Nara Lokesh Yuvagalam Padayatra

కోడుమూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన యువగళం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు… వెల్లువెత్తిన వినతులు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర

కోడుమూరు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 88వరోజు పాదయాత్ర కోడుమూరు శివారు నుంచి ప్రారంభం కాగా, కోడుమూరులో యువనేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలు అడుగడుగునా యువనేతను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా లోకేష్ ని కలిసేందుకు ప్రజలు బారులు తీరారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్దులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు.  నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పన్నులు విపరీతంగా పెంచేశారు. చెత్త పన్ను కట్టాలని వేధిస్తున్నారు. కట్టకపోతే ఇంట్లో ఎదైనా సంక్షేమ కార్యక్రమం వస్తే అందులో కట్ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన చెందారు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నామని యువకులు లోకేష్ కు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాకి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. పాదయాత్ర దారిలో బుడగ జంగాలు, రాయలసీమ మాదిగ దండోరా నాయకులు, చేనేతలు, కోడుమూరు మండల రైతులు, ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని చెప్పి ముందుకు సాగారు. అనుగొండ శివార్లలో భారీ వర్షంలో సైతం యువనేత పాదయత్రను కొనసాగించారు. రేమండూరు వద్ద యువగళం పాదయాత్ర పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పాణ్యం ఇన్ చార్జి గౌరు చరితారెడ్డి నేతృత్వంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. 88వరోజు లోకేష్ 15.9 కిలోమీటర్ల దూరం నడిచారు ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1135.6 కి.మీ పూర్తయింది.

పాదయాత్రలో యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

నా ముగ్గురు కొడుకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు -లక్ష్మీదేవి, క్రిస్టియన్ కాలనీ, కోడుమూరు

నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్దబ్బాయి బీటెక్, రెండో అబ్బాయి డిగ్రీ, మూడో అబ్బాయి పాలిటెక్నిట్ చదివారు. నాలుగేళ్లుగా ఖాళీ ఉంటున్నారు. రెండో అబ్బాయి గ్రూప్స్ కు ప్రిపేర్ అయి ఉన్నాడు. ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. కోచింగ్ లకే లక్షలు ఖర్చు అవుతోంది.

పత్తికాయలు పుచ్చాయి..ఉల్లిగడ్డలు మురిగిపోయాయి! -గిడ్డయ్య, రైతు, వెంకటగిరి

ఐదేకరాల పొలంలో గతేడాది 3 ఎకరాల ఉల్లి, 2 ఎకరాల పత్తి నాటాను. రూ.3 లక్షలకు పైనే పెట్టుబడి అయింది. వర్షాల వల్ల పత్తికాయ పాచిపోయి, పుచ్చుపట్టింది. 3 ఎకరాలు గుడ్డిపత్తి వచ్చింది. 8 క్వింటాల పత్తిని రూ.1,500 చొప్పున కొన్నారు.  ఉల్లి కోసే సమయానికి వర్షం వచ్చింది. బురద ఆరకపోవడంతో భూమిలోనే ఉల్లి గడ్డలు కుళ్లిపోయాయి. చేసిన కష్టానికి కూడా డబ్బులు మిగల్లేదు. నా భార్య ఎడమ చేయి ఆరేళ్ల క్రితం ఇరిగింది. ఇప్పటికీ చేతిలో రాడ్డు ఉంది. కానీ పెన్షన్ ఇవ్వడం లేదు.

చాలీచాలని జీతంతో పొరుగు రాష్ట్రంలో! -సాయి కుమార్, బిటెక్ స్టూడెంట్, కోడుమూరు.

నేను బీటెక్ రెండేళ్ల క్రితం పూర్తి చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి హైదరాబాద్ లో కోచింగ్ పూర్తి చేశాను. కానీ ఏపీలో కాకుండా చెన్నై, బెంగళూరులోనే ఉద్యోగం చేయాలని కంపెనీ యాజమాన్యం చెప్పింది. రెండు నెలలుగా నెలకు రూ.25 వేలు తీసుకున్నా. వచ్చే రూ.25 వేలల్లో అద్దెలు, తిండికే నెలకు రూ.20 వేలు అయిపోతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రూ.5 వేలతో ఇంటికి రావాలంటే ఏదోలా ఉంది. ఉద్యోగాలు ఏపీలోనే ఉద్యోగం కల్పించేలా చేస్తే బాగుటుంది.

దళితులపైనే ఎస్సీ,ఎస్టీ చట్టం ప్రయోగించే దుర్మార్గపు ప్రభుత్వం టిడిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం దళితులను తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం ఎస్సీల్లో ఉపకులాల వారందరికీ సామాజిక న్యాయం చేస్తాం ఎస్సీ స్మశాన వాటికలకు భూములు కేటాయిస్తాం దళితులతో ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్

కోడుమూరు: వైసీపీ పాలనలో దళితులపై దమనకాండ జరుగుతోంది, 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేసిన జగన్ అని టిడిపి యువనేత Nara Lokesh తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడుమూరు నియోజకవర్గం వెంకటగిరిలో ఎస్సీలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే దుర్మార్గపు ప్రభుత్వమిది.  టిడిపి సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది.  దళితుల్లో ఉన్న 62 ఉపకులాలకు న్యాయం చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభించి, అంబేద్కర్ గారి పేరు పెడతాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి వైసిపి నాయకులు లాక్కున్న దళితుల భూములు అన్ని తిరిగి దళితులకు అందిస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని తిరిగి ప్రవేశపెడతాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలుచేస్తాం.

జగన్ రద్దుచేసిన పథకాలన్నీ మళ్లీ ప్రవేశపెడతాం!

టిడిపి హయాంలో 3 వేల ఎకరాలు భూమి కొనుగోలు చేసి మరీ దళితులకు ఇచ్చాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు భూమి కేటాయింపు కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తాం. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. విదేశీ విద్య పథకం కి అంబేద్కర్ పేరు తొలగించడం దుర్మార్గం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. జగన్ పేరు తొలగించి అంబేద్కర్ గారి పేరు పెడతాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎస్సీలకు అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అమలు చేస్తాం. దళితులకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తాం. టిడిపి హయాంలో ఎస్సీ ల కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేసాం. జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఎస్సీలకు 100 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఎన్ఎస్ఎఫ్డీసి పథకం ద్వారా ఇన్నోవాలు, జేసిబిలు పొందిన వారు జగన్ పాలన లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలన, కరోనా కారణంగా ఇబ్బంది పడిన లబ్దిదారులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటాం. స్మశానం భూములు లేవని ఎంతో మంది నా దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల స్మశానం కోసం భూములు కేటాయిస్తాం. మౌలిక వసతులు కల్పిస్తాం.

ఎస్సీ కాలనీల నుంచే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించా!

 మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కాలనీల నుండే అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకుంది మీ లోకేష్. సిసి రోడ్లు, త్రాగునీరు, ఎల్ఈడి వీధి దీపాలు అన్ని మొదట ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తరువాతే మిగిలిన కాలనీల్లో మొదలుపెట్టేలా నిర్ణయం తీసుకున్నాను. దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఎంటి అని నేను అంటే ఫేక్ వీడియో తయారు చేసి హడావిడి చేస్తున్నారు. జగన్ చెబితే ఎవరూ నమ్మడం లేదు అని భారతీ రెడ్డి గారిని రంగంలోకి దింపారు. ఆవిడ ఒక ఫేక్ వీడియో తయారు చేసి నేను దళితుల్ని హత్య చేశానని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఇప్పటికే అనేక సార్లు సవాల్ చేసాను. నేను దళితుల్ని అవమానపర్చానని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా  తప్పుకుంటాను. నిరూపించలేకపోతే సాక్షి మీడియా ని మూసేస్తారా భారతీ రెడ్డి గారు?

ఎస్సీల కోసమే మొదటిసారి జైలుకు!

నేను నా జీవితంలో మొదటి  పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఒక దళిత యువతీ కుటుంబానికి న్యాయం చెయ్యమని పోరాటం చేసినందుకు. గుంటూరు లో రమ్య అనే దళిత యువతి ని ఒక మృగం నడి రోడ్డు మీద హత్య చేసాడు. ఆ కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగినందుకు నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి 5 లక్షలు సాయం చేసాం. న్యాయ పోరాటానికి కూడా సాయం చేసాం. అమరావతి దళిత రైతుల కోసం పోరాడినందుకు రెండో సారి స్టేషన్ కి వెళ్ళాను. కావలిలో వైసిపి నాయకులు వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే టిడిపి ఆదుకుంది. 15 లక్షల ఆర్ధిక సాయం అందించి తనఖాలో ఉన్న ఇల్లు విడిపించి కుటుంబానికి అందజేసాం. దళిత యువతి స్నేహాలతను చంపేస్తే పోరాడింది టిడిపి. రెండు లక్షల ఆర్ధిక సాయం అందించాం. రేపల్లె రైల్వే స్టేషన్ లో ఒక దళిత మహిళ పై అత్యాచారం జరిగితే ఆమెకు న్యాయం చెయ్యాలి అని పోరాడింది టిడిపి. ఆమెకు రెండు లక్షల ఆర్ధిక సాయం చేసింది టిడిపి. దళితులు అంతా ఎవరి హయాంలో న్యాయం జరిగిందో అర్దం చేసుకోవాలి. కోడుమూరు నియోజకవర్గం లో టిడిపి నలభై ఏళ్లుగా గెలవలేదు. ఈ సారి టిడిపి ని గెలిపించండి కోడుమూరు కి అభివృద్ది ని పరిచయం చేస్తాం.

మాదిగలకు న్యాయం చేసింది టిడిపినే!

2001లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది N Chandrababu Naidu గారు. దాని ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయి. వేల మందికి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. వైయస్ గారు వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన నాటకం, జగన్ పాలనలో జరుగుతున్న నాటకం మీరు చూస్తున్నారు. సుప్రీం కోర్టు పార్లమెంట్ లో చట్టం ద్వారా వర్గీకరణ చెయ్యాలని డైరెక్ట్ చేసింది. ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో చంద్రబాబు గారు జీఓ 25 తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాల అమలు లో వర్గీకరణ తీసుకొచ్చారు. ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా జీఓ 25 తీసుకొచ్చారు చంద్రబాబు. జీఓ 25 వలనే జగన్ మూడు కార్పొరేషన్లు తీసుకొచ్చారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్కరికి రుణం ఇవ్వలేదు.

ఎస్సీ సామాజికవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ…

జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు. దళితుల్ని చంపిన వారికి శిక్ష పడటం లేదు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దళితుల్లో ఉన్న ఉప కులాలకు సామాజిక న్యాయం జరగడం లేదు. దళితుల భూములు లాక్కుని మాపైనే రివర్స్ లో కేసులు పెట్టి వేధిస్తున్నారు. టిడిపి హయాంలో ట్రాక్టర్లు, ఇన్నోవాలు, జేసిబిలు ఇచ్చారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ఆ పథకాల్ని రద్దు చేసింది. వైసిపి పాలనలో ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, స్మశానాల అభివృద్దికి నిధులు కేటాయించడం లేదు.

ఎస్సీల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

కిరణ్ : ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఛార్జ్ షీట్ వేసిన 60రోజుల్లో కోర్టుతీర్పు చెప్పాలని చట్టంలో ఉంది. హోలగుందలో ఎస్సీలపై దాడి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు, డాక్టర్ సుధాకర్ కేసు లాంటివి చాలా ఉన్నాయి. హత్యలు, దాడులు చేసిన వాళ్లు మా ముందే తిరుగుతున్నారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. మీరొచ్చాక మాకు న్యాయం చేయండి.

అనంతరత్నం : రాష్ట్రంలో 90 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. మాదిగ ఓటర్లు 40 లక్షలు ఉన్నారు. మాలలు 30 లక్షలు ఉన్నారు. గతంలో మాదిగలకు 8, మాలలకు 20 సీట్లు ఇచ్చారు. సీమలో మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. ఆదోని డివిజన్ లోని ప్రజలు ఎండాకాలంలో వలస వెళ్తున్నారు.

దేవన్న మాదిగ : మా పొలాన్ని తప్పుడు రికార్డులతో వేరే వ్యక్తిపై ఆన్ లైన్ లో ఎక్కించారు. దీనిపై నేను తహశీల్దార్ ను అడిగితే సమాధానం చెప్పలేదు. ఎస్ఐ, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశాను. వాళ్లు నాకు న్యాయం చేయకుండా తహశీల్దార్ కు వత్తాసు పలికారు. ఎస్ఐ, ఎస్ పిల పై కేసు పెట్టాలని కోర్టు ఆదేశిస్తే, తిరిగి నాపై నాపైనే ఎదురు కేసులు పెట్టారు.

మణిరాజు : గత ప్రభుత్వంలో ఎస్సీలకు ఇన్నోవా, జేసీబీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక పథకాలు రద్దు చేసింది.  అధికారంలోకి వచ్చాక ఆ పథకాలను పునరుద్దరించండి.

విజయ్ కుమార్ : ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దళితులకు కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలు పరిష్కరించండి.

నరేష్ : ఈ ప్రభుత్వం కొత్తగా భూహక్కు- భూరక్ష తీసుకొచ్చింది. దీంతో మా భూములను చుక్కల భూములుగా ఆన్ లైన్ చేస్తున్నారు. మీరొచ్చాక మాకు న్యాయం చేయండి.

నగేష్ మాదిగ : 2024లో మీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించండి. టీడీపీ హయాంలో భూ కొనుగోలు పథకం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది లబ్ధిపొందారు. ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాటిని మీరు మళ్లీ ప్రవేశపెట్టండి.

యువనేతను కలిసిన బుడగ జంగాల ప్రతినిధులు

కోడుమూరు హంపయ్య సర్కిల్ లో బుడగ జంగాల ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బేడ/బుడగ జంగాలను ఎస్సీలుగా పరిగణించే అంశంపై జెసి శర్మ కమిషన్ నివేదిక ఆమోదించి, కేంద్రానికి పంపేలా వత్తిడి తేవాలి. సంచార జాతిగా ఉన్న బేడ/బుడగ జంగాలు పేదరికంలో మగ్గుతున్నారు. మా జీవితాలకు ఉరితాడుగా పరిణమించిన 2008నాటి జిఓ 144ను రద్దుచేయాలి. బేడ/బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలుతీసుకోవాలి.

లోకేష్ మాట్లాడుతూ…

బేడ/బుడగ జంగాల సమస్యపై వైసిపి ప్రభుత్వం నాన్పుడు ధోరణితో వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సామాజికర్గానికి న్యాయం చేస్తాం. ఎస్సీలకు వర్తించే సంక్షేమ పథకాలన్నింటినీ బేడ/బుడగ జంగాలకు వర్తింపజేస్తాం. కేంద్రం అడిగిన క్లారిఫికేషన్లకు సమాధానమిచ్చి, సమస్య పరిష్కరిస్తాం.

లోకేష్ ను కలిసిన రాయలసీమ మాదిగ దండోరా ప్రతినిధులు

కోడుమూరు వెల్దుర్తి రోడ్డులో రాయలసీమ మాదిగ దండోరా ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించాలి. ఎస్సీ నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగాలు పొందేలా సహకరించాలి. ఎస్సీలకు నాణ్యమైన విద్య అందించేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని పునఃప్రారంభించాలి. ఎస్సీలకు గత ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్దరించాలి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్ లో వేసవికాలంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. గండ్రేవుల, వేదావతి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో చేపట్టి వలసలను నివారించాలి. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. అమరావతి రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతోపాటు బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…

అధికారంలోకి వచ్చాక రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన జగన్ రెడ్డి. 27ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేసి దళితులకు తీరని అన్యాయం చేశారు. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పునరుద్దరిస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ లను రద్దుచేసిన వైసిపి ప్రభుత్వం  పేద ఎస్సీలను విద్య, ఉద్యోగాలకు దూరం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తిచేసి వలసలను నివారిస్తాం. మాదిగల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. అమరావతిలో జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

యువనేత లోకేష్ ను కలిసిన చేనేతలు

కోడుమూరు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో చేనేత సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.  చేనేత ముడిసరుకులకు జిఎస్ టి రద్దు చేయాలి. కర్నూలు జిల్లాలో సిరిసిల్లలో మాదిరిగా మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేయాలి. కోడుమూరులో తయారుచేసిన చేనేత చీరలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో గద్వాల వ్యాపారులు వచ్చి తక్కువధరకు కొనుగోలు చేయడంతో కార్మికులు నష్టపోతున్నారు. కోడుమూరు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. కంప్యూటర్ జకాటీలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకుండా ఇబ్బంది పడుతున్నాం. వాటిని రాయితీపై అందించాలి. గత ప్రభుత్వం పట్టుపై ఇచ్చిన రూ.1000 రాయితీని పునరుద్దరించాలి. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని తిరిగి అమలుచేయాలి. చేనేత కార్మికులకు రాయితీ విద్యుత్ అందించాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యల కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక్క ధర్మవరంలోనే 55మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాలను కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా చేనేతలకు రూ.111 కోట్ల రుణమాఫీ చేశాం. చేనేత కార్మికులు కోరిన విధంగా చేనేత ముడిసరుకు, ఉత్పత్తులపై జిఎస్సీ రద్దుచేస్తాం. చేనేతల వస్త్రాలకు బ్రాండింగ్ చేసి, జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. మగ్గాలున్న చేనేతలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం. సిల్క్ సబ్సిడీ, ఆరోగ్య బీమాలను పునరుద్దరిస్తాం. కంప్యూటర్ జకాటీల కొనుగోలుకు రాయితీపై రుణసౌకర్యం కల్పిస్తాం. ఎమ్మిగనూరులో 10వేలమందికి ఉపాధి కల్పించే మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తాం.

లోకేష్ ను కలిసిన వెంకటగిరి గ్రామప్రజలు

కోడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో మంచినీటి సమస్య ఉంది. గ్రామంలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఇళ్ల ముందు సొంతగా రోడ్లు మరమ్మతు చేసుకుందామన్న గ్రావెల్ సమస్య తీవ్రంగా ఉంది. ఎస్సీ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మా గ్రామ సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం అందించండి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి పంచాయితీల నిధులు దారిమళ్లించి గ్రామసీమలను నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్, పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు కూడా నిధులులేవు. TDP ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటుచేసి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.

యువనేతను కలిసిన కోడుమూరు మండల రైతులు

కోడుమూరు మండలం లద్దగిరి, అల్లీనగరం, కొండాపురం, యర్రదొడ్డి, చిల్లబండ గ్రామాల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాల క్రితం తుంగభద్ర లో లెవల్ కెనాల్ (ఎల్ఎల్ సి) నుంచి మా పొలాలకు రెండు పంటలకు నీరిచ్చారు. గత పదేళ్లుగా నీళ్లు రావడం లేదు. మా గ్రామాలకు వచ్చే కాలువకు బావులవంపు వంక పైనుంచి 20 సైపన్లు (పైపులు) వర్షపునీరు కిందకు వెళ్లేలా అమర్చారు. ఆ పైపులు శిథిలమైనందున కొత్తవి ఏర్పాటుచేసి, పైనుంచి వచ్చే కాల్వకు మరమ్మతులు చేపట్టాలి. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్య పరిష్కరించండి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

వైసిపి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు నిర్మించకపోగా, చిన్నచిన్న మరమ్మతు పనులు కూడా చేయలేని దివాలాకోరు స్థితిలో ఉంది. గత టిడిపి హయాంలో రాయలసీమలో ప్రాజెక్టుల కోసం రూ.11,700 ఖర్చుచేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక 10శాతం కూడా ఖర్చుచేయలేదు. మరమ్మతులు చేయకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది ప్రాణాలు కోల్పోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మరమ్మతు పనులు చేపట్టి కోడుమూరు మండల రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తాం.

*యువనేత లోకేష్ ను కలిసిన అనుగొండ ప్రజలు

కోడుమూరు నియోజకవర్గం అనుగొండ ప్రజలు యువనేత నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. హంద్రీనీవా నుంచి పైపుల వేసుకొని మా గ్రామ ప్రజలు దాహార్తి తీర్చుకుంటున్నాం. హంద్రీనావా నుంచి కొందరు ఇసుకను అక్రమంగా తవ్వి, తరలించడంతో భూగర్భజలాలు ఇంకిపోయి, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. అనుగొండ గ్రామాన్ని ఆనుకొని ఉన్న వాగు పూడిపోయి వర్షాలు పడినపుడు నీరు గ్రామంలోకి వస్తోంది. మా గ్రామం ముంపు బారిన పడకుండా పూడిక తీయించాలి. ఇసుక అక్రమరవాణాను అరికట్టి మా గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలి.

*యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక అక్రమరవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు వద్ద వరదల సమయంలో గేట్లు ఎత్తకపోవడంతో 61మంది అమాయక ప్రజలు బలయ్యారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రాష్ట్రవ్యాప్తంగా పేట్రేగిపోతోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపుతాం, అనుగొండ వాగు పూడిక తీత చేపట్టి ముంపుబారిన పడకుండా రక్షణ కల్పిస్తాం.

Also, read this blog: Step into a world of exploration with Yuvagalam Padayatra

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *