ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర. మండుటెండల్లో యువనేత ఎదుట సమస్యల వెల్లువ, అడుగడుగునా హారతులతో మహిళల నీరాజనాలు

ఆలూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 74వరోజు ఆలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అడుగడగునా మహిళలు యువనేతకు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. మండుటెండల్లో సైతం వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్యలు విన్నవించారు. పల్లె దొడ్డి లో లోకేష్ ని కలిసిన మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… TDP హయాంలో గ్రామాల్లో 25 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసాం. ఇప్పుడు జగన్ పంచాయతీ నిధులు కాజేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. దేవనకొండలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు యువనేతకు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు.  అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచారు. చెత్త పన్ను కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దేవనకొండలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి తమ సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ముందుకు సాగారు. వలగొండ క్రాస్ వద్ద జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా జనం హాజరయ్యారు.

దేవరకొండ చెరువు వద్ద సెల్ఫీచాలెంజ్

ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ చెరువు వద్ద యువనేత లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఒకప్పుడు దేవనకొండ చెరువు ఎండిపోయి ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో  చెరువును లింక్ చేశాము.  దీని వల్ల దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా నీరు అందుతున్నాయి. ఇది మా ప్రభుత్వం ఘనత. ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా జగన్ అంటూ సవాల్ విసిరారు.

ఆలూరులో వైసీపీ ప్రభుత్వం పనైపోయింది!

ఆలూరులో ప్రజల ఉత్సాహం చుసిన తరువాత  వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని ఫిక్స్ అయిపోయా.  ఆలూరు..పేరు మాత్రమే సాఫ్ట్ కానీ ఇక్కడ ప్రజలు చాలా స్ట్రాంగ్. బ్రిటిషు పాలకులనే గడగలాడించిన చరిత్ర ఆలూరు ప్రజలది. మీకు వైసీపీ ప్రభుత్వం ఒక లెక్కా? చిప్పగిరి ప్రాంతంలో శ్రీ కృష్ణ దేవరాయలు చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మించారు. తెర్నెకల్ లో  బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ముత్తుకూరు గౌడప్ప ఇక్కడే జన్మించారు. ఎల్లార్తి దర్గా, దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఆలూరు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ ఆలూరు గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. నేను ఏం మాట్లాడినా దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారు. మా కార్యకర్తలపై దాడులు చేసిన వాళ్లకు, అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం. నాపై 20 కేసులు ఉన్నాయి. అయినా తగ్గే ప్రసక్తే లేదు. భయం మన బయోడేటాలో లేదు. వచ్చే ఎన్నికల యుద్ధానికి ఆలూరు ప్రజలు సిద్ధమా? ఆలూరులో పసుపుజెండా ఎగిరి 25ఏళ్లు అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఆలూరులో పసుపుజెండాను భారీ మెజార్టీతో ఎగరేయండి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తా.

ఒక్క ఛాన్స్ తో దోచేస్తున్న వైసీపీ ప్రభుత్వం!

జనం జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ జనాన్ని లూటీ చేసాడు.. వెయ్యి రూపాయిలు ఖర్చు దాటిన ఏ జబ్బుకైనా ఆరోగ్య శ్రీ అన్నాడు. ఇప్పడు ఆరోగ్య శ్రీ ని అనారోగ్య శ్రీ గా మార్చేసాడు. బిల్లులు బకాయి పెట్టడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తాం అని ప్రైవేట్ హాస్పిటల్స్ అంటున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం దూది, మందులు లేని పరిస్థితి.  విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి ప్రభుత్వం వైసీపీ.

యువత, మహిళలను చీట్ చేసింది!

వైసీపీ ప్రభుత్వం యువతని చీట్ చేసింది. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.

రైతులను కోలుకోలేని దెబ్బతీశాడు!

రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు.  వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.  వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పెన్షనర్ల కు సమయానికి పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు.  పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు.

బిసిల శాశ్వత కులధృవీకరణ పత్రాలిస్తాం

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు.  పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం.  బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం.  మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం.  దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.

మైనారిటీలనూ మోసగించిన వైసీపీ ప్రభుత్వం

మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.

రాయలసీమకు  బిడ్డ అంటాడు కానీ కాదు….

నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ కాదు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసింది వైసీపీ. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ  వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

గుమ్మనూరి వల్ల ఒరిగిందేమిటి?

ఆలూరు ఎమ్మెల్యే గారు. మీరు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు. 2019 లో 40 వేల మెజారిటీతో గెలిపించారు. ఆయన మంత్రి కూడా అయ్యారు.  కానీ ఆలూరు 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉందొ ఇప్పుడు అక్కడే ఉండిపోయింది. అభివృద్ధి కి ఆలూరు ఆమడ దూరంలో ఉంది. గుమ్మనూరు జయరాం గారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆలూరు ఎమ్మెల్యే గారు, ఆయన తమ్ముడు మరో ఆరు కుటుంబాలు తప్ప ఒక్క వాల్మీకి కుటుంబానికైనా న్యాయం జరిగిందా? ఆయన వందల ఎకరాల అధిపతి అయ్యారు. ఎకరం భూమి కొనే స్థితిలో ఇక్కడ వాల్మీకులు ఉన్నారా? ఆయన బెంజ్ లో తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకులు కనీసం సైకిల్ కొనుక్కునే పరిస్థితిలో అయినా ఉన్నారా? ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాం లో ఆయన బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారు. అందుకే ఆయనని అందరూ బెంజ్ మంత్రి అంటున్నారు. ఈ పేరు నేను పెట్టింది కాదు ఆయన అవినీతి ఏ రేంజ్ లో ఉందో చూసిన తరువాత ప్రజలే ఆయన్ని బెంజ్ మంత్రి అని పిలవడం మొదలు పెట్టారు. బెంజ్ కారులో ఆలూరు రోడ్ల మీద తిరిగే దమ్ముందా మంత్రి గారూ? మీ బెంజ్ ఏమి గాల్లో వెళ్ళదు కదా! ఆలూరులో రెండు రోజులుగా తిరుగుతున్నా అమ్మో రోడ్లు దారుణం.

ఆ డబ్బు మేం చెల్లిస్తాం… రిజిస్ట్రేషన్ చేయండి!

బెంజ్ మంత్రి గారి భార్య గారు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్లపైన ఆస్పరి మండలంలో ఇటినా కంపెనీ నుంచి 180 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ భూములు బినామి పేర్లతో లెక్కల్లో చూపని ఆదాయంతో కొన్నారని, ఇవి అక్రమాస్తులే అని ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక అటాచ్ చేసింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా రిజిస్ట్రేషన్ కి డబ్బులు చెల్లిస్తే ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.  ప్రభుత్వ ధర ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ డబ్బు మేము చెల్లిస్తాం. మంత్రి గారు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చెయ్యడానికి సిద్ధమా అని సవాల్ చేస్తున్నాను. మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు అంతర్రాష్ట్ర  రాష్ట్ర పేకాట క్లబ్ నిర్వాహిస్తున్నారు. ఆ క్లబ్ పై దాడులు చేసిన పోలీస్ అధికారులపైనే దాడులు చేశారు. 

పత్తికొండ, నగరడోనా రిజర్వాయర్లు పూర్తిచేస్తాం

2014 లో ఇక్కడ టిడిపి గెలవక పోయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సిసి రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. కానీ మీరు ఏమి చేసారు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.  ఇక్కడ ప్రజలు సాగునీటి, తాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు కన్నీరు వస్తుంది. నియోజకవర్గంలో రోడ్లు చూసిన తరువాత అసలు బెంజ్ మంత్రికి మంత్రి పదవి అవసరమా అనిపించింది. వేదవతి  ఎత్తిపోతల పథకం ద్వారా ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం చంద్రబాబు రూ.1,942.38 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టారు. జగన్ వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును అటక ఎక్కించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం.  వైసిపి ప్రభుత్వం ఆపేసిన పత్తికొండ రిజర్వాయర్, నగరడోన రిజర్వాయర్ లను పూర్తిచేస్తాం. 

అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ తాగునీరు

ఆలూరు పట్టణం సహా మెజార్టీ గ్రామాలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. వారం పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదు. తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వంలో వాటర్ గ్రిడ్ కు రూపకల్పన చేస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అతీగతి లేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిఇంటికి నీటి కుళాయి ద్వారా సురక్షిత తాగు నీరు అందిస్తాం. రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి. కొత్త రోడ్లు మేము వేస్తాం. టమాటో, ఉల్లి, పత్తి, మిరప, బెంగాల్ గ్రామ్ రైతుల కష్టాలు నాకు తెలుసు. పెట్టుబడి ఖర్చు తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం.  ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రులకు సొంత భవనాలు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. కార్మికశాఖ మంత్రి బెంజ్ మంత్రి గారి నియోజకవర్గంలో యువతకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేక ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలు ఆపుతాం.

గొర్రెల ఫామ్ ను పరిశీలించిన యువనేత లోకేష్

ఆలూరు నియోజకవర్గం పల్లెదొడ్డి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్ ని యువనేత లోకేష్ పరిశీలించారు. రైతు నాగమ్మ, ఆమె భర్త కృష్ణన్న గౌడ్ తో మాట్లాడి గొర్రెల పెంపకం లో వారు ఎదుర్కుంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగమ్మ దంపతులు మాట్లాడుతూ…  రెండేళ్లుగా షెడ్ ఏర్పాటు చేసుకొని గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నాం. షెడ్ నిర్మాణానికి రెండున్నర లక్షల ఖర్చు అయ్యింది. మొదటి ఏడాది 50 గొర్రెల తో ఫామ్ ప్రారంభించాం. రెండేళ్ల లో రెండు లక్షల నష్టం రావడంతో ప్రస్తుతం 30 గొర్రెలు మాత్రమే పెంచుతున్నాం. ఏడాదికి మేత, దాణా, మందులు, ఇతర ఖర్చులు సుమారుగా రెండు లక్షలు అవుతుంది. ఇంత కష్టం చేస్తే రోజు కూలీ మాత్రమే మిగులుతుంది. ప్రభుత్వం నుండి షెడ్ నిర్మాణం, మేత, దాణా, మందులు కొనడానికి ఎటువంటి సహాయం, సబ్సిడీలు రావడం లేదని నాగమ్మ కన్నీరు పెట్టుకున్నారు. అధైర్య పడొద్దు అంటూ నాగమ్మ కు లోకేష్ ధైర్యం చెప్పారు.

లోకేష్ మాట్లాడుతూ…

అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంత ప్రమాదమో కళ్లారా చూస్తున్నాను. గొర్రెల పెంపకం కోసం టిడిపి పాలనలో అనేక చర్యలు తీసుకున్నాం. గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. మేత, దాణా, మందులు అన్ని సబ్సిడీ ధరకి అందించాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. టిడిపి హయాంలో షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందించాం. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి మినీ గోకులంలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు కనీసం గొర్రెల పెంపకం కోసం తాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీ తో షెడ్లు నిర్మాణం కోసం రుణాలు అందించి గొర్రెల ఫామ్ నిర్వహణ కు సహకారం అందిస్తాం. మందులు, ఫీడ్ అన్ని తక్కువ ధరకు అందించి గొర్రెల పెంపకంలో రైతులకి లాభం వచ్చేలా చేస్తామని భరోసా ఇచ్చారు.

యువనేతను కలిసిన పల్లెద్దొడ్డి గ్రామస్తులు

ఆలూరు నియోజకవర్గం పల్లెదొడ్డి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామానికి టీడీపీ హయాంలో గాజులదిన్నె ప్రాజెక్టు నుండి నీళ్లు తెచ్చేందుకు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం తలపెట్టారు.  ఈ ప్రభుత్వం పెండింగ్ పనులపై శ్రద్ధపెట్టడం లేదు.  మీ ప్రభుత్వం వచ్చాక మా గ్రామానికి తాగునీరు అందించాలని కోరారు.

నారా లోకేష్ స్పందిస్తూ…

ధనదాహంతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నేతలకు ప్రజల దాహార్తి కనిపించడం లేదు. ప్రతి ఇంటికీ తాగునీరివ్వాలన్న లక్ష్యంతో జల జీవన్ మిషన్ పనులు వేగంగా చేశాం. జల్ జీవన్ మిషన్ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. పకడ్బందీగా అమలు చేసి ఉంటే నేడు ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు వచ్చేవి. టీడీపీ అధికారంలోకి రాగానే పల్లెదొడ్డిలో పైపులైను నిర్మాణం సత్వరమే పూర్తి చేసి, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి తాగునీరు అందిస్తాం.

లోకేష్ ను కలిసిన గద్దెరాళ్ల గ్రామస్తులు

ఆలూరునియోజకవర్గం, గద్దెరాళ్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో రైతులు కాలువలు,పిల్లకాలువలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామం మీదుగా 8 గ్రామాల ప్రజలు తిరుగుతుంటారు. మా గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు. కర్నూలు-బళ్లారి హైవే దగ్గర మా గ్రామంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలి. గద్దెరాళ్ల మారెమ్మ దేవస్థానం పునరుద్ధరణ చేయాలి.

లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయారు. రైతులకు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను నిలిపేశారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేవు. రోడ్లు నిర్మాణాలు లేవు. మేం అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా, పందికోన రిజర్వాయ్ నుండి రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో అవసరమైన రోడ్లు నిర్మిస్తాం. అవసరమైన ప్రదేశాల్లో బస్టాండ్ నిర్మిస్తాం. గద్దెరాళ్ల మారెమ్మ దేవాలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం.

శనగచేలో దిగి రైతుకూలీల కష్టాల విన్న లోకేష్

ఆలూరు నియోజకవర్గం దేవనకొండ శివార్లలో యువనేత లోకేష్ శనగచేలో దిగి అక్కడి రైతుకూలీల సాధకబాధకాలు తెలుసుకున్నారు. రోజంతా కష్టపడితే రూ. 200 కూలీ వస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలతో బతుకుబండి లాగలేకపోతున్నాం. కరెంటుబిల్లులు భారీగా పెరిగాయి. వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అయింది. పల్లెల్లో తాగడానికి నీళ్లు కూడా ఉండడం లేదు. కుటుంబసభ్యులు అద్దెకు ఆటోలు నడుపుకుంటుంటే పింఛను తీసేస్తున్నారని రైతుకూలీలు వాపోయారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకిపారేయడమే కరెంటుబిల్లుకు పరిష్కార మార్గం. టిడిపి హయాంలో రూ. 200 ఉన్న పింఛనును రూ.2వేలకు పెంచాం. సంక్షేమ కార్యక్రమాలు తెచ్చింది, వాటిని కొనసాగించేది చంద్రబాబే. జగన్ ప్రభుత్వం కుంటిసాకులతో తొలగించిన పెన్షన్లు పునరుద్దరిస్తాం. చంద్రబాబు హయాంలో ఉల్లి రైతులకు రాయితీ అందించాం. అధికారంలోకి వచ్చాక ప్రతి పల్లెలో తాగు నీటి సమస్య లేకుండా చేస్తాం. ధైర్యంగా ఉండండి… రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో అన్ని సమస్యలు తీరుతాయి.

యువనేతను కలిసిన దేవనకొండ దళితులు

ఆలూరు నియోజకవర్గం దేవనకొండ దళితులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.  మండల కేంద్రం దేవనకొండ ఎస్సీ కాలనీలో 600కుటుంబాలున్నాయి. శుభకార్యాలు చేసుకునేందుకు కమ్యూనిటి హాలు ఏర్పాటుచేయండి. దేవనకొండలో ఎస్సీ, బీసీ హాస్టళ్లులేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీ బాలికలకు హాస్టల్ ఏర్పాటుచేయండి.

యువనేత లోకేష్ స్పందిస్తూ….

రాష్ట్రంలో ఎస్సీలకు చెందాల్సిన రూ.28,149కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించిన దళితద్రోహి వైసీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో దళితులకు అమలుచేసిన 27సంక్షేమ పథకాలు రద్దుచేశారు. గత టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాం. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ కాలనీలను అభివృద్ధి చేస్తాం. దేవనకొండలో దళితులకు కమ్యూనిటీ హాలు, ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేపడతాం.

యువనేతను కలిసిన ఆలూరు టిఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు

దేవనకొండలో ఆలూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో మోడల్ స్కూళ్లు ఉన్నాయి. దేవనకొండలో మోడల్ స్కూల్ లేకపోవడంతో పక్క మండలాలకు వెళ్లాల్సి వస్తోంది.  తమ గ్రామంలో మోడల్ స్కూలు ఏర్పాటుచేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచితవిద్య అందుబాటులో ఉంటుంది. టిడిడి అధికారంలోకి వచ్చాక దేవనకొండలో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

గత ప్రభుత్వంలో మోడల్ స్కూళ్లు, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లతో పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచితవిద్య అందించాం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లు రద్దు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసింది. స్కూళ్ల విలీనంతో 4 లక్షల మంది పేద విద్యార్థులు బడులకు దూరమయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దేవనకొండలో మోడల్ స్కూల్ ఏర్పాటుచేస్తాం.

యువనేత ఎదుట దేవనకొండ స్కూలు విద్యార్థుల మొర

పాదయాత్ర దారిలో దేవనకొండ గవర్నమెంటు స్కూలు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి తమ సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. నాసిరకం మధ్యాహ్నం భోజనంతో తరచూ అనారోగ్యం పాలవుతున్నాం. స్కూలులో మమ్నల్ని కూలీ పనులకు వాడుతున్నారు. బస్ సౌకర్యం లేకపోవడంతో స్కూలుకు సమయానికి చేరుకోలేకపోతున్నాం. డిఎన్ టి హాస్టల్ ను పునరుద్దరించి మాకు ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాలి. మోడల్ స్కూలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*

పసిపిల్లలకు పెట్టే భోజనంలో కూడా కమీషన్లు దండుకునే నీచమైన ప్రభుత్వం అధికారంలోకి ఉండటం దురదృష్టకరం. దేవనకొండ స్కూలు విద్యార్థులు కోరిన విధంగా మోడల్ స్కూలు ఏర్పాటుచేసి, డిఎన్ టి హాస్టల్ ను పునరుద్దరిస్తాం. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, బస్ సౌకర్యం కల్పిస్తాం. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోండి.

Also, read this blog: Building Dreams, Inspiring Change: The Yuvagalam Revolution

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *