కర్నూలులో కదం తొక్కిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు నీరాజనాలు దర్గా, చర్చిల్లో యువనేత ప్రార్థనలు, మతపెద్దల ఆశీర్వచనం
కర్నూలు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో దుమ్మురేపింది. కర్నూలు శివారులోని రేడియో స్టేషన్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. యువనేతపై కర్నూలు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతించారు. యువకులు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ నినాదాలతో హోరెత్తించారు. తొలుత కర్నూలు బళ్లారి సర్కిల్ లో యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. నిలువెత్తు గజమాలతో అక్కడి ప్రజలు యువనేతను స్వాగతించారు. దారిపొడవునా అందరి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమ్యలను అడిగి తెలుసుకున్నారు. యువనేత పాదయాత్ర చేసే రహదార్లపైకి జనం భారీగా చేరుకున్నారు. లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్ల పైకి వచ్చిన యువత, మహిళలు, వృద్దులు పెద్దఎత్తున తరలివచ్చారు. రోడ్లవెంట భవనాలపైనుంచి చేతులు ఊపుతూ యువనేతకు అభివాదం తెలిపారు. నాలుగేళ్లు మా దిక్కు చూడని ఎమ్మెల్యే మీరు వస్తున్నారు అని తెలిసి నిన్న సాయంత్రం హడావిడి గా వచ్చి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారని కొందరు స్థానికులు లోకేష్ కు తెలిపారు. వార్డుల్లో తాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ వద్ద పలు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు టౌన్ వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కర్నూలు 48వడివిజన్ రోజాదర్గా వద్ద యువనేత నారా లోకేష్ ముస్లిం మతపెద్దలను కలిసి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. రోజా దర్గాలోకి వెళ్లి మతపెద్దలకు అభివాదం చేసిన లోకేష్ ను వారు ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. యువగళం పాదయాత్ర విజయవంతమయ్యేలా తనను ఆశీర్వదించాలని మతపెద్దలను లోకేష్ విన్నవించారు. రాబోయే ఎన్నికల్లో N Chandrababu Naidu సిఎం కావాలని అల్లాను ప్రార్థించాల్సిందిగా యువనేత మతపెద్దలను కోరారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు యువనేతకు షాయా కప్పి ఫాతియా అందజేశారు. మసీదు నిర్వహణ, ముస్లిం సోదరులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై లోకేష్ వారిని అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మసీదులు, దర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. చాలాచోట్ల ఖబరిస్తాన్ లు ఆక్రమణలకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, రక్షణగోడలు ఏర్పాటుచేసి వాటిని పరిరక్షిస్తామని లోకేష్ తెలిపారు. దారిపొడవునా నిరుద్యోగ యువకులు, దివ్యాంగులు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గీయులు, మైనారిటీలు, వివిధ బస్తీల వాసులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. కర్నూలు బస్టాండు సమీపంలో దివ్యాంగ చర్మకారుడు నాగన్నను కలిసి ఆయన సమస్యలు తెలుసుకున్నారు. 43వవార్డులు పేదలు నివసించే కాలనీలోకి వెళ్లిన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. కర్నూలు శ్రీనివాసనగర్ లోని స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో యువనేత నారా లోకేష్ ప్రార్థనలు చేశారు. పాదయాత్ర సందర్భంగా సందర్భంగా చర్చిలోకి వెళ్లిన లోకేష్ కు క్రిస్టియన్ మతపెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు. యువనేత చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలంటూ మతపెద్దలు ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు అనంతరం లోకేష్ మతపెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో శ్మశాన వాటిక సమస్య ఉందని వారు తెలుపగా, అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శనివారం నాడు కర్నూలులో 7.5 కి.మీ. మేర సాగిన పాదయాత్ర ఎస్ టిబిసి గ్రౌండ్స్ కు చేరుకుంది. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1169.7 కి.మీ పూర్తయింది. కర్నూలు ఎస్ టిబిసి గ్రౌండ్స్ లో ఆదివారం ముస్లిం మైనారిటీ సోదరులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో యువనేత పాల్గొంటారు.
నిస్సహాయుల ఉసురు పోసుకోవడం పాపం జగన్ రెడ్డీ!
భగత్ సింగ్ నగర్ లో పెన్షన్లు తొలగించిన శాంతమ్మ, దేవసహాయంలు యువనేతను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఒకరేమో వృద్ధుడు..మరొకరేమో దివ్యాంగురాలు..నిస్సహాయులు..వీళ్ల బతుకుకి ఆసరా అయిన పింఛను తీసేయడానికి మనసు ఎలా ఒప్పింది జగన్ మోహన్ రెడ్డి? కర్నూలు టౌన్‌లో ఈ నిస్సహాయులు నన్ను కలిసి తమ ఆవేదన వెళ్లగక్కారు. పింఛను పథకానికి నీ తండ్రి పేరు పెట్టుకుని లక్షలాది మంది వృద్ధులు దివ్యాంగులు, వితంతువుల పింఛన్లు తీసేసి ఉసురు పోసుకోవడం పాపం అనిపించడం లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ ని కలిసిన క్రిస్టియన్ సంఘ ప్రతినిధులు
కర్నూలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద క్రిస్టియన్ సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కర్నూలులో పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవ సమాజ సమావేశాల కోసం కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న శ్మశానవాటికలో స్థలం కొలత ఏర్పడింది. దీంతో అత్యక్రియలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థలాన్ని కేటాయించి శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల క్రిస్టియన్ మైనారిటీల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలను విలీనంపేరుతో కొట్టేశారు. కర్నూలులో క్రిస్టియన్ సోదరుల విజ్జప్తి మేరకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తాం. శ్మశాన వాటికకు అవసరమైన కొత్త స్థలాన్ని కూడా కేటాయిస్తాం.
లోకేష్ ను కలిసిన లేబర్ కాలనీ వాసులు
కర్నూలు 45వవార్డు లేబర్ కాలనీ వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా కాలనీలో పక్కా ఇళ్ల కోసం 600మంది దరఖాస్తు చేస్తే, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మా డివిజన్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో మా డివిజన్ లో 1200 మంది పెన్షన్లు తీసుకోగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 350కి కుదించారు. ఇంటిపన్నులు, విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. చెత్త పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో సమయం కుదిరినప్పుడు వెళ్లి రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకునే వాళ్లం. కానీ ఇప్పుడు రేషన్ వాహనాల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గతంలో రూ.1200 ఉన్న ట్రక్కు ఇసుక ప్రస్తుతం రూ.6,500 అయింది. రోడ్డు ప్రక్కన ద్విచక్ర వాహనాలు ఆపితే భారీఎత్తున చలాన్లు వేస్తూ దోచుకుంటున్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జగన్ పేదలకు సెంటుపట్టాల పేరుతో రూ.7వేల కోట్ల దోచుకున్నారు. ఆవాసయోగ్యం కాని కొండలు, గుట్టల్లో ఇచ్చిన స్థలాలు కూడా వైసిపి కార్యకర్తలకు పంచుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం. రేషన్ వాహనాల దోచుకునేందుకే ఇంటివద్దకే రేషన్ ప్రవేశపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇసుకలో రూ.10వేల కోట్లు దోచుకున్నారు. TDP అధికారంలోకి వచ్చాక ఇసుక విధానాన్ని సరళీకరించి ప్రజందరికీ ఇసుక అందుబాటులోకి తెస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన విద్యార్థి సంఘ ప్రతినిధులు
కర్నూలు అశోక్ నగర్ లో తెలుగు విద్యార్థి సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో.నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించాలి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను పునరుద్ధరించి, పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెచ్చి విద్యా కానుక, యూనిఫామ్ ను పూర్తి స్థాయిలో అందిరికీ అందించాలి. పాఠశాల విలీన ప్రక్రియకు సంబంధించి జోవోలు 84, 85, 117, 128ని రద్దు చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతోపాటు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.3లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలి. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవిద్యార్థులకు విద్యను దూరం చేసేవిధంగా తప్పుడు విధానాలను అవలంభిస్తున్నాడు. పీజీ విద్యార్థులకు విద్యను దూరం చేసే జిఓ 77ని రద్దుచేసి, పాత ఫీ రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలులోకి తెస్తాం. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం పేరుతో భూముల్ని దోచుకునేందుకు ప్రయత్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపర్చి, నాణ్యమైన విద్యను అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీ పోస్టులన్నీ భర్తీచేస్తాం.
దివ్యాంగ చర్మకారుడికి కలిసి కష్టాలు తెలుసుకున్న లోకేష్
కర్నూలు బస్టాండు సమీపంలో చెప్పులు కుడుతున్న చర్మకారుడు నాగన్నను కలిసిన యువనేత లోకేష్, ఆయన కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చర్మకారుడు నాగన్న మాట్లాడుతూ… నేను దివ్యాంగుడిని, ప్రతిరోజు ట్రైసైకిల్ పై పందిపాడునుంచి కర్నూలు వచ్చి చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్నా. రోజంతా పనిచేస్తే రూ.400 వస్తాయి. పెరిగిన నిత్యవసరాలు, విద్యుత్ బిల్లులతో వచ్చే సంపాదన ఏ మూలకు సరిపోవడం లేదు. గత నెలలో రూ.3,500 కరెంటు బిల్లు వచ్చింది, నాకువచ్చే రూ.3వేల పించనుకు మరో 500 కలిపి కరెంటు బిల్లు కట్టాను. నాకు నలుగురు బిడ్డలు ఉన్నారు. ఆడపిల్లకు పెళ్లిచేసి పంపించాను, ముగ్గురు మగపిల్లలు ఆటోతోలుకుని జీవనం సాగిస్తున్నారు.
యువనేత లోకేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలు బతకడమే కష్టంగా మారింది. ఇప్పటివరకు 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్రప్రజల నడ్డివిరిచారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం. నాగన్నలాంటి పేద చర్మకారులకు సబ్సిడీ రుణాలను అందజేసి ఆదుకుంటాం. మరో ఏడాది ఓపిక పట్టండి… రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.
* కర్నూలు 43వవార్డు పేదలను కలిసిన లోకేష్
కర్నూలు 43వవార్డులో పేదలు నివసించే కాలనీలోకి వెళ్లిన Nara Lokesh వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 43వవార్డు వాటర్ వర్క్స్ ఎదురుగా గత 30ఏళ్లుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. కూలీపనులు చేసుకుని జీవనం సాగించే మాకు మీ ప్రభుత్వం వచ్చా ఇళ్లు నిర్మించి ఇవ్వండి. మా గుడిసెలకు పగటిపూట విద్యుత్ ఇవ్వడం లేదు, దీంతో మా బస్తీ వాసులు ఇబ్బంది పడుతున్నాం. మీ ప్రభుత్వం వచ్చాక పగటిపూట కరెంటు సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నాం.
యువనేత లోకేష్ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం దోచుకోవడానికే జగనన్న ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సెంటుపట్టా పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్నారు. 30లక్షల ఇళ్లు కడతామన్న జగన్… నాలుగేళ్లలో కట్టింది కేవలం 5ఇళ్లు మాత్రమే. టిడిపి అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. 43వవార్డు బస్తీ వాసులకు పగటిపూట విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటాం. కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం. త్రాగునీరు అందిస్తాం
యువనేతను కలిసిన ముస్లిం మైనారిటీలు
కర్నూలు కార్ల్ మార్క్స్ నగర్ లో ముస్లిం మైనారిటీ ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ముఖ్యమంత్రి జగన్ మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది. మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్ ల అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విఫలమయ్యారు. దుల్హన్ పథకానికి ఆంక్షలు పెట్టి ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేసింది. మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయిస్తామన్న హామీ నెరవేర్చలేదు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది. విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసి, పేద ముస్లిం విద్యార్థులకు ఉన్నత విద్యను దూరంచేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముస్లింలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ముస్లిం మైనారిటీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను యథేచ్చగా కబ్జా చేస్తున్నారు. పలమనేరులో మిస్బాను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. నంద్యాలలో వైసిపినేతల వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మసీదు ఆస్తుల కబ్జాపై ప్రశ్నించిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణం. వక్ఫ్ ఆస్తులను, కబరస్తాన్ లను వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తాం. ముస్లింల ఉపాధికి ఉపకరించేలా ఇస్లామిక్ బ్యాంక్ ను ఏర్పాటుచేస్తాం. దుల్హన్ పథకాన్ని గతంలో మాదిరిగా కొనసాగిస్తాం. మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్ లను అభివృద్ధి చేస్తాం.
యువనేతను కలిసిన అమీర్ హైదర్ ఖాన్ నగర్ వాసులు
కర్నూలు 48వవార్డు అమీర్ హైదర్ ఖాన్ నగర్ వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏళ్ల నుండి 48వ వార్డులో 250 కుటుంబాలు నివసిస్తున్నాం. ఇక్కడ సరిగా డ్రైనేజీ కాలువలు లేవు. రోడ్లు లేక వర్షాలు వస్తే ఇబ్బందులు పడుతున్నాం. మంచినీటి సమస్య వెంటాడుతోంది, ఎండాకాల వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతంలో చాలామందికి ఇళ్లులేవు, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
స్థానిక ఎమ్మెల్యే, మేయర్ దోచుకోవడంపై శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు నగరంలో ఇంటింటికీ కుళాయి అందజేసి, తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. రోడ్లు, డ్రైనేజిలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం. పేదలకోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకారం అందించండి.
నారా లోకేష్ ను కలిసిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులు
కర్నూలు 48వ డివిజన్ ప్రకాష్ నగర్ లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ సబ్ ప్లాన్ ను నిధులను మాకు మాత్రమే ఖర్చుచేయాలి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రుణాలు అందించాలి. ప్రైవేట్, అన్ ఎయిడెడ్, డిగ్రీ కాలేజీల్లో టైమ్ స్కేల్ తో పాటు ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ బ్లాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. విపత్తుల సమయంలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లకు భృతి అందించాలి. ప్రతి ప్రైవేటు ఉద్యోగికి ప్రభుత్వమే ఆరోగ్య పథకాలు, బీమా సౌకర్యం కల్పించాలి.ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉంటున్న యువత జీవితాల్లో మార్పులు తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్సీలను మాత్రమే ఇంఛార్జ్ లుగా నియమించి, అగ్రవర్ణాల పెత్తనం లేకుండా చేయాలి. పెన్షన్ తీసుకునే ఉద్యోగులకు సరైన సమయంలో పెన్షన్ రావడం లేదు. మా వార్డులో శుభకార్యాలయాలు చేసుకోవడానికి కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.33,504 కోట్లు దారి మళ్లించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి, కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు వంటి వాటి కొనుగోలు మేము సహకరిస్తే.. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఒక్క రుణం కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు గతంలో భర్తీ చేశాం..మళ్లీ భర్తీ చేస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగిత యేటా పెరుగుతోంది. పరిశ్రమలు తీసుకొస్తాం..నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. యేటా జాబ్ కేలండర్ ను జనవరిలో విడుదల చేసి, ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
Also, read this blog:Walk for a Cause: Yuvagalam Padayatra
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh