Yuvagalam padayatra ,Nara lokesh
Nara lokesh padayatra , yuvagalam

బనగానపల్లెలో హోరెత్తిన యువగళం పాదయాత్ర  అడుగడుగునా యువనేత అపూర్వస్వాగతం

కార్యకర్తలు, అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం

బనగానపల్లి: యువనేత Nara Lokesh చేపట్టిన 104వరోజు పాదయాత్రకు బనగానపల్లి నియోజకవర్గం జనం పోటెత్తారు. బనగానపల్లి నియోజకవర్గం టంగుటూరులో యువనేత చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అడుగడుగున జనం యువనేతకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టగా, యువతీయువకులు కేరింతలు కొడుతూ బాణసంచా మోతలతో హోరెత్తించారు. పాదయాత్రకు బయలుదేరేముందు రాయపాడు క్యాంప్ సైట్ తటస్థ ప్రముఖులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. దారిపొడవునా వివిధ ప్రజలకు తమ సమస్యలను యువనేతకు చెప్పుకున్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని, నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లుల కారణంగా బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.  జగన్ పాలనలో పన్నుల భారాన్ని, అసమర్ధ ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు వివరించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీ అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. పాదయాత్ర దారిలో రైతులు, వడ్డెర్లు, యాదవులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. 104వరోజు యువనేత లోకేష్ 11 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1330.1 కి.మీ. పూర్తయింది. శనివారం బనగానపల్లె పట్టణంలో యువగళం పాదయాత్ర, బహిరంగసభ నిర్వహించనున్నారు.

యువనేత పాదయాత్రలో వ్యక్తమైన సమస్యలు:

బీమా మిత్రలకు తీరని అన్యాయం చేశారు -ఎమ్. స్రవంతి, కొలిమిగుండ్ల గ్రామం

 2007 నుండి మేము భీమా మిత్రగా చేస్తున్నా.  2014కు ముందు వరకు కూడా  ఒక  క్లెయిమ్ కు రూ.150 ఇచ్చారు.  2014లో చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక క్లయిమ్ కి రూ.700 ఇచ్చేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని తొలగించింది.  కర్నూలు జిల్లాలో నాతోపాటు మరో 114 మందిని కూడా తొలగించారు.  సీఎం నివాసం దగ్గరికి వెళ్లి అడిగితే నెత్తిన చేయి పెట్టి మిమ్మల్ని కొనసాగిస్తానని  జగన్ హామీ ఇచ్చారు.  కానీ మాట నిలబెట్టుకోలేదు.  భీమా మిత్రలో ఎక్కువగా వితంతువులు ఉన్నారు.  పొలం పనులకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న వాళ్ల  పరిస్థితి అయితే పూట గడవడం కూడా కష్టంగా ఉంది.  కనీసం మాకు ప్రత్యామ్నాయం కూడా ఈ ప్రభుత్వం చూపించడం లేదు.(లోకేష్ ను టంగుటూరు గ్రామంలో కలిసి సమస్యను చెప్పింది)
 వైసీపీ నేతల వేధింపుల తట్టుకోలేక ఊరు వదిలెళ్లిపోయాం -ఎస్.సుందరయ్య, దళితుడు, ఆలవకొండ

నాది నంద్యాల జిల్లా, సంజామల మండలం, ఆలవకొండ. 2019 ఎన్నికలకు మందు మా గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలువురికి రుణాలు వచ్చాయి. అనర్హత కారణంగా కొందరికి రాలేదు. కానీ దాన్ని మనసులో పెట్టుకుని వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ పెద్దల ప్రోత్సాహంతో నాపై దాడికి పాల్పడ్డారు. నేను కేసు పెట్టినా తీసుకోకుండా, నాపైనే ఎదురు కేసు పెట్టారు. నాకు ఒక యేడాది అమ్మఒడి వచ్చింది..మా ప్రభుత్వంలో వచ్చిన అమ్మఒడి ఎందుకు తీసుకుంటున్నావు ర..అని అసభ్య పదజాలంతో దూషించారు. వారి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక మా గ్రామం నుండి వెళ్లి ప్రస్తుతం బేతంచర్లలో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చాక దళితులకు..దళితులకు మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు.

పెరిగిన ధరలతో ఇబ్బందులు -కె. తిమ్మన్న, కోవెలకుంట్ల.

18 ఏళ్ల క్రితం పత్తికొండ నుండి కోవెలకుంట్ల కు వలస వచ్చా.  జీవనాధారం కోసం ప్రస్తుతం  చిరు వ్యాపారం చేసుకుంటున్నా. ఊరూరు ద్విచక్ర వాహనంపై తిరిగి అప్పడాలు,  రకరకాల స్నాక్స్ అమ్ముతుంటాను.  మా కుటుంబం మొత్తం దీనిపైనే ఆధారపడి జీవిస్తుంది.  నలుగురం కష్టపడుతుంటే నెలకి ప్రస్తుతం రూ.15,000 మిగులుతున్నాయి. పిండిపదార్థాలు, వంటనూనె భారీగా పెరిగాయి. పెట్రోల్ ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో స్నాక్స్ ధరల పెంచడంతో అమ్మకాలు తగ్గాయి.  నెలకు 4,000 ఇంటి వద్ద చెల్లించాలి. కుటుంబ పోషన కష్టంగా మారింది.  నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.  పెద్దబ్బాయి అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు.  ఉద్యోగాలు లేక విత్తనాలకొట్టులో పనిచేస్తున్నాడు.  చిన్నబ్బాయి డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నాడు.  నేను పనులు చేసుకోవాలన్నా. అందుబాటులో లేవు.  సామాన్యులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

వడగళ్లు నాకు కడగండ్లు మిగిల్చాయి! -భువనగిరి. రామకృష్ణుడు, గుళ్లగుర్తి గ్రామం, మిర్చి రైతు.

ఈ కారులో నేను 2 ఎకరాల్లో మిర్చి పంట వేశాను. పంట చేతికొచ్చే సమయంలో వడగాళ్ల వాన వచ్చింది. పంట మొత్తం నేలరాలి దెబ్బ తిని పాడైపోయింది. 2ఎకరాలకు లక్ష పెట్టుబడి పెట్టాను. 20క్వింటాలు పంట రావాల్సింది కేవలం 6 క్వింటాల్లే వచ్చింది. 20 క్వింటాలు వస్తే నాకు రూ.2లక్షలు వచ్చేది. కేవలం రూ.90వేలే వచ్చింది. దీనివల్ల రూ.1.10లక్షలు నష్టం వచ్చింది. అధికారులు వచ్చి పంట బీమా వస్తుందని చెప్పారు. కానీ నేటికీ పట్టించుకున్నవారు లేరు.

ప్రాజెక్టులను కొనసాగించినందుకే  వైఎస్ అంటే గౌరవం! జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు బాధితులే  న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నివర్గాల ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు కల్పిస్తాం

తటస్థ ప్రముఖులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

నంద్యాల: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎందుకు నివాళులు అర్పించారు అని కొంతమంది నన్ను అడిగారు, నేను వైఎస్ గారు తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను. కానీ ఆయన ఏనాడూ రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదు. బాబు గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్ని కొనసాగించారు, అందుకే ఆయనంటే గౌరవమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. నంద్యాల నియోజకవర్గం రాయపాడు క్యాంప్ సైట్ లో తటస్థ ప్రముఖులతో యువనేత ముఖాముఖి సమావేశం నిర్వహించారు . న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ జగన్ బాధితులే. టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టి అవమానించారు. తటస్థులంతా ఒక సారి ఆలోచించాలి. ఒక్క ఫాక్స్ కాన్ సంస్థను ఏపికి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఆ కంపెనీ ని తెలంగాణ కు తరిమేశాడు జగన్. దీని వలన లక్ష మంది ఏపి యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. 2014 లో ఉమ్మడి కర్నూలు జిల్లా లో ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించినా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం. 2019 కర్నూలు ని క్లీన్ స్వీప్ చేసిన వైసిపి కర్నూలు కు ఎం చేసిందో మీరు ఆలోచించండి.

మమ్మల్ని గెలిపించండి… కర్నూలును నెం.1చేస్తాం!

2024 లో టిడిపి కి 14 సీట్లు ఇవ్వండి కర్నూలు ని నంబర్ 1 చేసి చూపిస్తాం. కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హాస్టల్ ఛార్జీలు పెంచడం దారుణం. వైద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు, దూది లేని పరిస్థితి జగన్ పాలన లో వచ్చింది. కనీస మౌలిక వసతులు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అవసరమైన డాక్టర్లు, మందులు ఏర్పాటు చేస్తాం. కోర్టుల్లో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. టిడిపి హయాంలో కొత్త భవనాల నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. వాటిని వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ వ్యవస్థ కు అధిక నిధులు కేటాయించి మౌలిక వసతులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. న్యాయవాదులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.

మెగా డిఎస్సీ హామీ ఏమైంది జగన్?

ఎన్నికల ముందు మెగా డిఎస్సీ అన్న జగన్ ఆ హామీ మర్చిపోయాడు. లక్షలు ఖర్చు చేసి ట్రైనింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది యువకులు ఉన్నారు. టిడిపి హయాంలో డిఎస్సీ క్రమం తప్పకుండా నిర్వహించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. రాయలసీమ ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలని టిడిపి ప్రణాళిక సిద్దం చేసింది. ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్. కంపెనీలు పెద్ద ఎత్తున ఏపికి తెచ్చింది చంద్రబాబు గారు. మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రోత్సహిస్తేనే ఇంజనీరింగ్ లో ఉన్న ఇతర ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు వస్తాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ కాలర్ జాబ్స్… మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

జర్నలిస్టులను కూడా వేధిస్తున్న జగన్ ప్రభుత్వం

జర్నలిస్టులను కూడా ప్రభుత్వం అనేక విధాలుగా వేధిస్తుంది. 2430 జిఓ తెచ్చి జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారు జగన్. జర్నలిస్టుల పై వేదింపులు, అరెస్టులు చేస్తున్నారు. జగన్ తెచ్చిన 2430 జిఓ రద్దు చేస్తాం. ఇళ్ళ గురించి అడిగితే సజ్జల జర్నలిస్టుల పై దాడి చేశారు. ఆఖరికి అక్రిడేషన్ కార్డులు కూడా రద్దు చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రిడేషన్, టిడ్కో ఇళ్లు ఇస్తాం.  యూట్యూబ్ ఛానెల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. వాటికి కొన్ని నిబంధనలు, షరతులు పెట్టి వారికి కూడా అక్రిడేషన్ సౌకర్యం కల్పిస్తాం. ఐటి మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఈ మెయిల్ పెడితే అప్పటికప్పుడే నేను పరిష్కరించి న్యాయం చేశాను. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. మీ సేవ నడుపుతున్న వారికి వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సేవ ని పటిష్ట పరుస్తాం. ప్రభుత్వ సేవలు అన్ని మీసేవ ద్వారా అందిస్తాం.

పేదరికం లేని సమాజం టిడిపి లక్ష్యం

పేదరికం లేని రాష్ట్రం టిడిపి విధానం. పేదలు ఎప్పటికీ పెద్దలుగా ఉండాలి అనేది జగన్ విధానం. జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం. ప్రైవేట్ టీచర్ల ను కూడా ఆదుకుంటాం. కోవిడ్ సమయంలో వైసిపి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకోలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా అందిస్తాం. టిడిపి హయాంలో 5300 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కోసం ఖర్చు చేసాం. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కి నిధులు ఇవ్వకపోవడం వలన ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తామని అంటున్నారు. రోగులు ఇబ్బంది పడుతున్నారు. జే బ్రాండ్లు అమ్ముకోవడానికి బెల్లం వ్యాపారస్తులను వేధిస్తున్నారు. ఆర్యవైశ్యులు కూడా జగన్ బాధితులే. చిరు వ్యాపారులకు జగన్ వీర బాదుడు. బోర్డు పన్ను, చెత్త పన్ను, పెరిగిన విద్యుత్ ధరలతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గించి ఆర్యవైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఏర్పాటు చేస్తాం. పోలీసులు కూడా జగన్ బాధితులే. జిపిఎఫ్ డబ్బులు కూడా కొట్టేశాడు. సరెండర్లు, మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా కొత్త ఆర్డర్స్ ఇచ్చి 18 రకాల వ్యక్తిగత  వివరాలు సేకరించి ప్రభుత్వం వేధిస్తోంది. టిడిపి అధికారులు వచ్చాక అన్నివర్గాల ప్రజలు స్వేచ్చగా జీవనం సాగించే పరిస్థితులు కల్పిస్తాం.

తటస్థుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

తటస్థుల సమావేశంలో మెడికో కార్తీక్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టల్స్ లో వైద్య విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. 6 వేల ఉన్న హాస్టల్ ఛార్జీలు ఇప్పుడు 24 వేలకు పెంచేశారు. కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. రోగులకు కూడా సరైన వైద్యం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయవాదులు మాట్లాడుతూ…కోర్టుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. నిరుద్యోగి సురేష్ మాట్లాడుతూ… టీచర్ పోస్టులు, డిఎస్సీ నోటిఫికేషన్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సురేష్ మాట్లాడుతూ… ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వారు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే మాకు భరోసా కల్పించాలని కోరారు. జర్నలిస్టులు మాట్లాడుతూ… ప్రభుత్వం జర్నలిస్టులను వేధిస్తోంది, కొత్త జీఓ లు తెచ్చి జర్నలిస్టుల పై కేసులు పెడుతున్నారు. అక్రిడేషన్ లు కూడా ఇవ్వడం లేదన్నారు. కళ్యాణ్ మాట్లాడుతూ… మీ సేవ కేంద్రాలకు పని లేక ఇబ్బంది పడుతున్నాం. 11 వేల కుటుంబాలు ఈ వ్యవస్థ పై ఆధారపడ్డారని చెప్పారు. ముంతాజ్ మాట్లాడుతూ… ప్రైవేట్ టీచర్ల కు కూడా ప్రభుత్వం సహకారం అవసరమని అన్నారు. ఆర్యవైశ్యులు మాట్లాడుతూ… వ్యాపారాలు చేసుకోవడానికి వైసిపి పాలనలో ఇబ్బందులు పడుతున్నాం. దాడులు చేస్తున్నారు. బెల్లం వ్యాపారస్తులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

యువనేత లోకేష్ ను కలిసిన టంగుటూరు రైతులు

బనగానిపల్లి నియోజకవర్గం టంగుటూరు గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసిన తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో శనగపంట అధికంగా పండిస్తాం. కానీ గిట్టుబాటు ధర రావడం లేదు. గ్రామంలో సచివాలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించలేదు. హౌసింగ్ స్కీమ్ కింద ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. TDP పాలనలో మంజూరైన పెన్షన్లను వైసీపీ నాయకులు రద్దు చేశారు. రోడ్డు సమస్యపై అధికారులకు ఎన్ని అర్జీలు పెట్టినా ఫలితం లేదు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రైతాంగాన్ని నట్టేట ముంచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని చెప్పిన జగన్ నాలుగేళ్లుగా ముఖం చాటేశారు. 30లక్షల ఇళ్లు కడతానని చెప్పిన జగన్… నాలుగేళ్లలో 5ఇళ్లు మాత్రమే కట్టారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుంటిసాకులతో 6లక్షల పెన్షన్లు తొలగించి తీరని అన్యాయం చేశారు. గత నాలుగేళ్లుగా గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది. రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలకు గత వైభవం తెస్తాం. పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే బాధ్యత రాబోయే టిడిపి ప్రభుత్వం తీసుకుంటుంది.

*యువనేతను కలిసిన వడ్డెర సామాజికవర్గీయులు

బనగానిపల్లి నియోజకవర్గం అప్పలాపురంలో వడ్డెర సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఏపీలో దాదాపు 40లక్షల మంది వడ్డెర కులస్తులు ఉన్నారు. గనులు, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా, ట్యాంకులు, బావులు, ఆనకట్టలు, రైల్వే వంతెనలు, వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. 1970వరకు వడ్డెరలు ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాత బీసీ-ఏ జాబితాలో చేర్చారు. అనంతరామన్ కమిషన్ వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని నివేదిక ఇస్తే దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి. వడ్డెర విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. వడ్డెరలకు ప్రమాద బీమా కూడా లేదు. బీమా సౌకర్యం కల్పించాలి. 45ఏళ్లు దాటిన వడ్డెరలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వడ్డెర్లతోపాటు బిసిలకు తీరని ద్రోహం చేశారు. బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది. గత ప్రభుత్వంలో అమలుచేసిన 100 సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చాక దారి మళ్లించారు. గత టిడిపి ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద రూ.964 కోట్ల విలువైన పనిముట్లను 90శాతం సబ్సిడీపై బిసిలకు అందించాం. 2018లో మొట్టమొదటిగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.147 కోట్ల రూపాయలు కేటాయించాం. వైసిపి ఎటువంటి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ ఆధారంగా వడ్డెర్లకు న్యాయం చేస్తాం. వడ్డెర్లకు చంద్రన్న బీమా పథకాన్ని అమలుచేస్తాం.

యువనేతను కలిసిన యాదవ సామాజికవర్గీయులు

బనగానపల్లి నియోజకవర్గం కైప గ్రామంలో అఖిల భారత యాదవ మహాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. యాదవులకు జనాభా దామాషా ప్రకారం జిల్లాకు ఒక ఎమ్మెల్యే సీటు, రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎంపీ సీట్లు  ఇవ్వాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాదవులకు ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్ వంటి పదవులకు అవకాశం కల్పించాలి. ప్రతి నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలి. యాదవ కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించి ఆర్థిక తోడ్పాటునందించాలి. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రతి యాదవ కుటుంబానికి రూ.5లక్షల సబ్సిడీ లోన్ ఇవ్వాలి. టీటీడీ బోర్డు సభ్యుల్లో యాదవులకు ఒకరిని స్థానం కల్పించాలి. గొర్రెలు, పశువులకు బీమా వర్తింపజేయాలి. గొర్రెల కాపరులకు రూ.10లక్షలు బీమా ఏర్పాటు చేయాలి. నామినేటెడ్ పదవుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలి. యాదవులకు 50శాతం సబ్సిడీపై వాహనాలు మంజూరు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ 10శాతం తగ్గించడం ద్వారా బిసిలకు 16,800 పదవులు దక్కకుండా చేసిన జగన్ రెడ్డి. జగన్ అధికారంలో వచ్చాక బీసీ కార్పొరేషన్లకు విధులు, నిధులు లేకుండా నిర్వీర్యం చేశాడు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్రాన్ని తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. యాదవులు ఆవులు, గొర్రెలు, ఆవులమేపుకునేందుకు ఖాళీగా ఉన్న బంజర్లు కేటాయిస్తాం. గొర్రెలు, ఆవులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం. దామాషా పద్ధతిన యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి బలోపేతం చేస్తాం.

Also, read this blog: Yuvagalam Padayatra: Igniting the Spirit of Youth for a Brighter Future

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *