక్కడికి తెచ్చి అమ్మేస్తారు. పత్తికొండ చెరువుని కూడా కబ్జా చేస్తున్నారు ఈ ఫ్యామిలీ మాఫియా. జగన్ పాదయాత్ర లో పత్తికొండ కి వచ్చినప్పుడు నియోజకవర్గంలోని చెరువులు నింపి నియోజకవర్గానికి నీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. శ్రీ దేవి గారు ఆ హామీ ఎం అయ్యింది? టమోటా జ్యూస్ ఫాక్టరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అన్నారు. శ్రీ దేవి గారు ఆ హామీ ఎం అయ్యింది? పత్తికొండను అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, పేదలకు టిడ్కొ ఇల్లు, పాఠశాల భవనాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి.  టిడిపి హయాంలో 1600 కోట్లు ఖర్చు చేసి పత్తికొండ ని అభివృద్ది చేసింది టిడిపి. పత్తికొండ లో టమాటో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు నాకు తెలుసు. టిడిపి హయాంలో టమాటో వాల్యూ చైన్ కార్యక్రమం రూపొందించాం. వైసిపి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఆపేసింది. విత్తనం నుండి గిట్టుబాటు ధర కల్పించడం వరకూ టమాటో రైతుల్ని ఆదుకుంటాం. కోల్డ్ స్టోరేజ్లు, కెచప్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్యూనిట్లు తీసుకొస్తాం. స్థానికంగా ఉద్యోగాలు దొరక్క బెంగుళూరు, హైదరాబాద్ వలస వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో కరువు పల్లెలకు తాగు, సాగునీరు అందించాలని టీడీపీ ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిలు 68 చెరువులకు హంద్రీనీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఇవ్వాలని  రూ.253 కోట్లతో 68 చెరువులు లిఫ్ట్ స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. 65 శాతం పనులు పూర్తి చేశారు. మరో ఆరు నెలలు ఉంటే.. వంద శాతం పనులు పూర్తి చేసి కరువు గ్రామాలకు చంద్రబాబే కృష్ణా జలాలు ఇచ్చేవారు. ఇంతలో ఎన్నికలు వచ్చి.. జగన్ సీఎం అయ్యారు. నాలుగేళ్లు అయినా 35 శాతం పనులు పూర్తి చేయలేదు. హంద్రీనీవా ప్రాజెక్టు పందికోన (పత్తికొండ) రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల కింద పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ప్రస్తుతం 15-20 వేల ఎకరాలకు కూడా ఇవ్వడం లేదు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే.. 80 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు ఇవ్వవచ్చు. పత్తికొండ పట్టణం సహా 85 శాతం గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పందికోన రిజర్వాయరు నుంచి పైపులైను వేసి పత్తికొండ టౌన్ నీటి కొంతవరకు తీర్చారు. టౌన్ పెరుగుతుండడంతో సమస్య తీవ్రం అవుతుంది. వర్షాకాలంలో ఖరీఫ్ పంటలు అయిపోగానే ఊళ్లకు ఊళ్లు బెంగళూరు, హైదరాబాదు, గుంటూరు ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి స్థానికంగా ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటాం.  పెండింగ్ లో ఉన్న సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పూర్తిచేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. పత్తికొండ ఫ్యామిలీ మాఫియా టిడిపి కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించింది. కొంత మంది అధికారులు లైన్ దాటి అక్రమ కేసులు బనాయించారు. టిడిపి అధిరంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా వెన్నకి ఇచ్చే బాధ్యత నాది. జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన మూడు ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత నాది.

యువనేత లోకేష్ ను కలిసిన కలచట్ల గ్రామస్తులు

డోన్ నియోజకవర్గం కలచట్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గ్రామంలో అంతర్గత రోడ్లను తవ్వేసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. గ్రామ చెరువును హంద్రీనీవా జలాలతో నింపాలి. గ్రామంలో ఇళ్లు లేనివారికి పక్కా గృహాలు నిర్మించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

వైసీపీ ప్రభుత్వంకి దోచుకోవడం, దాచుకోవడం తప్ప గ్రామాల అభివృద్ధిపై శ్రద్ధలేదు. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు వేశాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లిస్తాం. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తాం.

యువనేతను కలిసిన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులు

డోన్ నియోజకవర్గం ఎస్.రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. టిడిపి హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామంలో నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి సిసి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అప్పలుచేసి ఇళ్లు పూర్తిచేసుకున్న మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులు ఇప్పించి, సిసి రోడ్లు నిర్మించండి.

*యువనేత లోకేష్ స్పందిస్తూ…*

ముఖ్యమంత్రి జగన్ పేదలపై కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో అసంపూర్తిగా నిలచిపోయిన సుమారు 2లక్షల ఇళ్లకు గత టిడిపి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఇళ్లనిర్మాణం పూర్తిచేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు అందజేస్తాం. రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో సిసి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

యువనేతను కలిసిన శభాష్ పురం గ్రామస్తులు

పత్తికొండ నియోజకవర్గం శభాష్ పురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. శభాష్ పురం గ్రామంలో సాగు, తాగునీటి సమస్య అధికంగా ఉంది. వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్, కుళాయిలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న పొలాల బోర్ల వద్దకువెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో గ్రామంలో బోర్లు వేయించారు, పైప్ లైన్ వేసేలోపు ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోంది. పత్తికొండ, తుగ్గలిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగులకు పొట్టచేతబట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

*యువనేత లోకేష్ స్పందిస్తూ…*

టిడిపి ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి శ్రీకారం చుట్టాం. 30శాతం పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి రాష్ట్రప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా పనులు ఆపేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ కుళాయి పథకాన్ని పూర్తిచేస్తాం. పత్తికొండ నియోజకవర్గంలో సోలార్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు  చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన డీసీ కొండ కార్యకర్తలు, గ్రామస్తులు

పత్తికొండ నియోజకవర్గం డీసీ కొండ గ్రామ ప్రజలు, టిడిపి కార్యకర్తలు యువనేత లోకేష ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో 2020 సెప్టెంబర్ 8న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసిపి గూండాలు దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా, మాపైనే రివర్స్ కేసులు పెట్టారు. నెల రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి, 42రోజులు సబ్ జైల్లో పెట్టించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మాపై ఉన్న అక్రమ కేసులు రద్దు చేయాలి. మాపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

*యువనేత లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజారెడ్డి రాజ్యంగాన్ని అమలుచేస్తూ టిడిపి కార్యకర్తలను ఊచకోత కోస్తూ రాక్షాసానందం పొందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45మంది టిడిపి నాయకులు, కార్యకర్తలను హత్యచేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,400 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, కళావెంకట్రావు, చింతమనేని ప్రభాకర్, పట్టాభి వంటి 100మందిపై తప్పుడు కేసులు బనాయించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2021లో 21,880 దాడుల ఘటనలు చోటుచేసుకున్నయి. పోలీసులు ఏకపక్ష వైఖరి అవలంభించి టీడీపీ కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పై సుమారు 80కేసులు పెట్టారు. తాడపత్రి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు 249మందిని అక్రమ కేసుల్లో జైలుకు పంపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. పనిగట్టుకొని టిడిపి నేతలను వేధించిన పోలీసులను సర్వీసునుంచి తొలగించి జైలుకు పంపుతాం.

యువనేతను కలిసిన సర్పంచుల సంఘం ప్రతినిధులు

పత్తికొండ నియోజకవర్గం గుడిసె గుప్పరాలలో సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను సర్పంచుల అధీనంలోకి తీసుకురావాలి. పంచాయితీలకు చెందాల్సిన నిధులను సిఎఫ్ఎంఎస్ – పిడి ఎకౌంట్ల నుంచి రాష్ట్రప్రభుత్వం మాకు చెప్పకుండా ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తోంది. 2022-23 ఆర్థికసంవత్సరానికి కేంద్రం విడుదల చేసిన ఆర్థికసంఘం నిధులు వెంటనే పంచాయితీలకు ఇవ్వాలి. గ్రామసచివాలయాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.20లక్షల నిధులను ఎమ్మెల్యే ద్వారా కాకుండా సర్పంచ్ ల ద్వారా అభివృద్ధి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలి. పంచాయితీల విద్యుత్ బిల్లులు, క్లాప్ మిత్రుల జీతాలు పాతపద్ధతిలోని రాష్ట్రప్రభుత్వం చెల్లించాలి. జాతీయ ఉపాధి పథకం నిధులను ఉపాధి హామీ చట్టం ప్రకారం గతంలో మాదిరి సర్పంచ్ లకు ఇవ్వాలి. సర్పంచ్, ఎంపిటిసిలకు రూ.15వేలు, ఎంపిపి, జడ్ పిటిసి లకు రూ.30వేలు గౌరవవేతనం చెల్లించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

73,74 రాజ్యాంగసవరణల ద్వారా స్థానికసంస్థలకు సంక్రమించిన అధికారాలను సమాంతర వ్యవస్థల ద్వారా వైసీపీ ప్రభుత్వం హైజాక్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన రూ.7,880 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దొంగిలించింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయితీలకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తాం. సర్పంచ్ ల గౌరవ,ప్రతిష్టలు పెంచేలా వారికి 73,74 రాజ్యంగ సవరణల ప్రకారం అధికారాలు  ఇస్తాం.

యువనేతను కలిసిన దివ్యాంగుల సమాఖ్య ప్రతినిధులు

పత్తికొండ నియోజకవర్గం, పెద్దకొండ వద్ద తుగ్గలి వెన్నెల దివ్యాంగుల సమాఖ్య సభ్యులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. ఈ ప్రభుత్వం రద్దు చేసిన వికలాంగ కార్పొరేషన్ ను పున:ప్రారంభించాలి. గత ప్రభుత్వంలో మంజూరైన రుణాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.  దివ్యాంగులను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బధిరుల కోసం సైగల భాష, సబ్ టైటిల్స్ తో టీవీ కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యా, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించాలి. గృహాల కేటాయింపుల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.  ఉచితంగా న్యాయ సహాయం అందించాలి. వ్యాంగులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ….

దివ్యాంగుల పెన్షన్ ను రూ.3 వేలు చేసిన ఘనత చంద్రబాబుది. పెన్షన్ల పెంపులో దివ్యాంగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. దివ్యాంగులను వివాహం చేసుకున్నవారికి రూ.లక్ష ప్రోత్సాహంగా అందించాము. దాన్ని లక్షన్నరకు పెంచుతామని జగన్ చేయకుండా మోసం చేశారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారికి యాక్టివా మోటార్  సైకిళ్లు కూడా పంపిణీ చేశాం. స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల దాకా రుణాలిచ్చాం. దివ్యాంగులను ఎవరైనా కించపరిచితే అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం. ఆత్మగౌరవంతో దివ్యాంగులు బతికేలా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. విద్యా, ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తాం.

Also, read this blog: Nara Lokesh’s Drive to Excel in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *