ఆదోని నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం అడుగడుగునా యువనేతకు ఘనస్వాగతం, నీరాజనాలు పెద్దతుంబళంలో భారీగా రోడ్లపైకి వచ్చిన జనం
ఆదోని: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం 78వరోజు పాదయాత్ర ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘన స్వాగతం పలికారు. పెద్ద తుంబళంలో యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభి,చింది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు లోకేష్ ను చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చారు. యువనేత రాకతో పెదతుంబళం ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. అడుడుగునా జనం యువనేతను చూసేందుకు పోటీపడ్డారు. తనని కలవడానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఆదోని శివారు కడితోట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. వికలాంగుడు దూదేకుల ఇస్మాయిల్ తన గోడు విన్పిస్తూ 3 ఎకరాల పొలం ఉంటే 30ఎకరాలు ఉందంటూ పెన్షన్ పీకేశారని ఆవేదన వ్యక్తంచేశారు. గణేకల్లు గ్రామస్తులు యువనేతను కలిసి తమ గ్రామంలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను యువనేత దృష్టికి తెచ్చారు. గణేకల్లు శివారులో సజ్జరైతును కలిసి ఆయన ఇబ్బందులను తెలుసుకున్నారు. జాలిమంచి గ్రామస్తులు తమ గ్రామానికి తాగు,సాగునీటి సమస్య పరిష్కరానికి ఎల్ఎల్ సి కెనాల్ నుంచి ఎత్తిపోతల పథకం నిర్మించాలని కోరారు. కుప్పగల్ వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బిసిలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే న్యాయవాదులు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చాక అందరికీ అండగా నిలుస్తామని చెప్పి యువనేత ముందుకు సాగారు. భోజన విరామానంతరం ప్రారంభమైన పాదయాత్ర పెదతుంబళం మీదుగా తుంబళం క్రాస్ వద్ద విడిదికేంద్రానికి చేరుకుంది.
మంచి నీళ్లు అడిగానని రెండు రోజులు జైళ్లో పెట్టించారు-బంట్రోతు జగదీష్, కాపటి, ఆదోని మండలం
గ్రామసభలో గ్రామంలోని నీటి సమస్యపై మాట్లాడాను. కానీ వైసీపీ నేతలు నాపై పోలీసులను పంపి అరెస్టు చేయించి రెండు రోజులు జైల్లో పెట్టించారు. నీటి సమస్య గురించి మాట్లాడటం తప్పా? డిగ్రీ బిఎస్సీ చదవి నాలుగేళ్లుగా ఖాళీగా ఉంటున్నా. బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఎల్ అండ్ టీ సంస్థ తరపున కాంట్రాక్టు ఉద్యోగం ఏడాదిపాటు చేశా. కరోనా రావడంతో తొలగించారు. జాబ్ నోటిఫిషన్లు కూడా లేకపోవడంతో పొలం పని చేసుకుంటున్నా.
తాపీ మేస్త్రీలకు ఈ ప్రభుత్వంలో పని దొరకడం లేదు-కుమ్ములదిన్నె తిక్కస్వామి, కుప్పగల్, ఆదోని మండలం
ఆదోని నియోజకవర్గంలో మొలిగనూరు నుండి ఇసుక రవాణా జరుగుతుంది. ప్రభుత్వ కొత్త ఇసుక విధానం తీసుకురావడంతో ఒక్కో టిప్పర్ రూ.22 వేల పెట్టి కొనాల్సి వస్తోంది. ట్రాక్టర్ల ప్రకారం అమ్మనివ్వడం లేదు. తోలుకుంటే ట్రిప్పర్ తోలుకోవాల్సిందే. జగనన్న కాలనీల నిర్మాణంలోకే నేను పనికి వెళ్తా. నెలకు మహా అయితే 6 రోజులు మాత్రమే పని ఉంటుంది. మిగతా రోజులు ఖాళీగా ఉంటున్నా. లబ్ధిదారులను గట్టిగా కూలీ అడగాలన్నా మనసు రావడం లేదు. వాళ్లు కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇళ్లు కట్టుకోలేకపోతున్నారు.
కొండలు, గుట్టల్ని కనపడనీయవా ప్రసాదూ?!
పాదయాత్ర దారిలో అక్రమ గ్రావెల్ టిప్పర్ ను గమనించిన యువనేత లోకేష్ అక్కడ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత మూడురోజులుగా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసాద్ అవినీతి చిట్టా నేను బయటపెడుతుంటే ఆయనేమో బూతుల పంచాంగం విన్పిస్తున్నాడు. ప్రసాద్ నేతృత్వంలో ఎర్రగట్టుకొండను తవ్వేసి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న దృశ్యమిది. రోజూ 50 టిప్పర్ల ఎర్రమట్టిని టిప్పర్ రూ.5వేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో కొండలు, గుట్టలు కన్పించకుండా చేస్తానని ఏమైనా శపథం చేశావా ఎమ్మెల్యే గారూ అంటూ చురకలంటించారు.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది అంగప్రదర్శనకా? దళితులపై దమనకాండ చేసిన వారిని నిలదీయండి అధికారంలోకి వచ్చాక బిసిలకు స్వర్ణయుగం తెస్తాం రాయలసీమ దాటే లోపు అభివృద్ధిపై బ్లూప్రింట్ ఇస్తాం బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
ఆదోని: వైసిపి నాయకులు ఎమ్మెల్యేలు అయ్యింది షర్టు, ప్యాంటు విప్పి అంగప్రదర్శన చెయ్యడానికా అని టిడిపి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. కుప్పగల్ విడిది కేంద్రం వద్ద బీసి సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… దళితులకు జగన్ చేసింది ఏమిటి అని నేను అంటే ఫేక్ వీడియో తయారు చేశారు. అది పట్టుకొని ఆదిమూలపు సురేష్ షర్టు విప్పి బాబు గారి కాన్వాయ్ పై రాళ్ళు వేశారు. అయ్యా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే దళితుల పై దమనకాండ చేస్తున్న వైసిపి ని ఎందుకు ప్రశ్నించలేదు? డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ ఎంతో మందిని వైసిపి నాయకులు చంపేస్తే సురేష్ గారు ఎందుకు నోరు విప్పలేదు? విదేశీ విద్య కు అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు సురేష్ గారు ఎక్కడ ఉన్నారు? దొంగ వీడియో తయారు చేసి హడావిడి చేసే సాక్షి యజమాని గారికి కి సవాల్ విసిరితే ఇప్పటి వరకూ సమాధానం లేదు.
టిడిపితోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు స్వర్ణయుగం తెస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. బీసీలకు పుట్టినిల్లు టిడిపి. బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే. ప్రజలు ఎప్పటికీ పేదరికం లో ఉండాలి అనేది జగన్ ఆలోచన. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అనేది నా కోరిక. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది టిడిపి. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టిడిపి. బీసీలని జగన్ నమ్మించి వెన్నుపోటు పొడిచారు. బీసీలకి 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేసింది వైసిపి.
సీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
రాయలసీమ ప్రాంతాన్ని హర్టికల్చర్ హబ్ గా మారుస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి సాగు నీరు అందిస్తాం. గతంలో ఎలా అయితే సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని అమలు చేశామో అలానే అందిస్తాం. రాయలసీమ దాటే లోపు రాయలసీమ అభివృద్దిపై బ్లూ ప్రింట్ విడుదల చేస్తాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం. నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బీసీ లకి రిజర్వేషన్లు కల్పించి పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉప కులాలకు నిధులు, సంక్షేమ కార్యక్రమాలు కేటాయిస్తాం. బిసి కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. దామాషా ప్రకారం ఉప కులాల వారీగా ముందు నియోజకవర్గం ఆ తరువాత మండల స్థాయిలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. పాలు ఇచ్చే ఆవు కావాలో, తన్నే దున్నపోతు కావాలో ఆలోచించుకోండి.
బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం
టిడిపి హయాంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. ఆదరణ పథకం-2 ద్వారా టిడిపి హయాంలో కొన్న పనిముట్లు బిసిలకు ఇవ్వకుండా వాటిని గోడౌన్స్ లో పడేసి తుప్పు పట్టేలా చేశారు. బీసీ విద్యార్థులకు అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు జగన్. వైసిపి ప్రభుత్వం బీసీలపై 26 వేల అక్రమ కేసులు పెట్టి వేధించింది. అందుకే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి కావాల్సిన ఆర్ధిక సహాయం కూడా ప్రభుత్వమే అందిస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవీకరణ పత్రాలను పంపుతాం.
వాల్మీకి బోయలకు వైసిపి మోసం
వాల్మీకి, బోయల్నీ వైసిపి ప్రభుత్వం మోసం చేసింది. వాల్మీకి, బోయల్ని ఎస్టీల్లో చేర్చాలని సత్యపాల్ కమిటీ వేసాం. అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టిడిపి. నాలుగేళ్లు పడుకొని ఇప్పుడు కొత్త తీర్మానం అంటూ వైసిపి వాల్మీకి, బోయలకు తీరని అన్యాయం చేశాడు. వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.200 కోట్లు నిధులు ఇచ్చింది టిడిపి. వాల్మీకిలు ఏ వృత్తి లో ఉన్నా వారిని ఆర్దికంగా ఆదుకోవడానికి సబ్సిడీ రుణాలు అందజేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కురుబ సామాజికవర్గం వారికి గొర్రెలు కొనడానికి రుణాలు అందిస్తాం. ఇన్స్యూరెన్స్ కల్పిస్తాం. మందులు తక్కువ ధరకు అందిస్తాం. దూదేకుల ముస్లీం లకు ఆదుకొనే బాధ్యత నాది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం. రజక సోదరులను ఆదుకుంది టిడిపి ప్రభుత్వం. గతంలో దోబి ఘాట్స్ , వాషింగ్ మిషన్, ఐరన్ బాక్సులు అందజేశాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాషింగ్ మెషిన్ తో పాటు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.
బీసీలు తమ సమస్యలను వివరిస్తూ…
వైసిపి ప్రభుత్వం బీసీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. వాల్మీకి, బోయ లకు అంటూ కుల వృత్తి అంటూ ఏమీ లేక సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. వైసిపి పాలనలో గొర్రెల కాపరులకు ఎటువంటి సహాయం అందడం లేదు. దూదేకుల ముస్లీంలకు వైసిపి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు. వైసిపి ప్రభుత్వం రజక సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేసింది. మాకు ఎటువంటి సహాయం అందడం లేదు.
బిసిలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
కోటి: జీఓ53 ద్వారా కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పినా ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు ఇచ్చిన ప్రతిసారి మా కులాన్ని మారుస్తున్నారు. మీరు వచ్చాక మాకు బలమైన జీవో కావాలి.
వెంకటేష్, బోయ: మాకు కుల వృత్తి లేదు. సంక్షేమ పథకాలు అందడం లేదు. అందుకే మా జాతి మొత్తం వలసలు వెళ్లిపోతున్నాం. గ్రామంలో ఉన్నవాళ్లను పోలీసులు స్టేషన్లలో పెడుతున్నారు. మీరు వచ్చాక మాకు న్యాయం చేయండి.
కురుబ యువకుడు: మాది గొర్రెల పెంపకం కుల వృత్తి. మాకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదు. రెండు లైట్లు, మూడు ఫ్యాన్లకే మాకు 5వేలు కరెంటు బిల్లు వచ్చింది. దీన్ని సాకుగా చూపి రేషన్ కార్డు కట్ చేశారు. మీరు వచ్చాక మమ్మల్ని ఆదుకుంటారా?
దూదేకుల నేత: గత ప్రభుత్వం మాకు దూదేకుల కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రూ.40కోట్లు కేటాయించి కూడా మాకు ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. రాజకీయంగా మేం చాలా వెనుకబడ్డాం. కనీసం కో ఆప్షన్ మెంబర్ పదవులు కూడా ఇవ్వడం లేదు. మమ్మల్ని రాజకీయం, విద్య, ఉపాధి రంగాల్లో ఆదుకోవాలి.
నాగరాజు,రజక: టిడిపి అధికారంలోకి వచ్చక మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చండి.
వీరేష్ బాబు, వాల్మీకి: వైసీపీ వాళ్లు మమ్మల్ని గత ఎన్నికల సమయంలో మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని గాలికి వదిలేశారు. మీరు అధికారంలోకి వచ్చాక వాల్మీకీలకు పనిముట్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలి.
కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుచేస్తాం! జగన్ లా మాయమాటలు చెప్పి మోసచేసేవాళ్లం కాదు యువనేత లోకేష్ తో న్యాయవాదుల భేటీ
ఆదోని నియోజకవర్గం కుప్పగల్లులో యువనేత లోకేష్ తో న్యాయవాదులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ. మేం వైసిపి లా మాయమాటలు చెప్పి, మోసం చేసేవాళ్లం కాదు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హైకోర్టు వైజాగ్ లో అంటాడు, జగన్ రాయలసీమ లోనే హైకోర్టు అని మభ్య పెడుతున్నాడు. వైసిపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ లా కర్నూలులో ఒక మాట చెప్పి ఢిల్లీలో మరోమాట చెప్పే దుర్మార్గపు ఆలోచన నాకు లేదు. నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతున్న వైసిపి కర్నూలులో కనీసం స్థలం కేటాయించి, ఒక్క ఇటుక పెట్టాడా? వైసిపి చెప్పే అబద్దాలు తియ్యగా, మేం చెప్పే నిజాలు చేదుగా ఉంటాయి. విజ్ఞులైన న్యాయవాదులు నిజానిజాలను గుర్తించాలి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకుంది… అధికారంలోకి వచ్చాక ఏర్పాటుచేస్తాం. పరిపాలన అంతా ఒక చోట ఉండాలి, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. న్యాయ విభాగానికి సరైన నిధులు, మౌలిక వసతులు కల్పించకుండా కేసులు పెండింగ్ లో ఉన్నాయని నిందించడం సబబు కాదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు ఎక్కువగా కేటాయించి, మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. మీ వల్లే రాష్ట్రంలో వైసిపి చేసిన అరాచకాలను కొంత వరకైనా అడ్డుకోగలిగాం. జూనియర్ లాయర్లకి స్టయిఫండ్ ఇస్తాం. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామని యువనేత లోకేష్ చెప్పారు.
యువనేతను కలిసిన గణేకల్లు ప్రజలు
ఆదోని నియోజకవర్గం గణేకల్లు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 5,500 జనాభా ఉన్నాం. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది, పది రోజులకు ఒకసారి తాగునీరు వస్తోంది. స్నానం, బట్టలు, ఇతర అవసరాలకు బోరు, ఇతర సౌకర్యాలేమీ లేవు. కిలోమీటర్ల దూరంలో వెళ్లి నీరు తెచ్చుకోవాల్సివస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
గ్రామాల్లో ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని ప్రభుత్వం అధికారంలోకి ఉండటం దురదృష్టకరం. రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చలేని వైసిపి సిగ్గులేకుండా రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందిస్తాం. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం.
యువనేతను కలిసిన జాలిమంచి గ్రామస్తులు
ఆదోని నియోజకవర్గం జాలిమంచి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. పొలాలకు తుంగభద్ర నది, ఎల్ఎల్సీ కెనాల్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పథకాన్ని ఏర్పాటుచేస్తే 7 గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిచేసి తాగు, సాగునీటి సమస్య తీర్చండి.
నారా లోకేష్ స్పందిస్తూ….
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో తాగు,సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమలో ప్రాజెక్టుల కోసం రూ.11వేల కోట్లు ఖర్చుచేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేసి తాగు,సాగునీటి సమస్య లేకుండా చేస్తాం.
సజ్జరైతును కలిసిన యువనేత లోకేష్
ఆదోని నియోజకవర్గం గణేకల్లు శివారులో యువనేత నారా లోకేష్ సజ్జచేలో దిగి రైతు కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు గోళ్ల నాగరాజు తమ గోడు విన్పిస్తూ నాకు ఎకరన్నర పొలం ఉంది. నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరుతడి పంటగా అరఎకరంలో సజ్జవేసి, మిగిలిన ఎకరం బీడుపెట్టాను. నా పొలంలో బోరు ఉంది కానీ ట్రాన్స్ ఫార్మర్ లేదు. కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కోసం రూ.20వేలు డిడి కట్టి ఏడాది అయింది. ఎప్పుడు అడిగినా ఇంకా ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. సుమారు 2కిలోమీటర్ల నుంచి రూ.60వేలు ఖర్చుపెట్టి వైరు లాక్కుని నీళ్లకోసం అవస్థలు పడుతున్నాను. అసలే వ్యవసాయం అంతంతమాత్రంగా ఉంటే, కరెంటు కనెక్షన్ కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల పుణ్యమా అని వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించే ఏర్పాటుచేస్తాం.
లేని పొలం చూపించి పెన్షన్ పీకేశారు లోకేష్ ఎదుట వికలాంగుడి ఆవేదన
ఆదోని నియోజకవర్గం కడితోట శివార్లలో దూదేకుల ఇస్మాయిల్ అనే వికలాంగుడు యువనేత లోకేష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నాడు. నాకు 3 ఎకరాలు పొలం ఉంటే, 30ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో చూపి పెన్షన్ తీసేశారు. రికార్డుల్లో చూపిస్తున్న పొలం నాకు అప్పగించండి, పెన్షనైనా ఇవ్వండని అధికారులను అడిగా. ఎమ్మార్వో నుంచి కలెక్టర్ దాకా 16సార్లు అర్జీలు పెట్టుకున్నా, ఉపయోగం లేదు. సచివాలయానికి వెళితే నీకు పెన్షన్ రాదు పొమ్మంటున్నారు. ఇంతటి అరాచకమైన ప్రభుత్వన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.3వేలు చేస్తానన్న ముఖ్యమంత్రి మాటతప్పి మడమతిప్పాడు. భారం తగ్గించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లను కుంటిసాకులతో తొలగించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వ అక్రమంగా తొలగించిన ఇస్మాయిల్ లాంటి వారి పెన్షన్లన్నీ పునరుద్దరిస్తాం.
యువనేతను కలిసిన పెద్దతుంబళం గ్రామస్తులు
ఆదోని నియోజకవర్గం పెదతుంబళం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మా గ్రామానికి ముస్లిం విద్యార్థులకు ఉర్దూ పాఠశాల లేదు. జూనియర్ కాలేజీ లేదు. మా గ్రామ ఇలవేల్పు తిమ్మప్ప గుడికి సీసీ రోడ్డు నిర్మించాలి. గ్రామంలో ఉన్న అలకనుమ ప్రాజెక్టు నుండి పంటపొలాలకు తూము ఏర్పాటు చేయాలి. 13వేల జనాభా ఉన్న పెదతుంబలం మేజర్ పంచాయితీని మండల కేంద్రంగా ప్రకటించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చా గ్రామసీమలను నిర్లక్ష్యం చేశారు. TDP ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సిసి రోడ్లు, ఎల్ ఇడి విద్యుత్ దీపాలు, ఇంటింటికీ మరుగుదొడ్డి వంటి కార్యక్రమాలను చేపట్టాం. టిడిపి అధికారంలోకి వచ్చాక అవసరాన్ని బట్టి ఉర్దూ పాఠశాల, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం. తిమ్మప్పగుడికి వెళ్లే రహదారితోపాటు గ్రామంలో అవసరమైన చోట్ల సిసి రోడ్లు నిర్మిస్తాం.
Also, read this blog: Innovating for Tomorrow: Yuvagalam’s Vision
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh