జోరువానలోనూ కొనసాగిన యువనేత పాదయాత్ర వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లోకేష్ ను కలిసిన జనం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం

ఎమ్మిగనూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 84వరోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. నందవరం శివార్లలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువనేత నారా లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. గొడుగును కూడా యువనేత తిరస్కరించారు. వర్షం తీవ్రమైన సమయంలో కొద్దిసేపు ఆగి వెళ్దామన్న నేతల సూచనను సైతం ఆయన తిరస్కరించారు. యాత్ర ప్రారంభమయ్యాక ఎట్టి పరిస్థితుల్లో ఆగేదిలేదంటూ పాదయాత్ర కొనసాగించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జనం యువనేతకు దారిపొడవునా ప్రజలు ఘనస్వాగతం పలికి తమ సమస్యలను చెప్పుకున్నారు. రైతులు, బిసిలు, ఎస్సీలు, నిరుద్యోగులు, మహిళలు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. రాబోయే TDP ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి ముందుకు సాగారు. ముగటి గ్రామంలో యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మిగనూరు ప్రజలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. 84వరోజు 7.2 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర… ఇప్పటివరకు 1081.1 కిలోమీటర్లు పూర్తయింది.  

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

వచ్చే నాలుగురాళ్లు ఫైన్లతో లాగేస్తున్నారు -నరసింహులు, ఆటోడ్రైవర్, ఉరకుంద.

నేను ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నా. నాలుగేళ్లలో రెండుసార్లు మాత్రమే వాహన మిత్ర వచ్చింది. వాహనమిత్ర ఇస్తున్నారన్న పేరుకేగానీ రకరకాల సాకులతో ఫైన్లు వేస్తూ లాగేస్తున్నారు. గతంలో రూ.100, 200 ఉండే ఫైన్లు ఇప్పుడు రూ.2వేలకు పెంచారు. వారంలో కనీసం రెండుసార్లు ఫైన్లతో బాధుతున్నారు. రోడ్ ట్యాక్స్ గతంలో రూ.700 ఉంటే ఇప్పుడు రూ.1800 అయింది. డీజిల్ రేటు దాదాపు రెట్టింపు అయింది. రోజుకు రూ.వెయ్యితోలితే కూలీ గిట్టుబాటు అవుతుంది. అయితే వచ్చే కొద్దిపాటి ఆదాయం ఫైన్ల రూపంలో లాగేస్తున్నారు. వాహనమిత్ర ఇవ్వకపోయినా ఫర్యాలేదు, ఫైన్ల బెడద తప్పిస్తే సరిపోతుంది. యూనిఫాం లేదనే సాకుతో కూడా ఫైన్లు వేస్తున్నారు, ఇది చాలా దారుణం.

చేదోడు సాయం అంతంతమాత్రమే -ఉబాలి చాంద్ బాషా, టైలర్, నందవరం

నాలుగేళ్లలో జగనన్న చేదోడు కింద 10వేలు ఒకేసారి వచ్చింది. మా ఊళ్లో 70మంది టైలర్లు ఉంటే 10మందికి చేదోడు ఇచ్చారు. గతంలో 400 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రెట్టింపు అయింది. రెడీమేడ్ వచ్చాక ఇప్పుడు బట్టలు కుట్టించుకునే వారు తగ్గిపోయారు. రోజంతా పనిచేసినా కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు.

ఖర్చులు రెట్టింపు అయ్యాయి!

-మాచర్ల నజీర్, ఎలక్ట్రీషియన్, నందవరం

నేను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాను. గతంలో నెలకు రూ.30వేలు వస్తే అన్నీ ఖర్చులు పోనూ 20వేలు మిగిలేవి. ఇప్పుడు ఖర్చులు రెట్టింపు అయ్యాయి. ఇసుక అందుబాటులో లేక పనుల్లేవు. గతంలో ఆదరణ కింద 700 డిడి కడితే రూ.3,800 విలువచేసే డ్రిల్లింగ్ మిషన్ ఇచ్చారు. బిసి కార్పొరేషన్ 50శాతం సబ్సిడీపై లక్షరూపాయల రుణం ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు లేవు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు.

యువనేతను కలిసిన వడ్డెర సామాజికవర్గీయులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో వడ్డెర సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. టీడీపీ పాలనలో మాకు కులవృత్తి పనిముట్లు అందేవి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందేది. గతంలో మాకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. వైసీపీ పాలనలో మాకు ఇవేవీ కనిపించడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్ధరించాలి.

లోకేష్ మాట్లాడుతూ…

బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుది.బీసీలను బ్యాక్ బోన్ అని పొగిడి నేడు వాళ్ల బ్యాక్ బోన్ విరిచిన వ్యక్తి జగన్. వడ్డెర్ల నుండి వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలను తిరిగి అప్పగిస్తాం. విధులు, నిధులు, కూర్చోడానికి కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు ఇచ్చి జగన్ మోసం చేశారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని మేము తలపెడితే వైసీపీ నిలిపేసింది. అధికారంలోకి వచ్చాక వాటిని మేము పూర్తి చేస్తాం. దామాషా ప్రకారం వడ్డెర కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం. వడ్డెర్లకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.

యువనేతను కలిసిన మాదాసి కురవ సామాజికవర్గీయులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో మాదాసి కురువ సామాజికవర్గ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మాదాసి కురువ, మాదారి కురువలు 1991లో వచ్చిన ఏపీ ఎస్సీ లిస్టు 31వ నంబర్ జాబితాలో ఉన్నారు. తర్వాత మమ్నల్ని బీసీల్లో చేర్చి మాకు అన్యాయం చేశారు. మాకు కురుబలగానే క్యాస్ట్ సర్టిఫికెట్లు వస్తున్నాయి. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ వాల్లు మాకు కురువ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణా ప్రభుత్వం మెమో నంబర్ 1268ను జారీ చేసింది. మీరు అధికారంలోకి వచ్చాక మాదాసి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి ఆదుకోవాలి. మా కులంలో చదువుకున్నవారు తక్కువగా ఉన్నారు. విద్యలో ప్రోత్సహించాలి.

లోకేష్ స్పందిస్తూ….

మాదాసి కురవలు ఎస్సీ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బందిపడుతున్న అంశం నా దృష్టికొచ్చింది. ఏపీ ఎస్సీ లిస్ట్ 31ని, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఆదేశాలను పరిశీలించి మాదాసి కురవలకు న్యాయం చేస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయిస్తాం.

యువనేతను కలిసిన దళితులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం రెయిన్ బో స్కూలు వద్ద హలహర్వి గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. వైసీపీ పాలనలో మాకు సంక్షేమ పథకాలు దూరం అయ్యాయి. ఎస్సీ కార్పొరేషన్ నుండి సబ్సిడీ లోన్లు రావడం లేదు. నవరత్నాలకు మా సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి మాకు అన్యాయం చేస్తున్నారు. గత ప్రభుత్వం మాకు అమలుచేసిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక రద్దయిన దళిత సంక్షేమ పథకాలు పునరుద్ధరించండి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

ఎస్సీలకు మాత్రమే ఖర్చు చేయాల్సిన రూ.28,149 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ దారిమళ్లించి దళితులకు తీరని అన్యాయం చేశారు. దళిత డాక్టర్  సుధాకర్ ను దారుణంగా హింసించి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే బాణాసంచా కాల్చి ఊరేగించారు. ఎస్సీల సంక్షేమానికి టీడీపీ ప్రవేశపెట్టిన 27 పథకాలను జగన్ రద్దు చేశాడు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టిన దుర్మార్గ ప్రభుత్వమిది. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. దళితులపై బనాయించిన తప్పుడు కేసులు రద్దుచేస్తాం.

యువనేతను కలిసిన బిసి సామాజికవర్గీయులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం ఆలయం వద్ద హలహర్వికి చెందిన బీసీ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. జగన్ అధికారంలోకి వచ్చాక మాకు కులవృత్తి చేసుకునేందుకు పనిముట్లను ఇవ్వడం లేదు. గొర్రెలు మేపుకునే వారికి సబ్సిడీపై గొర్రెలు ఇవ్వడం లేదు. బీసీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి మాకు అన్యాయం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చక గతంలో మాదిరి ఆదరణ పథకంలో పనిముట్లు అందించాలి. బిసి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయాలి. బీసీలకు గతంలో ఇచ్చిన పథకాలు పునరుద్ధరించాలని వినతి.

 యువనేత లోకేష్ మాట్లాడుతూ …

బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన బీసీ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు టీడీపీ ఇస్తే..వాటిని 24 శాతానికి జగన్ తగ్గించి అన్యాయం చేశారు.  వైసిపి అధికారంలోకి వచ్చాక 26 వేలమంది బీసీలపై ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించింది.  27మంది బీసీలను వైసీపీ నేతలు దారుణంగా హతమార్చారు. టిడిపి అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం.ఆదరణ పథకాన్ని పునరుద్దరించి కులవృత్తులవారికి పనిముట్లు అందజేస్తాం. గతంలో బీసీలకు ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలన్నీ పునరుద్దరిస్తాం.

యువనేతను కలిసిన జగ్గాపురం గ్రామస్తులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం జగ్గాపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.  మా గ్రామంలో తాగునీటి సమస్య అత్యధికంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం మా తాగునీటి కష్టాలను పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా తాగునీటి సమస్యల్ని పరిష్కరించాలి. జగ్గాపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటుచేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాయలసీమ పల్లెలకు గుక్కెడు మంచినీళ్లివ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం. జగ్గాపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తాం.

యువనేతను కలిసిన బాపురం గ్రామస్తులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం హెచ్.బాపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో సీసీ రోడ్లు లేవు. డ్రైనేజీ పూడికలు తీయడం లేదు. చిన్న వర్షానికే వీధులు నీటి కుంటలను తలపిస్తున్నాయి. కొత్తగా నీటి కుళాయిలు ఇవ్వడం లేదు.  ఉన్న కుళాయిల్లో మూడురోజులకు ఒకసారి అరకొరగా నీళ్లు వస్తున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది. వీధిలైట్లు పాడైతే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 15రోజులకు ఒకసారి కూడా పొలాలకు సాగునీరు ఇవ్వడంలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

కేంద్రం నిధులతో పాటు రాష్ట్రప్రభుత్వం అదనంగా నిధులిచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉండగా, పంచాయితీలకు 14,15 ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చిన రూ.8,660 కోట్లను జగన్ దొంగిలించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక గ్రామసీమలను నిర్వీర్యం చేశారు. కనీసం వీధిలైటు పోయినా పట్టించుకునే దిక్కులేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామాలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం. గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమ రైతుల కష్టాలు తీరుస్తాం.

యువనేతను కలిసిన నిరుద్యోగ యువకులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం ముగతిలో నిరుద్యోగ యువకులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు.  మా ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది. నాలుగేళ్లుగా ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.  టిడిపి హయాంలో ఇచ్చిన నిరుద్యోగ భృతిని ప్రభుత్వం రద్దు చేసింది.  మీరు అధికారంలోకి వచ్చాక మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకావాలు కల్పించండి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా గత నాలుగేళ్లలో 480మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతను నిలువునా ముంచాడు. ఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం. రాయలసీమలో పరిశ్రమలు  తెచ్చి యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించి, వలసలను నివారిస్తాం.

లోకేష్ ను కలిసిన రైస్ మిల్లర్స్ ప్రతినిధులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం ముగతిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎల్.ఎల్.సీ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. కర్నాటక రైతుల జల చౌర్యం వల్ల ఈ ప్రాంత రైతులకు నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో రైతులు వాణిజ్యపంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ధాన్యం దిగుబడి తగ్గడంతో మిల్లర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. పనిలేక మిల్లుల్లో పనిచేసే కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మిల్లుస్థాయిని బట్టి కస్టమ్ మిల్లింగ్ అవకాశం కల్పించి ఆదుకుంటోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మిల్లర్ల సమస్యలను పరిష్కరించండి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో రైతులనుంచి పూర్తిస్థాయి ధాన్యం సేకరించకుండా ప్రభుత్వం రైతులు, మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తోంది. సేకరించిన ధాన్యాన్ని సైతం కొద్దిమంది బడామిల్లర్ల మాఫియాకు అప్పగించి మిగిలిన వారందరి నోళ్లు కొడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పంటలకు పుష్కలంగా నీరందించడం ద్వారా ధాన్యం దిగుబడులు పెంచుతాం. ప్రభుత్వం సేకరించే ధాన్యాన్ని మిల్లుల స్థాయిని బట్టి అందరికీ మిల్లింగ్ చేసే అవకాశం కల్పిస్తాం.

లోకేష్ ను కలిసిన ఎమ్మిగనూరు రైతులు

ఎమ్మిగనూరుకు చెందిన పలువురు రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూసర్వే వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. దశాబ్ధాలుగా రైతులు సాగుచేసుకుంటున్న దస్తావేజులు లేని భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దస్తావేజులు లేని రైతులకు ఆత్మహత్యే శరణ్యంగా మారింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరగాల్సిన దస్తావేజు పనులను సచివాలయాలకు బదిలీ చేస్తే అవకతవకలు జరిగే అవకాశముంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లను నిర్వహించాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూరక్ష పథకం భూభక్షపథకంగా మారిపోయింది. సర్వేపేరుతో వంశపారంపర్యంగారైతులు సాగుచేసుకుంటున్న భూములను వైసిపినేతలు కబ్జా చేస్తున్నారు. లేని వివాదాలు సృష్టించి జగన్ అండ్ కో భూ ఆక్రమణలకు తెరలేపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాస్తవ అనుభవదారులకే భూములు దక్కేలా చేస్తాం. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసి, పాత విధానాన్ని కొనసాగిస్తాం.

యువనేతను కలిసిన ధర్మాపురం గ్రామస్తులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం ముగటిలో ధర్మాపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. మా గ్రామంలో శ్మశానవాటిక సమస్య ఉంది. వైసీపీ నాయకులు కావాలనే శ్మశానం లేకుండా చేశారు. డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు అందరికీ అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమపథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉంది. నీటి కుళాయిలు అందించాలి. మా గ్రామంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

జగన్ పాలనలో వైసిపి నేతలు శ్మశానాలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు చెందిన రూ.2,200 కోట్ల అభయ హస్తం నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించింది. టిడిపి హయాంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, పసుపు కుంకుమ కింద రూ.10 వేలు కలిపి రూ.21వేల కోట్ల సాయం అందించాం. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు రూ.5 లక్షల రూపాయల రుణసౌకర్యం కల్పించాం. జగన్ పాదయాత్రలో రూ.10లక్షల ఇస్తానని చెప్పి, 3లక్షలకు కుదించాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తాం, అభయ హస్తం పథకాన్ని పునరుద్దరిస్తాం. ఇంటింటికీ కుళాయి ఇచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తాం.

Also, read this blog:Yuvagalam’s Role in Bridging Cultures and Communities

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *