పత్తికొండ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి జనం, అడుగడుగునా జన నీరాజనం… వెల్లువెత్తిన విన్నపాలు ఎంకె కొట్టాల వద్ద కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో ఘనస్వాగతం

పత్తికొండ: యువగళం 72వరోజు పాదయాత్ర పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం కోలాహలంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా జనం రోడ్లపైకి వచ్చి యువనేతను స్వాగతించారు. రాంపల్లి లో లోకేష్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, యువత, వృద్దులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, వైసిపి ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసింది. వచ్చే చాలీచాలని ఆదాయం తో బ్రతకడం కష్టంగా మారింది. ఊర్లో పనులు లేక చాలా కుటుంబాలు వలస పోతున్నారని మహిళలు చెప్పారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. జగన్ పెంచిన పన్నుల భారాన్ని తగ్గిస్తామని యువనేత భరోసా ఇచ్చారు. దారిపొడవునా యువనేత ఎదుట సమస్యలు వెల్లువెత్తాయి. మారెళ్లలో భోజన విరామ సమయంలో బిసిలు, విఆర్ఎలతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. రాంకొండ క్రాస్ వద్ద యువత లోకేష్ తో సమావేశమై సమస్యలు విన్నవించారు. ఎంకె కొట్టాల వద్ద యువగళం పాదయాత్ర ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఆలూరు ఇన్ చార్జి కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో కార్యకర్తలు, అభిమానులు యువనేతకు ఘనస్వాగతం పలికారు.

మా అరెకరపొలంలో అక్రమంగా ఇసుక తవ్వారు-టి.గోపాల్ గౌడ్, వెల్దుర్తి

వెల్దుర్తిలోని మోడల్ స్కూల్ వెనక మా ముగ్గురు అన్నదమ్ములకు 5.50 ఎకరాల పొలం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు 5.50 ఎకరాల్లోని అరెకరపొలంలో ఇసుకతవ్వకాలు మొదలు పెట్టారు. ఏం చేస్తారో చేసుకోండని బెదిరించారు. ట్రాక్టర్లకు అడ్డుగా పడుకుని, డాక్యుమెంట్లతో సహా పోలీసులను కలసి వివరించిన తర్వాత ఇసుక తవ్వకాలు నిలిపేశారు. తర్వాత మా పొలం కింద ఉన్న చెన్నారెడ్డి వాగులో ఉన్న మొత్తం ఇసుకను ఎమ్మెల్యే అనుచరులు తవ్వుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి అరాచకాలకు అంతేలేదు.

కేజీ చక్కెర దాచుకున్నానని ఆరోపించి డీలర్ పోస్టు పీకేశారు-కోలా తిరుమలేష్, చర్లకొత్తూరు గ్రామం

దళితుడనైన నేను 2010 సంవత్సరం నుండి నేను రేషన్ డీలర్ గా చేస్తున్న నన్ను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించింది. నేనేమీ అక్రమాలు, అవినీతికి పాల్పడలేదు. టీడీపీకి సానుభూతిపరుడన్న కక్షతోనే నన్ను డీలర్ పోస్టు తీసేశారు. సీఎస్డీటీ, ఇతర కొంతమంది అధికారులు నా ఇంటికి వచ్చారు. రేషన్ ఇచ్చేటప్పుడు కిందపడిన చక్కెరంతా ఊడ్చి, నువ్వు కేజీ చక్కర దాచుకున్నావు..అందుకే నిన్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. నాకు ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించకపోవడంతో కోర్టుకు వెళ్లలేకపోయా.

ఎవరి హయాంలో బిసిలకు మేలు జరిగేందో చర్చకు సిద్ధమా? సమాజంలో అలజడులు సృష్టించి లబ్ధిపొందడమే జగన్ లక్ష్యం, చేనేతలకు 200 యూనిట్ల ఉచితవిద్యుత్, జిఎస్ టి రద్దు కల్లు గీత కార్మికులకు నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం, బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

పత్తికొండ: బీసీలకు ఎవరి పాలన లో న్యాయం జరిగిందో చర్చకు నేను సిద్దం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిద్దమా? అని యువనేత Nara Lokesh సవాల్ విసిరారు. పత్తికొండ నియోజకవర్గం మారెళ్లలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…  జగన్ ను ఇంటికి పంపకపోతే బీసీలకు ఇబ్బందులు ఎదుర్కొంటారు, సమాజంలో సమస్యలు సృష్టించి లబ్ధిపొందడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. బిసిలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే. స్వర్గీయ ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబు గారు బీసీలను పెద్ద ఎత్తున బీసీలను ప్రోత్సహించారు. బిసిలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టిడిపి. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. ఆదరణ పథకం 2 లో భాగంగా కొన్న పనిముట్లు బిసిలకు ఇవ్వకుండా బిసిలను వేధించాడు జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేశారు జగన్. 26 వేల మంది బిసి ల పై వైసీపీ ప్రభుత్వ పాలన లో అక్రమ కేసులు పెట్టారు.  

నిధుల్లేని బిసి కార్పొరేషన్లు

బిసి కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. రూపాయి నిధులు లేని కార్పొరేషన్లు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వ పాలనలో బిసిలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. ఒక్క రుణం ఇవ్వలేదు. స్వయం ఉపాధి కోసం సహాయం చెయ్యలేదు. జగన్ బిసిలను అణిచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. బిసి నాయకత్వాన్ని దెబ్బతీయడానికి అనేక అక్రమ కేసులు బనాయించి వేధించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిల భద్రత కోసం ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం.  న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. బిసిలలో ఉన్న ఉప కులాల వారీగా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.

నీరా కేఫ్ లు ఏర్పాటుచేస్తాం

వైసీపీ ప్రభుత్వం  సొంత మద్యం అమ్ముకోవడానికి కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు.  కల్లు గీత కార్మికులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటాం.  నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీ ని అనుసంధానం చేసి తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం. మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు ప్రత్యేకంగా షాపులు కేటాయిస్తాం. చట్టం కొంత మందికి చుట్టంగా మారింది. జగన్ సంక్షేమ హాస్టళ్ల ను నిర్వీర్యం చేశారు. ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ హాస్టల్స్ లో మెరుగైన వసతులు కల్పిస్తాం. బిసి విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం జగన్ రద్దు చేసిన విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను తిరిగి ప్రారంభిస్తాం. టైలరింగ్ వృత్తిలో ఉన్న బిసిలను ఆదుకుంటాం. బోయ, వాల్మీకి లని ఎస్టీల్లో చేర్చాలనే ఉద్దేశంతోనే సత్యపాల్ కమిటీ వేసాం. అసెంబ్లీ లో తీర్మానం చేసాం కేంద్రానికి పంపాం. జగన్ నాలుగేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు తీర్మానం అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం తో సంప్రదింపులు చేసి సత్యపాల్ కమిటీ సిఫార్సుల మేరకు బోయ, వాల్మీకి లని ఎస్టీల్లో చేర్చే ప్రక్రియ వేగవంతం చేస్తాం.

చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్

రాయలసీమ సాగు, తాగు నీరు కష్టాలు తీర్చడానికి కృషి చేసింది చంద్రబాబు మాత్రమే. తాగు, సాగు నీరు సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి, వలసలు ఆగాలి అని కృషి చేసింది చంద్రబాబు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు గారు 11 వేల కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల లో 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదు. హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేసింది టిడిపి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్ ఇరిగేషన్ కట్ చేసి రాయలసీమ రైతుల్ని కోలుకోలేని దెబ్బ తీశాడు. రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను దత్తత తీసుకుంటాను. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. గతంలో ఇచ్చిన యార్న్, కలర్ సబ్సిడీ అందిస్తాం. చేనేత పై ఉన్న 5 శాతం ఉన్న జీఎస్టీ ని రద్దు చేస్తాం. వైసీపీ ప్రభుత్వం పాలనలో చేనేత కార్మికులను దెబ్బతీశారు. బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అందజేస్తాం.ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత కుల ధృవీకరణ పత్రం అందజేసే విధానం తీసుకొస్తాం.

సమావేశంలో బిసిలు మాట్లాడుతూ…

ఈ సందర్భంగా బిసిలు మాట్లాడుతూ… బిసిలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. కల్లు గీత కార్మికులపై కేసులు పెట్టి వేధిస్తుంది. బిసి సంక్షేమ హాస్టళ్ల లో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. టైలరింగ్ వృత్తిలో ఉన్న బిసిలకు ఎటువంటి సాయం అందడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేరుస్తామని జగన్ మోసం చేశారని తెలిపారు.

బిసిల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

మాధవి : బీసీ హాస్టళ్లలో నాసిరకం ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ అవుతోంది. దీంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. విదేశీ విద్య అమలు చేయడం లేదు.

నోజ్ కుమార్ : పశువుల కొనుగోలుకు ఈ ప్రభుత్వం రుణాలు, సబ్సీడీలు ఇవ్వడం లేదు. మీ ప్రభుత్వం వచ్చాక రుణాలిచ్చి ఆదుకోండి.

తిరుమలేష్, టైలర్ : రాష్ట్రంలో 9 లక్షల మంది టైలర్లు రాష్ట్రంలో ఉన్నారు. కంటి చూపుతో ఇబ్బంది పెడుతున్నారు. గతంతో కుట్టు మిషన్లు ఇచ్చారు. మళ్లీ మీరొచ్చాక పెన్షన్ తీసుకొచ్చే అవకాశం కల్పించండి.

విఆర్ఎల గౌరవ వేతనం పెంచుతాం. రెవిన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం న్యాయం చేస్తా, టిడిపి వచ్చాక ఉద్యోగులకు వేధింపులు ఉండవు, విఆర్ఎలతో సమావేశంలో యువనేత లోకేష్

పత్తికొండ: విఆర్ ఎలకు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మీకు న్యాయం చేస్తాం. గౌరవ వేతనం ఖచ్చితంగా పెంచుతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.  టిడిపి అధికారంలోకి వచ్చాక మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.  ఉద్యోగస్తులను వేధించడం మా విధానం కాదని తెలిపారు. పత్తికొండ నియోజకవర్గం మారెళ్లలో విఆర్ఏ లతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధి విఆర్ఏ వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 26 వేల మంది పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రూ. 3,500 ఉన్న జీతాన్ని చంద్రబాబు గారు రూ. 10,500 చేశారు.రూ.100 ఉన్న డిఏ ను రూ.300 కి పెంచింది చంద్రబాబు నాయుడు. గతంలో ఇంటి స్థలం, భూమి కూడా కేటాయించాం. అనుభవం లేని వ్యక్తి నోటికి వచ్చిన హామీలు అన్ని ఇచ్చాడు. విఆర్ఏ లు కూడా జగన్ బాధితులే. గెలిచిన వారంలో 15 వేల జీతం చేస్తామని మోసం చేశారు. ఇది కూడా సిపిఎస్ లాంటి మోసమే. వారంలో రద్దు చేస్తానని ఇప్పుడు అవగాహన లేక హామీ ఇచ్చా అన్నాడు జగన్. ప్రభుత్వ ఉద్యోగస్తులను వైసిపి ప్రభుత్వం,నాయకులు ఉద్యోగస్తులను కించపరిచేలా మాట్లాడుతున్నారు. విఆర్ఏ లను వైసీపీ ప్రభుత్వం వేధిస్తుంది. విఆర్ఏ లకు 10,500 జీతం చేసిన చంద్రబాబు గారికి తోలు మందం అంటూ జగన్ విమర్శ చేశాడు. మరి విఆర్ఏ ల నుండి డిఏ రికవరీ పెట్టిన వైసీపీ ప్రభుత్వంకి ఎంత తోలు మందమో అర్దం చేసుకోండి. ఫేషియల్ రికగ్నిషన్ అంటూ విఆర్ఏ లను వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగస్తులకు ప్రసూతి సెలవులు లేవు. వైసీపీ ప్రభుత్వం డిఏ కు విఆర్ఏ అర్హులు కారంటూ డబ్బు రికవరీ చేస్తున్నారు. ఒక్కో విఆర్ఏ నుండి రూ.19,200 రికవరీ చేసి వేధిస్తుంది వైసిపి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు, ఒక్క కర్నూలు జిల్లా లోనే కోటి యాభై నాలుగు లక్షల రూపాయలు రికవరీ చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫేషియల్ రికగ్నిషన్ వేధింపులు లేకుండా చేస్తాం. మీ రక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. మహిళా ఉద్యోగస్తులకు ప్రసూతి సెలవులు కల్పిస్తాం. ప్రమోషన్లకి పాత విధానాన్ని కొనసాగిస్తాం. పే స్కేల్, 4వ తరగతి ఉద్యోగస్తులు గా గుర్తించడం తదితర సమస్యలు అన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. మీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు.

విఆర్ఎలు మాట్లాడుతూ…

విఆర్ఏలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డిఏ ను వెనక్కి ఇవ్వాలంటూ రికవరీ పెట్టి వేధిస్తున్నారు. గెలిచిన వెంటనే జీతం 15 వేలు చేస్తానని వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. మా సమస్యలపై పోరాడితే వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగస్తులకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదు. ప్రమోషన్ల అంశంలో పాత విధానాన్ని కొనసాగించాలి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం వలన ఇబ్బందులు పడుతున్నాం. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ వేధింపులు ఆపాలి. 4వ తరగతి ఉద్యోగస్తులు గా గుర్తించాలి. పే స్కేల్ అమలు చెయ్యాలి. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు, భూములను వైసిపి ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. టిడిపి హయాంలో మమ్మలని అన్ని రకాలుగా ఆదుకున్నారు.  రీసర్వే చేస్తున్న మాపై అనేక దాడులు జరుగుతున్నాయి. మా రక్షణ కోసం సెక్షన్ 353 అమలు చెయ్యాలి. మిమ్మలని కలవద్దని అనేక ఆంక్షలు పెట్టి వేధించారు. అయినా మా సమస్యలు మీతో చెప్పుకోవడానికి వచ్చాం. వైసిపి గెలిచిన వారంలో జీతాన్ని 15 వేలకు పెంచుతాం అంటూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ తాలూకు వీడియోను విఆర్ఎలు చూపించారు.

దళితుల భూమిని క‌బ్జా చేసిన వైసీపీ నేత‌ల వివ‌రాలు వెల్లడించిన నారా లోకేష్‌

ద‌ళితుల భూములు క‌బ్జా చేసిన ఎమ్మెల్యేకి సంబంధించిన ఆధారాల‌ను టిడిపి యువ‌నేత నారా లోకేష్ విడుద‌ల చేశారు. శ‌నివారం ప‌త్తికొండ బ‌హిరంగ‌స‌భ‌లో చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళితులు భూములు ఆక్రమించుకున్నార‌ని నారా లోకేష్ ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ క‌బ్జాల‌తో త‌న‌కు సంబంధంలేద‌ని, అవినీతి చేయ‌లేద‌ని ప్రెస్‌మీట్ పెట్టారు. ద‌ళితుల భూములు వైసీపీ నేత‌లు ఆక్రమ‌ణ‌కి సంబంధించిన ఆధారాల‌ను లోకేష్ బ‌య‌ట‌పెట్టారు.

 పేరేముల గ్రామంలోని సర్వే నెం.249,250లలో 25ఎకరాల భూమిని 1986లో గోపాల్ నాయక్, ఆనంద్ నాయక్ ల నుంచి 12 మంది ద‌ళితులు  కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేయించుకున్నారు. 35సంవత్సరాలకు ద‌ళితులు సాగుచేసుకుంటున్న భూమిని 2020లో ఓబులాపురానికి చెందిన విష్ణువర్థన్ రెడ్డి పేరిట దొంగ డాక్యుమెంట్లతో ఆన్ లైన్ చేసుకున్నారు. వైసిపి నేతలు భూమన్నగారి సంజీవరెడ్డి, ఒడ్డూరు వరలక్ష్మీ, పోతిరెడ్డిగారి అరుణమ్మ, అలవాల సూర్యనారాయణరెడ్డిలు భూమిని క‌బ్జా చేశారు. అధికారుల‌ని ఆశ్రయిస్తే స్పందించ‌డంలేదు. భూమిలోకి వస్తే చంపేస్తామంటూ వైసిపి నేతలు బెదిరిస్తున్నారు. పోలీసుల్ని పంపి అక్రమ‌కేసులు బ‌నాయిస్తున్నారు. న్యాయం చేయాలని ఎమ్మెల్యే దగ్గరకు వెళితే ఆ భూమి ద‌ళితుల‌కి చెందిన‌ది కాదంటూ పొమ్మంటున్నారు. ద‌ళితులు 35 ఏళ్లుగా అనుభ‌విస్తున్న భూముల‌కి సంబంధించిన ప‌త్రాలు, ఇవి మీ వైసీపీ నేత‌ల‌కి ఎలా మారాయి, ఎలా క‌బ్జా జ‌రిగాయో క‌ళ్లకు క‌ట్టిన‌ట్టున్న ఆధారాలు ఇవి. ఇప్పుడేమంటారు ఎమ్మెల్యే గారూ అంటూ లోకేష్ ప్రశ్నించారు.

నారా లోకేష్ ను కలిసిన రాంపల్లి సీపీఐ నాయకులు

పత్తికొండ నియోజకవర్గం రాంపల్లి సిపిఐ నాయకులు యువనేత లోకేష్ ను కలిసి గ్రామసమస్యలను విన్నవించారు. 20సంవత్సరాలుగా మా గ్రామానికి సీసీ రోడ్లు లేవు. వాటర్ ట్యాంకు పాడైపోయి శిథిలావస్థకు చేరుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ పూడిక తీయక మురుగునీరు రోడ్లపై పారుతోంది. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. సీపీఐ కాలనీలో విద్యుత్ తీగలు లేవు. అడిగా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం.

 *యువనేత లోకేష్ స్పందిస్తూ…*

గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి శ్రీకారం చుట్టాం. గ్రామాల్లో డ్రైనేజీలు, ఎల్ఇడి వీధిదీపాలు ఏర్పాటుచేశాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక గ్రామాలను కళావిహీనంగా మార్చారు. పంచాతీయలకు చెందిన  రూ.7880 కోట్లను దారిమళ్లించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాంపల్లి వాసుల సమస్యలను పరిష్కరిస్తాం.

*లోకేష్ ను కలిసిన తుగ్గలి మండల యువత

ఉద్యోగాలు కోసం బెంగళూరు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సివస్తోంది. పెండేకల్ ఆర్.ఎస్.గ్రామం హైస్కూల్ బాలికలకు వసతిగృహం ఏర్పాటు చేయాలి. మండల పరిధిలోని కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తికొండలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలి. పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ తెస్తానని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి, నేటికీ అమలు చేయలేదు. మా ప్రాంతంలో కంపెనీలు పెట్టి యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో నిరుద్యోగ యువతను దారుణంగా మోసగించారు. ప్రైవేటురంగంలో కొత్త కంపెనీలను రాష్ట్రానికి రప్పించకపోగా, ఉన్న కంపెనీలను కమీషన్ల కోసం బెదిరించి పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం పక్కరాష్ట్రాలకు వలసలు పోతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు బస్సులు ఏర్పాటుచేస్తాం. రాయలసీమకు స్పోర్ట్స్ అకాడమీ తెచ్చి క్రీడలను ప్రోత్సహిస్తాం.

యువనేతను కలిసి సమస్యలను విన్నవించిన మహిళలు

పత్తికొండ నియోజకవర్గం రాంపల్లిలో మహిళలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. డ్వాక్రామహిళలు అభయ హస్తం పథకం కింద దాచుకున్న రూ.2,500 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. గ్రామాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి మహిళలకు ఉపాధి కల్పించండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసగించాడు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతూ మహిళల మాంగల్యాలు తెగుతున్నాయి. మహిళలకు భద్రత కరువైంది. లేని దిశచట్టం పేరుతో మోసగిస్తున్నారు.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

పాదయాత్ర సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లువేయించుకున్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేశారు. మద్యనిషేధం చేశాకే ఓట్లడుగుతానని చెప్పిన వైసీపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మహిళల వద్దకు వస్తారు? మహిళల స్వయం ఉపాధికి అదనంగా నిధులు కేటాయించకపోగా, వారు పొదుపుసంఘాల్లో దాచుకున్న సొమ్మును దొంగిలించడం దారుణం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభయ హస్తం పథకాన్ని కొనసాగిస్తాం. మహిళల భద్రతకు ఈశాన్యరాష్ట్రాల తరహాలో పటిష్టమైన భద్రత కల్పిస్తాం. మహిళలు కోరినవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ఏర్పాటుచేసి ఉపాధి కల్పిస్తాం

యువనేతను కలిసి సమస్యలను విన్నవించిన రైతులు

పత్తికొండ నియోజకవర్గం మారెళ్ల గ్రామరైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గత మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సరిగా పండక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక నష్టాల చవిచూస్తున్నాం. వేసవిలో తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. హంద్రీనీవా ద్వారా చెరువులు నింపి సాగు, తాగునీరు అందించండి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి.

*యువనేత లోకేష్ మాట్లాడుతూ…*

రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్లలో రాయలసీమ రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 90శాతం సబ్సిడీతో రైతులకు డ్రిప్ పరికరాలు అందించగా, వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి డ్రిప్ సబ్సిడీ ఎత్తేశారు. గతంలోనే 90శాతం పూర్తయిన హంద్రీనీవా కెనాల్స్ పనులను పూర్తిచేసి, రాయలసీమలో గొలుసుకట్టు చెరువులకు నీరందించి సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సబ్సిడీలన్నింటినీ పునరుద్దరించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.

* సీఎంకు పోటీగా ఎమ్మెల్యే!*ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లకు వైసీపీ రంగులు*

పబ్లిసిటీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏమాత్రం తగ్గడంలేదు పత్తికొండ ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం తాము ఫలానా పని చేశామని చెప్పుకోలేక టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులు తాము చేసినట్లు రంగులు వేయించుకుని ప్లెక్సీలు కట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రజల దాహార్తిని తీర్చేందుకు TDP ప్రభుత్వం అన్ని గ్రామాల్లో మాదిరిగానే పత్తికొండ నియోజకవర్గంలో కూడా సుజల మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి నెలరోజుల పాటు నీళ్లు ఇచ్చి, తర్వాత నిలిపేశారు. ఉప్పర్లపల్లి వద్ద నీటిని శుద్ధిచేసే కేంద్రం ఉంది. జగన్ సీఎం అయ్యాక శుద్ధికేంద్రాలకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు.

నాలుగేళ్లలో 30 శాతం పనులు చేయలేకపోయారు

హంద్రీనీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గంలోని 68 గొలుసుకట్టు చెరువులకు నీరు నింపేందుకు రూ.253 కోట్ల నిధులతో టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అప్పట్లోనే 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక పైపులైను పనులు పక్కనబెట్టారు. నాలుగేళ్లుగా పనులు చేయకపోవడంతో పైపులు తుప్పు పట్టిపోతున్నాయి. ఆ పనులు పూర్తైతే భూగర్బ జలాలు పెరిగి వేలాది ఎకరాలకు నీరందడంతో పాటు ప్రజల దాహార్తి తీరేది.

*30ఏళ్ల సర్వీసులో ఏనాడూ ఇన్నీ ఇబ్బందులు పడలేదు*యువనేతను కలిసి కన్నీళ్లు పెట్టుకున్న కానిస్టేబుల్*

30ఏళ్లుగా పోలీసు సర్వీసులో ఉన్నా… ఏనాడూ ఇన్నీ కష్టాలు పడలేదని ఓ కానిస్టేబుల్ యువనేత లోకేష్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. పత్తికొండ నియోజకవర్గం మారెళ్ల శివార్లలో భోజన విరామ స్థలంలో ఓ కానిస్టేబుల్ యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలను మొరపెట్టుకున్నాడు. బయటి ప్రాంతాలకు విధులకెళ్తే కనీసం భోజనాలకు కూడా ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు. జేబులో డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఒక్కొక కానిస్టేబుల్ కు టి.ఎ, డి.ఎల రూపంలో రూ.2లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. గతంలో విదేశీ విద్య పథకం కింద మా పిల్లలు ఉన్నత చదువులకు అవకాశం ఉండేది. గత నాలుగేళ్లుగా దరఖాస్తులు పంపితే రకరకాల సాకులతో తిప్పి పంపుతున్నారు. అప్పలుచేసి మా బిడ్డలను చదివించుకుంటున్నాం. అడ్డగోలు పనులను అడ్డుకుంటే మా అంతు చూస్తామంటూ వైసిపి నేతలు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి నానా బూతులు తిడుతున్నారు.  అధికారపార్టీ పెద్దల వత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని కొన్నిసార్లు నిబంధనలు అతిక్రమించి పనిచేయాల్సి వస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక పెద్దమనసుతో మమ్మల్ని ఆదుకోండి. మా బిడ్డల ఉన్నత విద్యాభ్యాసానికి సాయం అందించండి. టిఎ, డిఎల బకాయిలను చెల్లించి మమ్నల్ని అప్పుల ఊబినుంచి బయటపడేయండి. స్వేచ్చగా విధినిర్వహణ చేసే అవకాశం కల్పించండి.

Also, read this blog: Fueling the Fire Within by Yuvagalam in Kurnool’s youth

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *