Nara Lokesh

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో జననీరాజనం వలస కూలీల కష్టాలు చూసి చలించిన యువనేత

మంత్రాలయం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 81వరోజు పాదయాత్ర కోసిగి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు యువనేతకు నీరాజనాలు పలికారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. పాదయాత్ర దారిలో కోసిగికి చెందిన వలస కూలీలను చూసి యువనేత లోకేష్ చలించిపోయారు.  కోసిగికి చెందిన 20మంది వలసకూలీలు గుంటూరువెళ్లి మిర్చి కోత పనులు చేసుకొని ఒక వాహనంలో తిరిగివస్తుండగా, యువనేత లోకేష్ వారిని పలకరించారు.  స్థానికంగా పనుల్లేక 3నెలలు పనులకోసం గుంటూరు వెళ్లి వస్తున్నామని వారు చెప్పడంతో లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.  వ్యవసాయ వ్యవసాయ కూలీలకు పనులు కల్పించలేని చెత్త ప్రభుత్వం రాజ్యమేలుతోందని యువనేత మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వలసలు వెళ్లే అవసరం లేకుండా పంటలకు సాగునీరందించి స్థానికంగానే పనులు లభించేలా చేస్తామని భరోసా ఇచ్చారు. మార్గమధ్యంలో పాలాల్లోకి దిగి పలువురు రైతులను పలకరించిన యువనేత వ్యవసాయంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తోందని తెలిపారు. రాబోయే టిడిపి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గురురాఘవేంద్ర బసలదొడ్డి ఎత్తిపోతల పథకాన్ని యువనేత పరిశీలించారు. కరెంటు బిల్లులు, నిర్వహణ నిధులు విడుదల చేయకుండా ఈ పథకాన్ని మూలనబెట్టడంపై యువనేత మండిపడ్డారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం లచ్చుమర్రి శివార్లనుంచి ప్రారంభమైన పాదయాత్ర మాధవరం శివార్లలోని విడిది కేంద్రానికి చేరుకుంది.

కరెంటుబిల్లు కట్టలేని వాళ్ళు ప్రాజెక్టులు కడతార?!

గురురాఘవేంద్ర బసలదొడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత, చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి కర్నూలు జిల్లాలో పాడుబడ్డ ఎత్తిపోతల పథకాలు. తుంగభద్ర ఎల్ఎల్ సి ద్వారా సాగునీరు సరిగా అందని 51వేల ఎకరాల ఆయకట్టు రైతులకోసం గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 9 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించాం. ఈ పథకాలకు సంబంధించి విద్యుత్, నిర్వహణ బిల్లులు రూ.134 కోట్లను చెల్లించకలేక పాడుబెట్టింది వైసిపి ప్రభుత్వం. ఫలితంగా ప్రాజెక్టు పరిధిలోని వేలాది రైతులు సాగునీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. కరెంటు బిల్లులు కట్టలేని జగన్ ప్రాజెక్టులు కడతానంటే ఎలా నమ్మాలని లోకేష్ దుయ్యబట్టారు.

నదుల అనుసంధానంతో రాయలసీమకు నీరిస్తాం! వలసకూలీల బాధలు విని కన్నీళ్లొచ్చాయి! పంటలు నష్టపోతే అంచనాలు వేసే దిక్కులేదు కౌలు రైతులకోసం ప్రత్యేక చట్టం తెస్తాం ఆదోనిలో మిర్చి యార్డు ఏర్పాటుచేస్తాం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తాం రైతులతో ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్

మంత్రాలయం: పాదయాత్ర ద్వారా రైతులు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నాను. వ్యవసాయ పనులు లేక గుంటూరు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడిన తరువాత వారి బాధలు తెలుసుకొని కన్నీళ్లు వచ్చాయని యువనేత నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం నియోజకవర్గం లచ్చుమర్రి క్రాస్ వద్ద రైతులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నీళ్ళు ఇస్తే రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం టిడిపి హయాంలో 11 వేల కోట్లు ఖర్చు చేసాం. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో టిడిపి ప్రభుత్వం ఖర్చు చేసిన దానిలో పది శాతం కూడా ఖర్చు చెయ్యలేదు. డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసి రాయలసీమ రైతాంగాన్ని దెబ్బతీశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు. రైతుల రాజ్యం తెస్తానని, రైతులు లేని రాజ్యం తెచ్చాడు జగన్. ఏపి రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 3 స్థానంలోనే ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2 వ స్థానంలో ఉంది. ఉచిత విద్యుత్ అనేది రైతుల హక్కు. ఆ హక్కుని హరిస్తూ జగన్ రైతుల మోటర్లకి మీటర్లు బిగిస్తున్నాడు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా పోరాడుతుంది.

టిడిపి హయాంలో సబ్సిడీపై ఎరువులు, పురుగుమందులు

టిడిపి హయాంలో సబ్సిడీ ధరకే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేసాం. రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్ అందజేసాం. రైతులు నష్టపోతే నష్ట పరహారాన్ని అందించింది టిడిపి ప్రభుత్వం. జగన్ నష్ట పరిహారం ఇవ్వడం లేదు. క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని రద్దు చేశారు. రూ.50 వేల లోపు రుణాలు అన్ని ఒకే సంతకంతో రద్దు చేసిన ఘనత టిడిపిది. TDP హయాంలో రైతుల్ని ఆదుకోవడానికి ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు జగన్. కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఆయన కోర్టు లో దొంగతనం చేసే పనిలో బిజీగా ఉన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఒక్కో రైతుపై రూ.70 వేలు అప్పు ఉంటే జగన్ పాలన లో ఒక్కో రైతు పై అప్పు రూ.2.50 లక్షలకు చేరింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఉల్లి రైతులను ఆదుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. గిట్టుబాటు ధర ఇస్తాం.

నకిలీ విత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు

నకిలీ విత్తనాలతో పత్తి రైతులు నష్టపోతే ప్రభుత్వం ప్రకృతి కారణంగా నష్టం వచ్చిందని కొట్టిపారేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యమైన విత్తనాలు అందజేస్తాం. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల పై చర్యలు తీసుకుంటాం. మిర్చి రైతులు అమ్ముకోవడానికి గుంటూరు వెళ్తున్నారు. అందుకే ఆదోని లో మిర్చి యార్డు ఏర్పాటు చేస్తాం. మిరప రైతులను ఆదుకుంటాం. టొమాటో రైతులను ఆదుకోవడానికి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్, టొమాటో వాల్యూ చైన్ ప్రాజెక్టు అమలు చేస్తాం. రైతులకు ఉచిత విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వలేని చెత్త ప్రభుత్వం వైసీపీ ది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పగలే ఉచిత విద్యుత్ అందజేస్తాం. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబం ఎప్పుడైనా ముఖ్యమంత్రి ని కలిసి రైతుల ను ఆదుకోవాలి అని కోరారా?

కౌలు రైతులకోసం ప్రత్యేక చట్టం

 భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకోవడం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.  టిడిపి హయాంలో పాడి రైతుల్ని ఆదుకున్నాం. సబ్సిడీ ధరకే మేత, దాణా అందించాం. పశువులు కొనడానికి సబ్సిడీ లో రుణాలు అందించాం. జగన్ పాలనలో పాడి రైతుల్ని కనీసం పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అందజేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాడి రైతులకు అందజేస్తాం. టిడిపి హయాంలో క్యూ లైన్లు లేకుండా విత్తనాలు, ఎరువులు అందించాం. ఇప్పుడు ఆర్బికే అంటూ హడావిడిగా కేంద్రాలు ప్రారంభించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప కనీసం అక్కడ విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దుస్థితి. ఆర్డీఎస్ రైట్ కెనాల్, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, పులి కనుమ తో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేసి రాయలసీమ రైతులకి సాగునీరు అందిస్తాం.

ముఖాముఖి సమావేశంలో రైతులు మాట్లాడుతూ….

ఉల్లి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. గిట్టుబాటు ధర ఉండటం లేదు. మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. ఎకరాకు లక్ష రూపాయిలు పెట్టుబడి అవుతుంది. కనీసం అమ్ముకోవడానికి యార్డ్ లేక ఇబ్బంది పడుతున్నాం. అనేక జబ్బులు వస్తున్నాయి. తద్వారా దిగుబడి తగ్గిపోతుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రేట్లు జగన్ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయాయి. కనీసం 9 గంటల ఉచిత విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సాగునీరు ఇవ్వకుండా ప్రాజెక్టుల్లో చేపల పెంపకం చేపట్టి కోట్లు గడిస్తున్నాడు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మమ్మలని ఆదుకోండి. జగన్ పాలనలో పాడి రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందడం లేదు.

ముఖాముఖి సమావేశంలో రైతుల అభిప్రాయాలు:

శ్రీను, కోసిగి : మా ప్రాంతంలో ఎక్కువగా ఉల్లిపంట పండిస్తాం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉల్లి రైతులకు సబ్సీడీలు ఇవ్వండి.

చంద్ర, మాలపల్లి : నేను గతంలో 10 ఎకరాలు మిర్చి నాటాను. తెగుళ్లతో నష్టపోయి..ఈ యేడాది 4 ఎకరాలే నాటాను. నల్లిదోమ, పచ్చదోమతో రైతులు నష్టపోతున్నారు. మందుల రేట్లు భారీగా పెరిగాయి. మిర్చి అమ్ముకోవాలంటే 400కి.మీ వెళ్లాల్సి వస్తోంది.

భీమన్న, మాలపల్లి : 6 ఎకరాల పత్తినాటాము. 3 క్వింటాలే వచ్చింది. మాకు పరిహారం అందించాలి.

రామయ్య, చింతకుంట : 2 ఎకరాలు పత్తి, ఎకరాలో మర్చి నాటాను. విద్యుత్ సరిగా రావడం లేదు. రాత్రిపూట విద్యుత్ ఇస్తున్నారు. ట్రాన్స్ ఫార్మ్ కావాలంటే ఆఫీసుల చుట్టూ యేడాదంతా తిరగాల్సి వస్తోంది. చెడిపోయిన మోటార్లు బాగుచేయాలన్నా రూ.10 వేలవుతోంది. ఎకరాకు మందుకొట్టాలంటే బుడ్డి రూ.3 వేలవుతోంది. బ్యాంకుల్లో బంగారం పెట్టి రుణం తెచ్చకున్నాం. నా భార్య ఒత్తిడి తట్టుకోలేక రెండెకరాలు బేరం పెట్టాను. బాధలు తట్టుకోలేక చనిపోవాలనిపిస్తోంది.

వెంకటరెడ్డి : నేను కౌలు రైతును 8 ఎకాల్లో పత్తినాటి 4.50 లక్షలు పెట్టుబడి పెట్టా.. రూ.1.30లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ యేడాది నేను అప్పులపాలయ్యా.

మల్లిఖార్జున, పెద్దకడుబూరు : మాకు గతంలో 10 పశువులు ఉండేవి. దానికి తోడు టీడీపీ హయాంలో 5 పశువులు సబ్సీడీలో ఇచ్చారు. గతంలో మందులు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు మేత కూడా సబ్సీడీలో ఇవ్వడం లేదు. ట్రక్కు గడ్డి రూ.10వేలు అమ్ముతున్నారు.

పద్మనాభం : ఎరువుల కొరతతో బాగా ఇబ్బంది పడుతున్నాం. సకాలంలో రైతులకు ఎరువుల అందించే చర్యలు తీసుకోండి.

బొప్పాయి రైతులను కలిసిన యువనేత లోకేష్

మంత్రాలయం నియోజకవర్గం కోసిగి శివార్లలో మోహన్, శ్రీరామ్ అనే బొప్పాయి రైతులను  కలిసిన యువనేత లోకేష్ …వారి కష్టాలను తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ…చెరో నాలుగు ఎకరాలు పొట్టి బొప్పాయి వేస్తే, ఒక్కొక్కరికి 8లక్షలు నష్టం వచ్చింది. ఇటీవల ఈదురుగాలులు, అకాలవర్షాలకు చెట్లు దెబ్బతిన్నాయి, కాయలు నేల రాలాయి. అధికారులు వచ్చి పంటను పరిశీలించాలని కోరితే…పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తెండి రాస్తామన్నారు.  పంట పరిశీలించకుండా నష్టం ఎలా అంచనా వేస్తారని అడిగితే ఇష్టమైతే మేం అడిగిన వివరాలు తెండి, లేకపోతే మానుకోండని ఆర్ బికెలో సమాధానమిచ్చారు. రెండనెలలైనా ఇంతవరకు ఎవరు పంటను పరిశీలించడానికి రాలేదు.  నీళ్లులేకపోతే పులికనుమ నుంచి 10లక్షలు ఖర్చుపెట్టి 4కి.మీ పైపులు వేసి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. గతంలో ఇరుగుపొరుగు వారు బొప్పాయి వేస్తే లాభాలు వచ్చాయని చెబితే మేం ఈ పంట ఎంచుకున్నాం. ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే వ్యవసాయం చేయలేం.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ….

క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో వైసీపీ రైతులను నట్టేట ముంచాడు. సొంతంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో డ్రిప్, ఇన్ పుట్ సబ్సిడీ, పంటనష్టపోతే సకాలంలో క్రాప్ ఇన్సూరెన్స్ అందజేశాం. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ప్రతిరైతుపైన సగటు రూ.2.5లక్షల అప్పుతో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అండగా నిలుస్తాం, నష్టపోయిన రైతాంగానికి ఆదకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన డి.బెళగల్ గ్రామస్తులు

మంత్రాలయం నియోజకవర్గం డి.బెళగల్ గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మా గ్రామానికి 4కిలోమీటర్ల దూరంలో పులికనుమ,  గురురాఘవేంద్ర ప్రాజెక్టు, బసలదొడ్డి ఎత్తిపోతల ఉన్నాయి. మా గ్రామానికి 8కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఉంది. కానీ మా గ్రామానికి తాగు,సాగు నీరు అందడం లేదు. తుంగభద్ర నుంచి ఎత్తిపోతల ద్వారా మాకు నీరు అందించాలి. డి.బెళగల్ మండలానికి డిగ్రీ కాలేజి ఏర్పాటు చేయాలి. మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి. ఉచిత విద్య, వైద్యం, పంటలకు గిట్టుబాటు ధరలు, మంచి విత్తనాలు అందించాలి. వైసీపీ ప్రభుత్వం మా గ్రామ నిధులు రూ.35లక్షలు లాక్కుంది. వాటిని తిరిగి ఇప్పించాలి. నరేగా పథకం పనులకు సంబంచిన కూలీ సొమ్ము గతంలో సకాలంలో వచ్చేవి. నేడు 3నెలలైనా రావడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించండి.

యువనేత నారా లోకేష్ స్పందిస్తూ….

వైసిపి ప్రజాప్రతినిధులకు దోచుకోవడం,దాచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదు. సమీపంలో నీటి వనరులున్నా తాగునీరు అందని దుస్థితి కల్పించడం బాధాకరం. గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టులను చేపల పెంపకం కోసం నీళ్లివ్వకుండా రైతుల నోళ్లుగొట్టడం దారుణం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో తాగునీటి పథకాన్ని ఏర్పాటుచేసి 24/7 తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. గతంలో మాదిరి సబ్సిడీలు, విత్తనాలు అందించి రైతులను ఆదుకుంటాం. నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులు, కూలీలకు సౌలభ్యంగా ఉండేలా చేస్తాం.

మిర్చిరైతును కలిసిన యువనేత లోకేష్

మంత్రాలయం నియోజకవర్గం డి.బెళగళ్ వద్ద మిర్చిరైతు కర్రియ్యను యువనేత లోకేష్ కలిసి, ఆయన కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్రియ్య మాట్లాడుతూ… అన్నదమ్ములం కలిసి 5ఎకరాల మిర్చిపంట వేశాం. రూ.10 లక్షల పెట్టుబడి అయితే 2లక్షల దిగుబడి వచ్చింది, నల్లితెగులు వచ్చి పంట నాశనమైంది. కోత కూలీ, పరదాలు, తాలుకాయల ఏరివేతకే రూ.2లక్షల ఖర్చయింది. పండించిన పంటను బళ్లారి తీసుకెళ్లి అమ్ముకోవాల్సి రావడంతో అదనపు భారం పడుతోంది. గతంలో 28రకం ఎరువుల బస్తా రూ.1100 ఉంటే, ఇప్పుడు రూ.1900 అయింది. గతంలో ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయితే, ఇప్పుడు రెట్టింపు అయింది. పులిమీద పుట్రలా ఇప్పుడు కరెంటోళ్లు వచ్చి మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారు. నిన్న రాత్రికూడా వర్షంపడి నానా అవస్థలు పడ్డాం, పట్టించుకునే నాథుడే లేడు. పరిస్థితులు ఇలాగే ఉంటే కొంతకాలానికి రైతు అనే వాడే ఉండడు.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…

వ్యవసాయాన్ని పండుగ చేస్తానన్న ముఖ్యమంత్రి అన్నదాతలను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నారు. అకాలవర్షాల కారణంగా పంట నష్టపోతే ఈ ప్రభుత్వం దున్నపోతుపై వాన కురిసినట్లుగా ఉందే తప్ప పట్టించుకోవడం లేదు. గతంలో మిర్చి రైతులకు పరదాపట్టలు, సబ్సిడీపై పురుగుమందులు అందజేశాం. ఎవరెంత వత్తిడి తెచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దు. టిడిపి ప్రభుత్వం వచ్చాక గతంలో ఇచ్చిన సబ్సిడీలన్నీ పునరుద్దరించి రైతులను ఆదుకుంటాం. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం లాభసాటి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. రైతులు అధైర్య పడకుండా ఒక్క ఏడాది ఓపిక పట్టండి.

పొలంలో దిగి రైతన్న కష్టాలు తెలుసుకున్న యువనేత లోకేష్

మంత్రాలయం నియోజకవర్గం లచ్చుమర్రి సమీపంలో పొలంలోకి దిగిన యువనేత లోకేష్ అక్కడ టమోటా, మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా డి.బెళగల్ కు చెందిన రైతు తలారి హుస్సేన్ మాట్లాడుతూ…ఎకరా టమోటా, ఎకరా మిర్చి నాటాను. కల్తీ విత్తనాల వల్ల టమోటా, మిర్చి రెండూ దెబ్బతిన్నాయి. మిర్చి మొక్కల్లో బుడ్డలు దిగి కాయ సైజు పెరగలేదు. దానికి తోడు తెగులు కూడా సోకింది. మొక్కలు తిప్పుకుంటాయోమోనని రూ.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టా, అయినా ప్రయోజనం లేదు. టమోటా కూడా రూ.40 వేలకు పైగా పెట్టుబడి పెట్టా. కాపు సరిగా రాలేదు. కాయసైజు చిన్నగా ఉండటంతో బాక్సు రూ.60, రూ.70కి మాత్రమే కొంటున్నారు.  రేటు లేకపోవడంతో టమోటా పంటను వదిలేశాం. రెండు పంటల మీద సుమారు రూ.3 లక్షల దాకా నష్టం వచ్చింది. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదు.

నారా లోకేష్ మాట్లాడుతూ…

నాణ్యమైన విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్యస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. రైతులు పంట నష్టపోతే పొలాల వద్దకు వచ్చి ఎన్యుమరేషన్ చేసే నాథుడే లేడు. రైతులకు నష్టపరిహారం లేదు, పంటలబీమాను గాలికొదిలేశారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఆదోనిలో మిర్చి రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం.

యువనేతను కలిసిన లచ్చుమర్రి గ్రామస్తులు

మంత్రాలయం నియోజకవర్గం లచ్చుమర్రి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివంచారు. టీడీపీ పాలనలో మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పుష్కలంగా నీరందేది. నేడు మోటార్లు పనిచేయక, నీరందక, వ్యవసాయం నష్టదాయకంగా మారింది. ఇళ్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో కేటగిరి మారి అధికంగా వస్తోంది. వంక పక్కన మాకు ఇళ్లు ఇవ్వడంతో వరదల సమయంలో ముంపుకు గురవుతున్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలో సిసి రోడ్లు, వీధి లైట్లు వేయలేదు. తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నాం. తుంగభద్ర నది పక్కనే ఉన్నా మాకు ఇసుక దొరకడం కష్టంగా మారింది. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించండి.

నారా లోకేష్ స్పందిస్తూ….

రైతులను ఆదుకునేందుకు టిడిపి హయాంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడుబెట్టింది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు, 30లక్షల తాగునీటి కుళాయిలు ఇచ్చాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తాం.

Also, read this blog: Yuvagalam is the Power of Youth Activism for Creating Change in Our Communities

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *