naralokeshpadayatra ,yuvagalam

1000 కిలోమీటర్ల మైలురాయికి యువగళం పాదయాత్రలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకం ఆవిష్కరణ 21వవార్డు దత్తత తీసుకుంటానన్న లోకేష్ జనసంద్రంగా మారిన ఆదోనిలోని వీధులు

అడుగడుగునా యువనేతకు జన నీరాజనాలు యువనేతను చూసేందుకు బారులుతీరిన జనం లోకేష్ రాకతో కిటకిటలాడిన ఆదోని వీధులు

ఆదోని బహిరంగసభకు పోటెత్తిన జనప్రవాహం

ఆదోని: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదోనిలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఆదోని సిరిగుప్ప సర్కిల్ లో పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయి చేరుకోవడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువగళం సైనికులు ఆనందంతో కేరింతలు కొట్టారు. యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా యువనేత సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన యువనేత… అధికారంలోకి వచ్చాక 21వవార్డును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఇది తన జీవితంలో మరపురాని ఘట్టంగా అభివర్ణించారు.  ఆదోనిలో 77వరోజు యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. యువకలు, మహళలు, చిన్నపిల్లలు రోడ్లవెంట బారులు తీరి యువనేతను కలిసేందుకు పోటీపడ్డారు. ప్రధానరహదారికి ఇరువైపులా లోకేష్ ని చూసేందుకు జనం బారులు తీరారు. యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. తనను కలిసేందుకు వచ్చిన వివిధ వర్గాల ప్రజలను కలిసిన యువనేత ఆప్యాయంగా వారిని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. యువనేత వివిధ కూడళ్లకు చేరుకునే సమయంలో రోడ్లన్నీ కిక్కిరిసోయాయి. తనని కలవడానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పన్నుల భారంతో బతుకు భారంగా మారిందని మహిళలు లోకేష్ వద్ద తమ గోడు విన్పించారు. ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందని యువకులు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి  ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతకు భరోసా ఇచ్చి ముందుకు సాగారు. ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు, రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు, మాలమహానాడు, ఎంఆర్ పిఎస్, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, మోటారు సైకిల్ మెకానిక్స్, ఫ్లెక్సీ ప్రింటింగ్ కార్మికులు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సిరిగుప్ప సర్కిల్ లో జరిగిన బహిరంగసభకు ఆదోని నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన జనం పోటెత్తారు. యువగళం పాదయాత్ర వెయ్యికిలోమీటర్ల మైలురాయి చేరుకోవడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ లో నూతనోత్సాహం నెలకొంది. ఆదోని శివారు క్యాంప్ సైట్ నుండి ప్రారంభమైన పాదయాత్ర బైపాస్ క్రాస్, ఆర్ట్స్ కాలేజి, దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్డు, మేదరగేరి బ్రిడ్జి, రాయల్ మిల్ మీదుగా కడికొత్త క్రాస్ వరకు సాగింది.

మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ

రంజాన్ సందర్భంగా ఆదోనిలో మైనారిటీ సోదరులకు యువనేత లోకేష్ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన తాను ఆదోనిలో వెయ్యికిలోమీటర్ల మైలురాయి చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తికావడానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలని ఈ సందర్భంగా కోరారు.

1000 కి.మీ. చేరుకున్న సందర్భంగా 21వ వార్డు దత్తత

యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా యువనేత లోకేష్ సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్ ఉద్వేగంగా మాట్లాడారు. 5కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో నా యువ‌గ‌ళం పాద‌యాత్ర 1000 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కనీస మౌలిక వసతులు లేక దళితులు, బీసీలు, మైనార్టీలు పడుతున్న బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డ్ ను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. త్రాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇస్తూ శిలాఫ‌ల‌కం ఆవిష్కరిస్తున్నట్లు యువనేత లోకేష్ పేర్కొన్నారు.

*ఈ గడ్డపై 1000 కి.మీ. చేరుకోవడం నా అదృష్టం*

*అరాచకాలను ఎండగట్టేందుకు ఆయుధంలా యువగళం*

*యాత్రపై యువత మనోభావాలను నాతో పంచుకోండి*

యువగళం పాదయాత్ర  రాయలసీమ గడ్డపై 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడానికి సహాయ, సహకారాలు అందించిన యావత్ రాయలసీమ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేలపై 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తూ, నా యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడింది. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా, సుభిక్షంగా మార్చాలన్నది నా ఆకాంక్ష.

పెంచుకుంటూ పోతానన్నది పెట్రోలు రేట్లా జగన్?!

ఆదోనిలోని ఒక పెట్రోలు బంకువద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారుఆదోనిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద లీటరు పెట్రోలు ధర రూ.111.31, డీజిల్ ధర రూ.99.09 రూపాయలు  కాగా, పొరుగున ఉన్న కర్నాటకతో పోలిస్తే పెట్రోలు 13రూపాయలు, డీజిల్ ధర 10రూపాయలు అధికం. ఎన్నికలప్పుడు జగన్ పెంచుకుంటూ పోతానంటే అమాయక ప్రజలు నమ్మి ఓట్లు గుద్దేశారు.

అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా?

ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయం సెల్ఫీ దిగిన లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై ఘాటువ్యాఖ్యలు చేశారు. పూర్వాశ్రమంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఉండేది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా ఒక్క  ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ, మేం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ భవనాన్ని సచివాలయంగా మార్చేసి తమ పార్టీ రంగులు వేసుకున్నారు. 

ప్రజలు చైతన్యవంతులై తిరుగుబాటు చేయాలి! ఈ గడ్డపై 1000 కి.మీ చేరుకోవడం నా అదృష్టం

ఎస్సీలను కించపర్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం నిరూపించలేకపోతే సాక్షి టీవి, పేపర్లను మూసేస్తారా?

ఆదోని: ఈ గడ్డపై నా పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకోవడం నా అదృష్టం… ఇంకా 3వేల కిలోమీటర్లు నడవాల్సి ఉంది… ప్రజల ఆశీర్వాదంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశాను. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నదే నా కల. పాదయాత్ర పూర్తయ్యేలోపు ప్రజల్లో చైతన్యం వచ్చి తిరుగుబాటు చేయాలి.. ఆదోని శివారు కడికొత్త క్రాస్ వద్ద జరిగిన బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… పాదయాత్ర ఆపడానికి పరదాల జగన్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఆయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకుంటే నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకుని ముందుకు సాగాను. ప్రజల్లో మార్పు మొదలైంది. కమలాపురం ఎస్సీ కాలనీలో ప్రజలు తాళాలు వేసుకొని వెళ్లారు. జగన్ కు బైబై రోజు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. తనకు సొంత పేపర్, టీవిలు లేవని జగన్ చెబుతున్నారు. సాక్షి పేపర్, టివి ఎవరివి? భారతదేశంలోనే అతి ధనవంతుడు ఎవరు? నన్ను నేరుగా ఎదుర్కోవడం చేతగాక భారతీరెడ్డిని రంగంలోకి దించాడు. దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఏమి లేదు అని నేను అంటే ఆవిడ గారు లోకేష్ దళితుల్ని అవమానించాడు అంటూ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. ఎస్సీలను నేను కించపర్చినట్లు సాక్షిలో తప్పుడు రాతలు రాశారు. దీనిపై భారతీరెడ్డికి సవాల్ విసిరా, సౌండ్ రాలేదు. ఇప్పుడు చెబుతున్నా…సాక్ష్యాధారాలతో నిరూపిస్తే రాజకీయాలనుంచి నేను తప్పుకుంటా, నిరూపించ లేకపోతే సాక్షిని మూసేస్తారా… ఇదే నా సవాల్? కర్నూలుకు ఒక్క ఇటుక అయినా వేశాడా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు చాచికొట్టారు, ఇప్పుడు ఉందిగా సెప్టెంబర్, మార్చిపైనా అని పాడుతున్నారు. ప్రజలకు అంతా అర్థమైంది. మార్పు మొదలైంది… త్వరలో జగన్ కు బైబై!

యువగళం తో మార్పు మొదలైంది. పరదాల జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డికి ప్రజలు షాక్ ఇచ్చారు.  దేవరాజుపల్లె ఎస్సీ కాలనీలో గడపగడపకు కార్యక్రమానికి వెళ్తే ఊరు మొత్తం తాళం వేసుకొని వెళ్లిపోయారు. త్వరలో రాష్ట్రం మొత్తం తాళం వేసి పరదాల జగన్ కి బై బై చెప్పడం ఖాయం.. జగన్ కి డబ్బు లేదంట…వైసిపి భాషలో అడుగుతున్నా దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరు? జగన్ మాటలు వింటే అబద్దమే సిగ్గుపడుతుంది. ఆదోని అదిరిపోయింది. ఈ విజువల్ చూస్తే జగన్ ముఖచిత్రం మాడిపోవడం ఖాయం. ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయం,  శ్రీ మహాయోగి లక్ష్మమ్మ దేవాలయము, షాహి జామియా మసీదు ఉన్న పవిత్రమైన నేల ఆదోని.  రాష్ట్రంలోనే అతి పెద్ద పత్తి మార్కెట్ ఉన్న ప్రాంతం ఆదోని.  ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ పుణ్యభూమి ఆదోని లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

జగన్ మహానటుడు… మేలు చేస్తున్నట్లు కలరింగ్!

జగన్ బ్రహ్మాండమైన నటుడు…పైకి ప్రజలకు మేలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తాడు..జగన్ రెండు పనికిమాలిన కార్యక్రమాలు తెచ్చాడు అందులో ఒకటి శాశ్వత గృహ హక్కు పధకం. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి దగ్గర నుండి అనేక ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లకు ఒన్ టైం సెటిల్మెంట్ స్కీం తెచ్చాడు. 10 వేలు కడితే ఇళ్ల రిజిస్ట్రేషన్ అంటూ 5వేల కోట్లు పేద ప్రజల నుండి కొట్టేసాడు.  ఆ పత్రాలు పట్టికెళ్తే బ్యాంకులు లోన్లు ఇస్తారని ప్రచారం చేసారు. ఆ పత్రాలు పట్టికెళ్తే బ్యాంకులు ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అంటున్నాయి. జగన్ శాశ్వత భూహక్కు పధకం తెచ్చాడు. డ్రోన్ సర్వే అంటాడు. భూమి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా ఎంతోకొంత భూమి లాగేస్తున్నాడు.  అదేంటి నా భూమి ఎలా తగ్గింది అని ప్రశ్నిస్తే అధికారుల చుట్టూ తిరగమని ఉచిత సలహా ఇస్తున్నారు. పైగా ఆయన బాబు గారి సొమ్ము ఎదో మీకు రాసిచ్చినట్టు పాస్ బుక్ పై ఈయన ఏడుపు మొహం ఫోటో వేసుకుంటున్నాడు..

పీల్చేగాలిపై కూడా పన్నేస్తాడు!

విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.. అది ఎలాగో చెబుతాను.  అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.

యువత భవిష్యత్తును దెబ్బతీశాడు!

జగన్ యువతని భవిష్యత్తుని దెబ్బతీసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు.  మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.

మోటార్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు

జగన్  రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. కోడికత్తి జగన్  పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. జగన్  ఉద్యోగస్తులను కూడా వేధించాడు.  వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు జగన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

బిసిల బ్యాక్ బోన్ విరిచిన జగన్

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది.  డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.  ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఊరేగించారు.

దమ్ముంటే జగన్ ను నిలదీయండి!

ఎర్రగొండపాలెంలో  మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబును నిలదీస్తానని వీరంగం వేస్తున్నాడు. దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేసిందుకు, సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించినందుకు దమ్ముంటే జగన్ ను నిలదీయండి. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. TDP హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.

ఆదోని ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ లీలలు

ఆదోని ఎమ్మెల్యే గారి పేరు సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఆదోని ని ముంబై లా మార్చేస్తాడు అని మీరు వరుసగా రెండు సార్లు గెలిపించారు.  ఆదోనికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి పంచుకున్నారు. ప్రతి రోజు కూర్చొని వాటాలు వేసుకుంటారు. కొడుకు భూకబ్జాలు, సెటిల్మెంట్లు. భార్య గారికి రిజిస్టర్ ఆఫిస్ బాధ్యతలు అప్పగించారు. ఆదోని లో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు. అందుకే పేరు మార్చాను ఆయన సాయి ప్రసాద్ కాదు క్యాష్ ప్రసాద్. ప్రతి రోజూ క్యాష్ ఎంత వచ్చిందో కళ్లారా చూసుకుంటే తప్ప ఆయనకి నిద్ర పట్టదు అంట.  ఆదోని పట్టణం సర్వే నంబరు 352లో 5 ఎకరాల్లో 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి ఎస్టేట్ వెంచర్ వేసింది. 72 మంది సామాన్యులు ఒకటిన్నర సెంటు ప్రకారం కొన్నారు. క్యాష్ ప్రసాద్ ఆ భూమిని కబ్జా చేసి మళ్ళీ వెంచర్ వేసారు. ప్లాట్లు కొన్న బాధితులు అడిగితే.. ఒకటిన్నర సెంటుకు రూ.లక్ష ఇస్తా.. లేదంటే మీ ఇష్టం అని బెదిరిస్తున్నారు. అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా ఉంది.ప్రస్తుతం ఎకరా రూ.10 కోట్లు ఉంది. క్యాష్ ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ మండిగిరి కొండ, కొండాపురం కొండ ని మింగేసారు. డాణాపురం వద్ద 172ఎకరాలు సెంటు స్థలాల కోసం, ఆరెకల్  మెడికల్ కాలేజీ కోసం 43 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. భూమి కొనుగోళ్లలో క్యాష్ ప్రసాద్ గారికి భారీగానే ప్రజాధనాన్ని లూటీ చేసారు. ఎకరా 6 లక్షలకు కొని ప్రభుత్వానికి 13 లక్షలకు అమ్మేసారు.

ఎన్ జిఓ ఆఫీసును కూడా మింగేశాడు!

ఎస్కేడీ కాలనీలో ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా ఏపీ ఎన్జీఓ ఆఫీసు ఉంది. ఎన్జీఓలను భయపెట్టి.. 32 ఏళ్లు లీజుకు రాయించుకుంటున్నారు. వైసీపీ ఆఫీసు కట్టారు. ఎమ్మెల్యే కొడుకు మనోజ్ రెడ్డి బియ్యం మాఫీయా నడుపుతున్నారు. పట్టణంలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో బియ్యం డంపింగ్ కేంద్రాలు పెట్టి… అక్కడి పేదల బియ్యం నిల్వ చేసి.. కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇది పెద్ద కుంభకోణం. ఎమ్మెల్యే చెప్పిన వాళ్లే గ్రామంలో కర్ణాటక మద్యం అమ్మకాలు చేయాలి. ఇందులో నెల వాటాలు ఇవ్వాలి. ఈ కలెక్షన్ చేయడానికి ఒక మాఠానే పెట్టారు. కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం అని క్యాష్ ప్రసాద్ అమాయకుల దగ్గర నుండి కోట్లు కొట్టేసింది.  ఆదోని లో రోడ్లు బాలేదు అని మాట్లాడినందుకు ఒక ఆటో డ్రైవర్ రవి ని ఇంటికి తీసుకెళ్లి చితకబాదారు క్యాష్ ప్రసాద్ గారు. గుడి కంబాల రీచ్ నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రూ.10 లక్షలు పైబడి ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా..ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ కి కప్పం కట్టాల్సిందే. ఆదోని పట్టణంలో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్నా.. ఎమ్మెల్యే కొడుకు మనోజ్ రెడ్డిని కలసి కప్పం కట్టాల్సిందే. ఆదోని మార్కెట్లో పెద్ద ఎత్తున జీరో వ్యాపారం జరుగుతుంది. అందులో పెద్ద ఎత్తున వాటా క్యాష్ ప్రసాద్ కి వెళ్తుంది.  భారీ పర్శంటేజ్ తీసుకోని తనకి నచ్చిన కాంట్రాక్టర్లకు ఎల్లెల్సీ కాలువ లైనింగ్ పనులు అప్పజెప్పారు క్యాష్ ప్రసాద్. ఆ లైనింగ్ ఎప్పుడో కొట్టుకుపోయింది అంత నాణ్యమైన పనులు చేసారు. క్యాష్ ప్రసాద్ స్వార్ధం వలన బైపాస్ పనులు ఆగిపోయాయి. ఆయన కొన్న భూముల వైపు బైపాస్ వెళ్ళాలి అని డిపిఆర్ మార్చారు. అందుకే పనులు నిలిచిపోయాయి.

టిడిపి హయాంలోనే ఆదోని అభివృద్ధి!

ఆదోనిని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజక్టులు నిర్మించాం. పేదలకు ఇళ్లు, కాలేజీలు నిర్మించాం. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. జగన్ ఆదోని వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని అన్నారు, త్రాగునీటి సమస్య పరిష్కరిస్తా అన్నారు, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తా అన్నారు. గెలిచిన తరువాత ఏపీలో ఆదోని ఉందనే విషయమే మర్చిపోయారు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం, బైపాస్ నిర్మాణం పూర్తి చేస్తాం, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.  ఆదోని టౌన్ లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది రోడ్లు వెడల్పు చేసి టౌన్ ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. టౌన్ లో ఉన్న అన్ని వార్డుల్లో సమస్యలు ఉన్నాయి, రోడ్లు, తాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన ఆదోని టౌన్ ని అభివృద్ధి చేస్తాం. మోడల్ టౌన్ గా ఆదోని ని మారుస్తాం. టిడిపి హయాంలో ఆదోనికి  ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మైనారిటీ ఐ.టి.ఐ, మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ హైస్కూల్, ఇంటర్ ఉర్దూ కాలేజీ, సద్భావన భవన్ నిర్మాణాలను టిడిపి హయాంలో ప్రారంభించి 90 శాతం పనులు పూర్తి చేసాం. ఈ చేతగాని వైసిపి ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు పూర్తిచెయ్యలేదు.

ఆదోనికి పరిశ్రమలు తెస్తాం!

ఇక్కడ ఉన్న అనేక జిన్నింగ్ మిల్లులు, ఆయిల్ మిల్స్ మూతపడ్డాయి. కార్మికులు అంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆదోనికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అతి పెద్ద పత్తి మార్కెట్ ఉన్నా సరైన వసతులు లేవు. మార్కెట్ లో వసతులు కల్పించడంతో పాటు పత్తి రైతుల్ని ఆదుకుంటాం. పండించిన పంట అమ్ముకోవడానికి మిర్చి రైతులు గుంటూరు వెళ్లి పడుతున్న కష్ఠాలు నాకు తెలుసు. నియోకవర్గంలోనే మిర్చి యార్డ్ ఏర్పాటు చెయ్యడంతో పాటు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం. యువత బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకి కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం. ఆదోని లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత నాది. మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు గతంలో ఇచ్చిన యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ అమలు చేస్తాం. టిడిపి హయాంలో ఆదోని కి 8 వేల టిడ్కొ ఇళ్లు మంజూరు చేసాం. అందులో 6307 ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేసాం. మిగిలిన 10 శాతం పనులు పూర్తిచెయ్యలేని చెత్త ప్రభుత్వం జగన్ ది. ఇక్కడ ఉన్న ఇఎస్ఐ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. కొత్త భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటాం. ఎల్ఎల్సి ని ఆధునీకరించి 24 టిఎంసి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.  వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. టిడిపి కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీతో సహా చెల్లిస్తా. అక్రమ కేసులు పెట్టిన వారిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకుంటాం.

లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇదే స్పూర్తిని కొనసాగించాలి! యువగళం సైనికులకు లోకేష్ అభినందనలు  1000 కి.మీ. చేరుకున్న సందర్భంగా యువనేత వ్యాఖ్యలు

 పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను యువనేత నారా లోకేష్ అభినందించారు.  అధికారపార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనవరి 27న పాదయాత్ర ప్రారంభం నుంచి వివిధ కమిటీలు క్రమశిక్షణతో యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా తాను చేస్తున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్రలో సేవలందిస్తున్న వివిధ కమిటీలు, వాలంటీర్లను యువనేత లోకేష్ పేరుపేరునా అభినందిస్తూ… లక్ష్యాన్ని చేరుకునేవరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో 13కమిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు.రాజేష్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం యువనేతను వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 100మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ యువనేతను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

యువగళంలో సేవలందిస్తున్న బృందాలు

1.యువగళం పాదయాత్ర మెయిన్ కోఆర్డినేటర్ – కిలారు రాజేష్. 2.యువగళం అధికార ప్రతినిధులు – ఎం ఎస్ రాజు, దీపక్ రెడ్డి. 3.మీడియా కమిటీ – మెయిన్ కోఆర్డినేటర్ బి.వి. వెంకట రాముడు, సభ్యుడు జస్వంత్. 4.భోజన వసతుల కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్, సభ్యుడు లక్ష్మీపతి. 5.వాలంటీర్ కోఆర్డినేషన్ కమిటీ – రవి నాయుడు, ప్రణవ్ గోపాల్. 6.రూట్ కోఆర్డినేషన్ కమిటీ – రవి యాదవ్. 7.అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్. 8.వసతి ఏర్పాట్ల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలా కృష్ణ, శ్రీధర్, ఐనంపూడి.రమేష్. 9.యువగళం పిఆర్ టీమ్ – కృష్ణా రావు, మునీంద్ర, కిషోర్. 10.యువగళం సోషల్ మీడియా కోఆర్డినేషన్ – కౌశిక్, అర్జున్. 11.అలంకరణ కమిటీ – మలిశెట్టి వెంకటేశ్వర్లు, బ్రహ్మం. 12.రూట్ వెరిఫికేషన్ కమిటీ – అమర్నాథ్ రెడ్డి, కస్తూరి కోటేశ్వరరావు. 13.తాగునీటి సదుపాయం – భాస్కర్, వెంకట్14. సెల్ఫీ కోఆర్డినేషన్ – సూర్య.

బెంజ్ మంత్రి గారూ బీపీ, బూతులు ఎందుకు?

గుమ్మనూరు వ్యాఖ్యలకు లోకేష్ స్పందన

మంత్రి గుమ్మనూరు జయరాం తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై యువనేత నారా లోకేష్ స్పందించారు. నేను అడిగిన దానికి తప్ప ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ నోరు పారేసుకోవడం ఎందుకు? ఈఎస్ఐ స్కాం పై చర్చకు సిద్దం అంటున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల లో స్కాం కి పాల్పడి మీరు బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారు అని ఆధారాలతో సహా ఎన్నో సార్లు బయటపెట్టాం. అదే కారులో మీ ముద్దుల కుమారుడు షికార్లు కొట్టడం రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఏమి తెలియనట్లు ఈఎస్ఐ స్కాం పై చర్చకు సిద్దమా అంటూ సవాల్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం లో ఉంది మీరు అనే విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి. బెంజ్ మంత్రి గారూ మీ ఆవు కథలు ఆపండి. నేను నా సవాల్ కి కట్టుబడి ఉన్నాను. ఎవరైనా ముందు కోస్తే భూములు రైతుల పేరిట రాయడానికి సిద్దం అని మీరే పబ్లిక్ గా ప్రకటించారు. ఇప్పుడు వెనక్కి తగ్గి బూతుల తో విరుచుకుపడుతున్నారు. నేను మిమ్మలని స్ట్రయిట్ గా అడుగుతున్నా. ప్రభుత్వ ధర చెల్లించి ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడని సిద్దం. మీరు అక్రమంగా కొట్టేసిన భూములు వెనక్కి ఇవ్వడానికి సిద్దమా? మీరు వందల ఎకరాలు అధిపతి అయ్యారు జిల్లా లో ఉన్న ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఒక్క ఎకరం భూమి కొనే స్థితిలో ఉన్నారా? మీరు బెంజ్ కారు లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. జిల్లా లో ఉన్న ఒక్క వాల్మీకి కుటుంబం అయినా చిన్న కారు కొనే పరిస్థితి లో ఉన్నారా? అధికారంలో ఉంది మీరు, ప్రతిపక్షంలో ఉంది మేము అని గుర్తించి ఆరోపణలు చెయ్యగలరని ఆశిస్తున్నానంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

యువనేతను కలిసిన ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు

ఆదోని బైపాస్ రోడ్డు బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నేషనల్ హైవే 167 లో భాగంగా ప్రతిపాదించిన ఆదోని బైపాస్ రోడ్డు ఎలైన్ మెంట్ -2 ఆదోని పట్టణ మాస్టర్ ప్లాన్ కు విరుద్దమైనది. దీనివల్ల 40సంవత్సరాల క్రితం ఆమోదించిన లేఅవుట్లు, ఆవాసాలు దెబ్బతిని, 40 ఏళ్లనుంచి ఉంటున్న 400 కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. కేవలం కొద్దిపాటి వ్యవసాయ భూములు మాత్రమే ప్రభావితమయ్యే ఎలైన్ మెంట్ -3ని పరిగణనలోకి తీసుకొని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఆయన మనుషులకు చెందిన భూములకు విలువ పెంచుకునేందుకు, ఆభూములకు సమీపం గుండా జాతీయరహదారి వెళ్లేలా ఎలైన్ మార్పులు చేస్తున్నారు. ఆదోని పట్టణంలో 4దశాబ్ధాలుగా నివసించే ప్రజలకు నష్టం జరగకుండా ఎలైన్ మెంట్ -3 ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

వైసిపి నేతలు వారి స్వార్థం కోసం ఎన్ని వందలమంది ప్రయోజనాలైనా దెబ్బతీయడానికి వెనకాడటం లేదు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల భూములు రేట్లు పెంచుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణం. అదోని మాస్టర్ ప్లాన్ కు విరుద్దంగా ఎలైన్ మెంట్ మార్పుపై హైవే అథారిటీకి లేఖరాస్తాం. ఆదోని బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తాం.

యువనేతకు అదోని డివిజన్ మాలమహానాడు సంఘీభావం

ఆదోని డివిజన్ మాలమహానాడు ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి సంఘీభావం తెలియజేసి, అనంతరం వినతిపత్రం సమర్పించారు.  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. అదోని అంబేద్కర్ నగర్ సర్వే నెం. 420,422ఎ లోని షేర్ ఖాన్ వారి స్థలంలో పేద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ప్రజలు 45సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక ఈ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలుచేసి పేదప్రజలకు పట్టాలు ఇవ్వాలి. మహిళలకు మరుగుదొడ్లు, బీరప్పకొండపై విద్యుత్, రోడ్డు, లైబ్రరీ, కమ్యూనిటీ హాలు నిర్మించాలి. ఎస్సీల కులాంతర వివాహాలకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించాలి. ప్రైవేటురంగంలో ఎస్సీ రిజర్వేషన్ అమలుచేయాలి, సబ్ ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే ఖర్చుచేయాలి. దళితులపై దాడులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు తీరని ద్రోహం చేసింది. ఎస్సీల సక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.28వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. వైసిపి అరాచకాలను ప్రశ్నించిన దళితులపై దాడులు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. దళితులను హతమార్చిన, వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితుల సంక్షేమం, అభివృద్ధికే కేటాయిస్తాం. ఆదోని అంబేద్కర్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తాం.

యువనేతను కలిసిన రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు

ఆదోనిలో రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్  ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆదోనిలోని ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలి. పత్తి  పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. రాయలసీమలో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి. అప్పర్ భద్ర నిర్మాణాన్ని ఆపకపోతే వచ్చే రాయలసీమకు వచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా ఆగిపోయే ప్రమాదముంది.  కౌతళం మండలం మెలిగనూరు వద్ద వరదకాల్వ నిర్మించాలి. వేదవతి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8 టీఎంసీలకు పెంచాలి. ప్రస్తుతం ఆర్ డిఎస్ కుడికాల్వలను 4 టిఎంసిలతో నిర్మిస్తున్నారు, కుడికాల్వ 8టిఎంసిలతో నిర్మిస్తేనే సాగు,తాగునీరు అందుతుంది. పులికనుమ ప్రాజెక్టును 5 టిఎంసిల సామర్థ్యానికి పెంచాలి. మా ప్రాంతంలో పేదల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కళాశాలలు లేని కారణంగా చదువు ఆపేసి వలసలు వెళ్తున్నారు.  పశ్చిమ రాయలసీమలో అత్యంత వెనుక బడిన తమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగావకావకాశాలు కల్పించే పరిశ్రమలు ఏర్పాటుచేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించడానికి చేతులురావడంలేదు. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే సీమ ఎడారవుతుంది..దీనిపై జగన్ నోరుమెదపడం లేదు. ముఖ్యమంత్రి  జగన్ కు రాయలసీమ ఓట్లపై తప్ప రాయలసీమ ప్రజలపై ఎటువంటి ప్రేమ లేదు. వేదవతి ప్రాజెక్టును ఈ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించింది..మేము వచ్చాక 8 టీఎంసీలకు పెంచుతాం. టిడిపి అధికారంలోకి వచ్చాక పశ్చిమ రాయలసీమలో విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటుచేసి వలసలను నివారిస్తాం.

యువనేతను కలిసిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు

ఆదోని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంద్రరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ భవనాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటుచేయాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.వెయ్యికోట్ల నిధులు కేటాయించి, పేద ఆర్యవైశ్యులకు సబ్సిడీ రుణాలు అందించాలి. ఆర్యవైశ్యులకు ఎమ్మెల్యే, ఎంపి, నామినేటెడ్ పోస్టుల్లో 10శాతం సీట్లు కేటాయించాలి.

యువనేత నారా లోకేష్ మట్లాడుతూ…

ఆర్యవైశ్యులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మంత్రి పదవి కేటాయించింది తెలుగుదేశం పార్టీ. వైసిపి అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయి. ఒంగోలులో సుబ్బారావుగుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు. అమరావతిలో శ్రీ పొట్టిశ్రీరాములు మెమోరియల్ భవనం ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, పేద ఆర్యవైశ్యులకు సబ్సిడీ రుణాలిస్తాం.

యువనేతను కలిసిన మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు

ఆదోనిలో మోటారు సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా మెకానిక్ లు ఉన్నాం. 2020 నుండి అన్ని కంపెనీలు బీఎస్-6 వర్షన్ వాహనాలను ప్రవేశపెట్టారు. వీటి రిపేర్లపై మాకు పెద్దగా అవగాహన లేదు. టీడీపీ అధికారంలో ఉండగా స్కిల్ డెవల్ప్మెంట్ కేంద్రాల ద్వారా చేతివృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమం కనుమరుగైంది. మీరు అధికారంలోకి వచ్చాక టూ వీలర్ మెకానిక్ లను గుర్తించి శిక్షణ ఇప్పించాలి. బీఎస్-6 వాహనాలు రిపేర్లకు ఉపయోగపడే టూల్ కిట్ ఇవ్వాలి. మాకు సొసైటీ  లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సీడీ రుణాలు అందించాలి. ఆటో నగర్ లలో మెకానిక్ లకు మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

టిడిపి ప్రభుత్వ హయాంలో నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటుచేసిన సంస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మోటారు సైకిల్ మెకానిక్ లు కోరిన విధంగా అధునాతన వాహనాలపై నైపుణ్య శిక్షణ ఇచ్చి, టూల్ కిట్లు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆటోనగర్లలో అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించి మెకానిక్ లకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. మోటారు సైకిల్ మెకానిక్ లు షెడ్లు ఏర్పాటుచేసుకునేందుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం.

యువనేతను కలిసిన ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు

ఎస్సీల్లోని 59 ఉపకులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 15శాతం రిజర్వేషన్ కల్పించారు. రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు అందాలన్న ఉద్దేశంతో ఎంఆర్ పిఎస్ విజ్జప్తిమేరకు టిడిపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుచేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మాదిగలకు కేవలం 20వేల ఉద్యోగాలు మాత్రమే రాగా, వర్గీకరణ తర్వాత 25వేల ఉద్యోగాలు వచ్చాయి. 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొంతమంది స్వార్థపరులతో చేతులు కలిపి సుప్రీంకోర్టుకు వెళ్లి వర్గీకరణను అడ్డుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను నిలిపివేసింది. ఎస్సీ వర్గకరణకు చర్యలు తీసుకోవాలి, సబ్సిడీ రుణాలపై మా తరపున పోరాడండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ రూ.28వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించడమేగాక, ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది. గతంలో ఎన్ఎస్ఎఫ్ డిసి ద్వారా ఎస్సీ యువతకు వివిధ రకాల వాహనాలను సబ్సిడీపై అందించాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎస్సీల సంక్షేమం కోసం అమలుచేసిన 27పథకాలను రద్దుచేసింది. ఎస్సీ సంక్షేమపథకాల రద్దు, సబ్ ప్లాన్ నిధులపై అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం. మాదిగల సామాజికవ న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.

యువనేతను కలిసిన ప్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు

ప్లెక్సీ ప్రింటింగ్ పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన జిఓ నెం. 65,75లను రద్దు చేయాలి. ప్రభుత్వ నిబంధనల మేరకే మేము ప్లెక్సీలు ప్రింట్ చేస్తున్నాం. మేము ముద్రించే ప్లెక్సీలు 180 మైక్రాన్ ల పరిమాణంలో ఉంటాయి. ప్లెక్సీ ప్రింటింగ్ వృత్తిని కుటీర పరిశ్రమగా గుర్తించి, ప్రభుత్వ రాయితీలు అందించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రిగా జగన్ కు కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా, ప్లెక్సీ ప్రింటింగ్ పై నిషేధం విధిస్తూ జిఓలు తెచ్చి లక్షలాదిమంది పొట్టగొట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఫ్లెక్సీలను బ్యాన్ చేయడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక ఫ్లెక్సీలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం జారీచేసిన జిఓలను రద్దుచేస్తాం. నిబంధనలకు లోబడి ఏర్పాటుచేసుకునే ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లకు సహకారం అందిస్తాం.

Also, read this blog: Breaking Barriers: Yuvagalam’s Journey to Success

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *