యువనేతకు ఉమ్మడి కర్నూలు ప్రజల అపూర్వ స్వాగతం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు డోన్ నియోజకవర్గంలో తొలిరోజే సమస్యల వెల్లువ
డోన్: తాడిపత్రి నుంచి డోన్ నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్రకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. యువనేతకు మహిళలు నీరాజనాలు పట్టగా, యువకులు పూలవర్షం కురిపించి బాణసంచా కాలుస్తూ జేజేలు పలికారు. అంతకుముందు తాడిపత్రి నియోజకవర్గం చందన గ్రామంలో లోకేష్ ని చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు తెలిపారు. టిడిపి ప్రభుత్వం వస్తే పన్నుల భారం, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. సరిహద్దు గ్రామానికి దైవాలకుంట మహిళలు తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను యువనేత దృష్టికి తెచ్చారు. కలెక్టర్ కు విన్నవించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక తాగునీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పి యువనేత ముందుకు సాగారు. డి. రంగాపురం వద్ద లోకేష్ కి ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో యువనేత సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. నల్లమేకలపల్లి గ్రామస్తులు యువనేతను కలిసి తాము బోర్లకింద వ్యవసాయం చేస్తున్నామని, చెరువుకుంట శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడు లేడని వాపోయారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక మరమ్మతులు చేయిస్తామని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు.
యువనేతతను తాడిపత్రి కౌన్సిలర్ల భేటీ
రాయలచెరువు క్యాంప్ సైట్ లో తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు యువనేత లోకేష్ తో భేటీ అయ్యారు. తాడిపత్రి లో అధికార పార్టీ, పోలీసులు అధ్వర్యంలో జరుగుతున్న దౌర్జన్యాలను లోకేష్ దృష్టికి తెచ్చారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుని మహిళా కౌన్సిలర్లు యువనేతకు వివరించారు.డిఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి వైసిపి కండువా కప్పుకొని టిడిపి నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అన్ని నాకు తెలుసు, ఎవరిని వదిలిపెట్టను. కార్యకర్తలు, నాయకుల పై అక్రమ కేసులు పెట్టి వేధించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి అధికారుల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరూ ధైర్యంగా పోరాడుతున్నారంటూ కౌన్సిలర్లను అభినందించారు.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
జీతం సరిగా ఇవ్వడంలేదు-ఆర్.శివయ్య, జలదుర్గం, డోన్.
నేను జలదుర్గం పంచాయితీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాను. నెలకు రూ.6వేల జీతం ఇస్తున్నారు. జీతం ఇచ్చి 3నెలలు అవుతోంది. ఇచ్చే కొద్దిపాటి జీతమైనా గతంలో నేరుగా నా అకౌంట్ లో పడేవి. సర్పంచ్, విఆర్ఓలు కలిసి వేధింపులకు గురిచేస్తున్నారు. గంట ఆలస్యమైన రెడ్ మార్క్ పెట్టి జీతం కట్ చేస్తున్నారు. కాల్వల్లో మురుగుతీయడనికి వెళ్తే కనీసం మాస్కులు, గ్లౌజులు ఇవ్వడం లేదు. పనికూడా నెలమార్చి నెల ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.
పెన్షన్ ఇవ్వడంలేదు!-మహాదేవి, వెంకటాపురం, డోన్.
నాభర్తకు చిన్నతనంలోనే ఎడమకన్ను పోయింది. గతంలో పెన్షన్ వచ్చేది. మూడేళ్లక్రితం తీసేశారు. పెన్షన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా ఇదిగో, అదిగో అంటున్నారు తప్ప రావడం లేదు. కన్నులేకపోవడం వల్ల ఇతర పనులు చేయలేకపోతున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. నేను పొలంపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నా. రేషన్ బియ్యం తప్ప ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందడం లేదు.
టిడిపితోనే దళితులకు సామాజిక న్యాయం! దళితులనుంచి లాక్కున్న భూములు వారికే కేటాయిస్తాం, దళితుల శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తాం, ఎస్సీలతో ముఖాముఖిలో యువనేత లోకేష్
డోన్: ఎస్సీల సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని టిడిపి యువనేత Nara Lokesh స్పష్టంచేశారు. డోన్ నియోజకవర్గం బక్కసానికుంటలో ఎస్సీ సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2001 లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు. దాని ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయి. వేల మందికి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. వైయస్ వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన నాటకం, జగన్ పాలనలో జరుగుతున్న నాటకం మీరు చూస్తున్నారు. సుప్రీం కోర్టు పార్లమెంట్ లో చట్టం ద్వారా వర్గీకరణ చెయ్యాలని డైరెక్ట్ చేసింది. ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో చంద్రబాబు నాయుడు జీఓ 25 తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాల అమలు లో వర్గీకరణ తీసుకొచ్చారు. ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా జీఓ 25 తీసుకొచ్చారు చంద్రబాబు. జీఓ 25 ఆధారంగానే జగన్ మూడు కార్పొరేషన్లు తీసుకొచ్చారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్కరికి రుణం ఇవ్వలేదు. టిడిపి సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది. దళితుల్లో ఉన్న 62 ఉపకులాలకు న్యాయం చేస్తాం.
ఎస్సీ సోదరుల కోసం స్టేషన్ కు వెళ్లా!
న్యాయం చెయ్యమని పోరాటం చేసినందుకు. గుంటూరు లో రమ్య అనే దళిత యువతి ని ఒక మృగాడు నడి రోడ్డు మీద హత్య చేసాడు. ఆ కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగినందుకు నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి 5 లక్షలు సాయం చేసాం. న్యాయ పోరాటానికి కూడా సాయం చేసాం. అమరావతి దళిత రైతుల కోసం పోరాడినందుకు రెండో సారి స్టేషన్ కి వెళ్ళాను. కావలి లో వైసిపి నాయకులు వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే టిడిపి ఆదుకుంది. 15 లక్షల ఆర్ధిక సాయం అందించి తనఖాలో ఉన్న ఇల్లు విడిపించి కుటుంబానికి అందజేసాం. దళిత యువతి స్నేహాలతను చంపేస్తే పోరాడింది టిడిపి. రెండు లక్షల ఆర్ధిక సాయం అందించాం. రేపల్లె రైల్వే స్టేషన్ లో ఒక దళిత మహిళ పై అత్యాచారం జరిగితే ఆమె న్యాయం చెయ్యాలి అని పోరాడింది టిడిపి. ఆమె కు రెండు లక్షల ఆర్ధిక సాయం చేసింది టిడిపి. ఎన్ఎస్ఎఫ్డీసి పథకం ద్వారా ఇన్నోవాలు, జేసిబిలు పొందిన వారు వైసీపీ ప్రభుత్వ పాలన లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలన, కరోనా కారణంగా ఇబ్బంది పడిన లబ్దిదారులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులనుంచి లాక్కున్న భూములు వారికే కేటాయిస్తాం. శ్మశానం భూములు లేవని ఎంతో మంది నా దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల శ్మశానాల కోసం భూములు కేటాయిస్తాం.
దళిత ద్రోహి వైసీపీ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం దళిత ద్రోహి. టిడిపి పరిపాలనలో ఎప్పుడూ ఎస్సీల పై దాడులు జరగలేదు. టిడిపి హయాంలో 3 వేల ఎకరాలు భూమి కొనుగోలు చేసి మరీ దళితులకు ఇచ్చాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు భూమి కేటాయింపు కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తాం. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. విదేశీ విద్య పథకం కి అంబేద్కర్ పేరు తొలగించడం దుర్మార్గం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. జగన్ పేరు తొలగించి అంబేద్కర్ గారి పేరు పెడతాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం పై చర్చిస్తు న్నాం. త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం.
అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు
దళితుల పై అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీని పై విచారణ చేసి అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎస్సీలకు అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అమలు చేస్తాం. దళితులకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తాం. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఘోరమైన పరిస్థితి ఉంది. దీనిపై టిడిపి పోరాటం చేస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్ఫేర్ హాస్టల్స్ ని మెరుగుపరుస్తాం. టిడిపి హయాంలో ఎస్సీ ల కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేసాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఎస్సీలకు 100 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. దళితులు అంతా ఎవరి హయాంలో న్యాయం జరిగిందో అర్దం చేసుకోవాలి.
డోన్ ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ…
ఎన్ఎస్ఎఎఫ్ డిసి పథకం కింద గత ప్రభుత్వం లో స్వయం ఉపాధికి అనేక అవకాశాలు కల్పించారు. ఇన్నోవాలు, జేసిబిలు అందించారు. ఇప్పుడు ఆ పథకం అమలు కావడం లేదు. జగన్ పాలన వచ్చిన తరువాత బిజినెస్ లేదు. పైగా కరోనా దెబ్బతో ఈఎంఐ లు కట్టలేని దుస్థితి. గత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిని వైసిపి ప్రభుత్వం వెనక్కి తీసుకుందని దళిత మహిళ రమణమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. ఎస్సీలకు స్మశాన వాటికలు కూడా లేవు. ఉన్న స్మశాన భూమిని కూడా వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారు. టిడిపి హయాంలో జరిగిన వర్గీకరణ వలన దళితుల్లో అన్ని ఉప కులాలకు న్యాయం జరిగింది. కానీ సుప్రీం కోర్టు తీర్పు వలన మాకు నష్టం జరిగింది. టిడిపి అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు. దళితుల భూముల్ని వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారు. దళితుల ఉన్నత విద్యకు ఉపయోగపడిన విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. అంబేద్కర్ గారి పేరు తొలగించారు. మళ్లీ పథకం ప్రారంభించి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి.
ఎస్సీలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
రమణమ్మ: మా 5ఎకరాల పొలం పండించుకోలేక మూడేళ్లు బీడుపెట్టుకున్నాను. ప్రభుత్వం స్థలాల కోసం నా పొలాన్ని ప్రభుత్వం లాక్కుంది. తిరిగి ఇచ్చేస్తామని అధికారులు చెప్పారు. నేటికీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. మీరే నాకు న్యాయం చేయాలి.
కృష్ణన్న: ఉమ్మడి జిల్లాలో దళితులకు శ్మశానాలు సరిపడా లేవు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు శ్మశానాలకు స్థలాలు కేటాయించండి.
లక్ష్మీదేవి: దళితుల ప్రాణాలకు వైసీపీ పాలనలో రక్షణ లేదు. మహిళల మాన,ప్రాణాలకు రక్షణ లేదు. దళితుల పట్ల విపరీతమైన వివక్ష చూపుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.
అక్కులప్ప: వైసీపీ ప్రభుత్వం విదేశీవిద్య పథకానికి అంబేద్కర్ పేరును తీసేశారు. పథకాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. మీరు అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని కొనసాగించండి.
రామచంద్రుడు: ఎస్సీ గురుకులాల పట్ల వైసీసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యావ్యవస్థ సరిగా లేదు. మీరు అధికారంలోకి వచ్చాక గురుకులాల ద్వారా ఇంటర్ వరకు ఉన్న విద్యను డిగ్రీ వరకు కొనసాగించండి.
గుక్కెడు నీళ్లకోసం అవస్థలు పడుతున్నాం తోపుడుబండ్లతో పొలాల నుండి నీళ్లు తెచ్చుకుంటున్నాం, నారా లోకేష్ తో దైవలమడుగు మహిళల ఆవేదన
డోన్ నియోజకవర్గం దైవాలమడుగులో మహిళలు యువనేత లోకేష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దైవలమడుగు గ్రామంలో 200 ఇళ్లు ఉన్నాయి. అన్ని ఇళ్లకూ ఒక్కటే బోరు ఉంది. ఆ ఒక్క బోరుకు కూడా అరఇంఛ నీరు రావడం లేదు. నీళ్ల కోసం పోలాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. అవి కూడా త్రీ ఫేస్ కు వచ్చినప్పుడు మాత్రమే మోటార్లు ఆడుతాయి. రైతుల పొలాలకు డ్రిప్పు మందు వదలడం వల్ల ఆ నీళ్లు తెచ్చుకుని తాగడం వల్ల పలుమార్లు అనార్యోగపాలయ్యాం. పొలాల్లోకి వెళ్లినా పంటలకు నీళ్లు అందడం లేదని, పంటను తొక్కుతున్నారని రైతులు కోప్పడుతున్నారు. తాగునీరు తెచ్చుకునేందుకు ఒక మనిషి పని మానుకుని ఇంటి వద్దే ఇండాల్సి వస్తోంది. నీళ్లు తెచ్చుకోవాలంటే ఇంటికి ఒక తోపుడుబండి, పదిహేను బిందెలు ఉండాల్సిందే. నిండుబిందెలు ఉన్న బండ్లు లాగలేక మహిళలు ఒక్కోసారి కిందపడిపోతున్నారు. గ్రామంలో ఏదైనా శుభకార్యం ఉంటే మంచినీటి ట్యాంకర్లకు వేల రూపాయలు ఖర్చు అవుతోంది. దైవాలమడుగుకు రాయలచెరువు నుండి గతంలో మంచినీళ్లు వచ్చేవి. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా రాయలచెరువు నుండి దైవాలమడుగుకు తాగునీరు వచ్చేవి. కానీ రాయలచెరువు నుండి చందన వరకు ఉన్న పైపులైన్లు మరమ్మతులు చేయకపోవడంతో ప్రెజర్ తట్టుకోలేక పగిలిపోయాయి. మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదు. అనంతపురం జిల్లాకు సరిహద్దుల్లో ఉండటం వల్లే మాకు ఈ కష్టాలు. ఎన్నోసార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా, కలెక్టరుకు వినతిపత్రాలిచ్చినా మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు.
*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*
ప్రజలకు గుక్కెడు తాగునీరు అందించలేని చేతగా ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. అనంతపురం సరిహద్దు గ్రామాల్లో కర్నాటక మద్యం పారుతుంది తప్ప..చుక్కనీరు దొరకడం లేదు. అక్రమంగా మట్టితోలుకోవడానికి రాయలచెరువులో నీటిని నింపడం లేదు. TDP అధికారంలోకి రాగానే రాయలచెరువుకు నీళ్లు నింపి, పైపులైన్ల మరమ్మతులు చేసి దైవలమడుగుకు తాగునీళ్లు అందిస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన నల్లమేకలపల్లె గ్రామస్తులు
డోన్ నియోజకవర్గం నల్లమేకలపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామమంతా బోర్ల కింద వ్యవసాయం చేస్తున్నాం. గ్రామంలోని చెరువుకుంట శిథిలావస్థకు చేరుకుంది. దీనికి మరమ్మతులు చేయాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. చెరువుకుంటలో నీళ్లుంటేనే బోర్లకు నీరు పుష్కలంగా అందుతుంది. వ్యవసాయం బాగుంటుంది, పశువులకు నీటి ఎద్దడి లేకుండా ఉపయోగకరంగా ఉంటుంది. చెరువుకుంట మరమ్మతులు చేయించి ఆదుకోవాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ…
టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు సబ్సిడీలు, యంత్రపరికరాలు అందించి అండగా నిలిచాం. రాయలసీమలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఇక్కడి ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం రూ.11వేల కోట్లరూపాయలు ఖర్చుచేసింది. మేం అధికారంలోకి వచ్చాక చెరువుకుంట కు మరమ్మతులు చేయిస్తాం. నల్లమేకలపల్లిలో వ్యవసాయం, పశువులకు నీటి సమస్యలేకుండా చేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన పీఆర్ పల్లె గ్రామస్తులు
యువనేత నారా లోకేష్ ను డోన్ నియోజకవర్గం పిఆర్ పల్లి గ్రామస్తులు కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉంది. ఇళ్ల ముందు మురికినీరు నిల్వ ఉండడం వల్ల అనునిత్యం అనారోగ్యం పాలవుతున్నాం. వర్షాకాలమొస్తే మా పరిస్థితి దారుణం. కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు లేవు. అధికారలోకి వచ్చాక డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాలని కోరుతున్నాం. మంచినీటిబోర్లు సరిపడా లేక తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. మాకు 10కిలోమీటర్ల దూరంలో కాలేజీలు ఉన్నాయి. అంత దూరం వెళ్లలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు. జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి. టీడీపీ పాలనలో మంజూరైన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపేసింది. మీరు అధికారంలోకి వచ్చాక బిల్లులు విడుదల చేయించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ….*
టీడీపీ పాలనలో ప్లానింగ్ కమిషన్ నిధులను సద్వినియోగం చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. కనీసం రోడ్లపై తట్టిమట్టి పోసిన దాఖలాలు లేవు. మేం అధికారంలోకి వచ్చాక పిఆర్ పల్లిలో డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్లు నిర్మిస్తాం. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అందిస్తాం. జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. టీడీపీ పాలనలో మంజూరై బిల్లలు ఆపేసిన ఇళ్లకు బిల్లులను విడుదల చేస్తాం.
Also, read this blog: Nara Lokesh’s Strive for Excellence in Yuvagalam
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh