కోసిగిలో కేక పుట్టించిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు అపూర్వ స్వాగతం మంత్రాలయం నియోజకవర్గంలో జనహోరు
మంత్రాలయం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 80వరోజు మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలో ప్రవేశించింది. గవిగట్టు క్రాస్ వద్ద మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన Nara Lokesh కు ఇన్చార్జి తిక్కారెడ్డి, టిడిపి కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో యువగళం పాదయాత్ర కేక పుట్టించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు. యువనేతను లోకేష్ ని చూసేందుకు భారీగా మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. మెయిన్ రోడ్డు పక్కన ఉన్న భవనాల పైకి ఎక్కిన జనం యువనేతకు అభివాదం చేశారు. దారిపొడవునా అందరినీ ఆప్యాయంగా పలకరించిన యువనేత వారితో ఫోటోలు దిగారు. తనని కలవడానికి వచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వచ్చే ఆదాయంతో బ్రతకడం కష్టం గా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కోసిగి యల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపులదొడ్డి, పీకలబెట్ట, కోసిగిలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలపై యువనేతకు వినతిపత్రాలు సమర్పించారు. కోసిగి యల్లమ్మ దేవాలయం సమీపంలో జరిగిన బహిరంగసభకు భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు. అనంతరం కోసిగి శివారు విడిది కేంద్రానికి చేరుకున్నారు.
ఇటువంటి మంచిపని ఒక్కటైనా చేశావా జగన్?!
పాదయాత్ర దారిలో పులికనుమ కెనాల్ ను చూసిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరువుసీమలో సాగు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి N Chnadrababu Naidu పడిన కష్టం అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. మంత్రాలయం నియోజకవర్గం గవిగట్టు శివార్లలో పులికనుమ బ్రాంచి కెనాల్ ఎడారిలో ఒయాసిస్సులా నీళ్లతో కళకళలాడుతూ కన్పించింది. తుంగభద్ర ఎల్ఎల్ సి కెనాల్ కు నీరు నిలిపివేసినపుడు ప్రత్యామ్నాయ సాగునీటి వనరుగా కోసిగి మండలం పులికనుమ వద్ద రూ. 261కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని గత టిడిపి ప్రభుత్వ హయాంలో పూర్తిచేశారు. దీనిద్వారా 64 గ్రామాలకు తాగునీరు, 26వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కళ్లలో ఆనందం చూసేలా ఒక్క పనైనా చేశార జగన్మోహన్ రెడ్డీ అంటూ చురకలంటించారు.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
ఇచ్చేది అరకొర జీతాలు, అవికూడా సరిగా రావడం లేదు-తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ డ్రైవర్లు
తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ నడిపే డ్రైవర్లకు నెలకు పీఎఫ్ పోను రూ.7వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇంటి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. గత ప్రభుత్వంలో రూ.6,500 వచ్చేవి.. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.500 మాత్రమే పెంచారు. జీతాలు కూడా నెలకు రావు.. మూడు, నాలుగు నెలలకు ఒకసారి వస్తాయి. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలంటే భయపడి ఎవరూ ముందుకురావడం లేదు.
కౌలురైతునని భరోసా ఇవ్వలేదు: గురిమినేని వెంకయ్య, కోసిగి రైతు
నాకు సొంతంగా నాలుగు ఎకరాల పొలం ఉన్నా అది బీడుభూమి. 1.25 లక్షలు పెట్టి 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వేరుశెనగ నాటితే రూ.1 లక్ష వచ్చాయి. కనీసం కూలీ ఖర్చులకు కూడా రాలేదు. అందుకే ప్రస్తుతం ఆముదాలు నాటాను. కౌలు రైతునని నాకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. 2 కిమీ నుండి పైపులైన్లు వేసి నీళ్లు నడిపిస్తున్నాం. ఖర్చు ఎక్కువ రాబడి తక్కువైంది.(గవిగట్టు దాటిన తర్వాత మార్గమధ్యంలో సర్ నేరుగా వెళ్లి మాట్లాడారు, రైతు సొంతగ్రామం కోసిగి)
మహిళల తాళిబొట్లు తెంచుతున్న వైసీపీ!
మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నారు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. రైతు రాజ్యం తెస్తానన్న వైసీపీ రైతులు లేని రాజ్యం తెస్తున్నారు. వైసీపీ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. వైసీపీ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నారు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. వైసీపీ, ఉద్యోగస్తులను కూడా వేధించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
బిసిల బ్యాక్ బోన్ విరిచిన వైసీపీ!
బీసీలకు బ్యాక్ బోన్ విరిచారు వైసీపీ. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టారు. అందుకే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా?
రాయలసీమకు పట్టిన జగన్
జగన్ నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ ఆయన రాయలసీమ కు యేం చేసాడు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.
తలనీలాలు, కొబ్బరికాయలనూ వదల్లేదు!
చిన్న తుంబళం గ్రామం రాయలచెరువులో తరతరాలుగా చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను తరిమేసి చెరువు ఆక్రమించుకున్నారు. ఆఖరికి దేవుడ్ని కూడా వదలలేదు. ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో టెంకాయలు, తలనీలాలు కూడా టెండర్ లేకుండా కొట్టేసారు ఈ వైసిపి అనుచరులు. రాగిమానుదొడ్డి, కంబధహాల్ గ్రామంలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. టిప్పర్ ఎర్రమట్టిని రూ.6 వేలకి అమ్మేస్తున్నారు. తుంగభద్ర కేంద్రం గా అక్రమ బియ్యం మాఫియా నడుపుతున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక తరలిస్తున్నారు. బళ్లు ఖాళీగా తేవడం ఎందుకు అని కర్ణాటక మద్యం తెప్పిస్తున్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి పల్లెపల్లెకు ఎమ్మెల్యే దగ్గరి బంధువు మద్యం మాఫీయా నడుపుతున్నాడు. పెదకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో ఓంకారప్ప భూమిని వైసిపి అనుచరుడు మోహన్ రెడ్డి తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు.
పులికనుమ ప్రాజెక్టును చేపలచెరువుగా మార్చేశారు!
రైతులకు సాగు నీరు అందిచడం కోసం ఏర్పాటు చేసిన పులికనుమ రిజర్వాయర్ను, గురురాఘవేంద్ర ప్రాజెక్టును వైసిపి చేపల చెరువుగా మార్చేసారు. బీనామీలతో చేపల వ్యాపారం చేయిస్తూ కోట్లు గడిస్తున్నారు. అడ్డుకున్న రైతుల్ని పోలీస్ స్టేషన్ కి పిలిచి కేసులు పెట్టారు. రూ. 11 కోట్లతో చేపట్టిన శ్రీకృష్ణ దేవరాయ కాలువ ఆధునీకరణలో ఎమ్మెల్యేకి పెద్ద ఎత్తున ముడుపులు అందాయి. ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అయినా వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకో తెలుసా? ఈ ఫ్యామిలీ అవినీతి లో ఎక్కడ తనని మించిపోతారో అని జగన్ అనుకున్నాడు. అందుకే మంత్రి పదవి ఇవ్వలేదు.
మంత్రాలయాన్ని అభివృద్ధి చేసింది టిడిపి!
మంత్రాలయాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు వేసింది టిడిపి, మంత్రాలయం లో రూ. 6 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసింది టిడిపి. రూ.13 కోట్లతో మంత్రాలయం పట్టణానికి, చిలకలదోన, సుగూరు, కల్లుదేవకుంట గ్రామాలకు రూ.13 కోట్లతో తాగునీరు అందించాం. గురు రాఘవేంద్ర స్వామి, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాలను అభివృద్ధి చేసి పన్ను మినహాయింపు ఇచ్చాం. అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచి నీటి సౌకర్యం కల్పిస్తే…స్టికర్లు మాత్రం వైసీపీ పార్టీవి వేసుకుంటున్నారు. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించటం జరిగింది. కానీ మీరు ఏమి చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. ఉపాధి అవకాశాలు, వ్యవసాయ పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని టీడీపీ ప్రభుత్వంలో రూ.1,986 కోట్లు మంజూరు చేసి ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తాం.
కోసిగి ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తాం!
కోసిగి లో తాగునీరు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. కోసిగి లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. కోసిగిలో ఇండోర్ స్టేడియం కోసం టీడీపీ ప్రభుత్వంలో రూ.3కోట్లు మంజూరు చేస్తే… వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిధులు ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేస్తాం. కోసిగి లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వేరు శనగ, మిరప, పత్తి, ఉల్లి రైతులు పడే కష్టాలు నాకు తెలుసు. మీకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.15 కోట్లు ఇవ్వకపోవడంతో ఒక్క టీఎంసీల కూడా లిఫ్ట్ చేయలేదు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఆ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. మంత్రాలయం మండలం సూగూరు, వగరూరు, బూదూరు, తిమ్మాపురం, చెట్నహల్లె, కలుదేవకుంట, చిలకలడోన గ్రామాలకు తుంగభద్ర నది నుంచి తాగునీరు అందించేందుకు టీడీపీ ప్రభుత్వంలో రూ.11 కోట్లతో పనులు మొదలు అయ్యింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లు పట్టించుకోలేదు. ఆ పనులు పూర్తి చేసి తాగునీరు అందిస్తాం. 2009 వరదలకు మంత్రాలయం పూర్తిగా మునిగి పోయింది. ఫ్లడ్ వాల్ నిర్మాణం కలగానే మిగిలింది. 2009 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి ఫ్లడ్ వాల్ గురించి పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి రాగానే ఫ్లడ్ వాల్ నిర్మాణం చేపడతాం.
యువనేతను కలిసిన బాపులదొడ్డి గ్రామస్తులు
మంత్రాలయం నియోజకవర్గం బాపులదొడ్డి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో, నీళ్లు సరిగా రావడం లేదు. గ్రామంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజిలను శుభ్రం చేయడం లేదు. రేషన్ బళ్ల ద్వారా బియ్యం పంపిణీ సక్రమంగా జరగడం లేదు. వాడకపోయినా కరెంటు బిల్లులు భారీగా వేస్తున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
గత TDP ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు అందించాలని రూ.22వేల కోట్లతో ఎన్టీఆర్ జలసిరి పథకానికి శ్రీకారం చుడితే, వైసిపి ప్రభుత్వం వచ్చాక దానిని నిర్వీర్యం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా తట్ట మట్టివేసిన పాపాన పోలేదు. .వైసిపి ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో 8సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజల నడ్డి విరిచారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాం.
యువనేతను కలిసిన పీకలబెట్ట గ్రామస్తులు
మంత్రాలయం నియోజకవర్గం పీకలబెట్ట గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. జుమ్మాలదిన్నె చెరువునుంచి పైపులైను ద్వారా నీళ్ల స్టోరేజ్ ట్యాంకుకు నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి. పులికనుమ కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
గ్రామాల్లో ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. పులికనుమ ద్వారా రైతులకు సాగునీరందించేలా చర్యలు తీసుకుంటాం.
యువనేతను కలిసిన కోసిగి గ్రామస్తులు
మంత్రాలయం నియోజకవర్గం కోసిగి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది.వేసవికాలంలో తాగునీటికి మేం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యవసాయానికి సాగునీరు కూడా అందడం లేదు. కోసిగిలో డిగ్రీ కళాశాల నిర్మించండి. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
వైసిపి ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యే దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదు. ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు పులికనుమ కెనాల్ నిర్మిస్తే, వైసిపి నేతలు ఆ నీటిని చేపలు, రొయ్యల చెరువులకోసం వాడుకుంటున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోసిగికి తాగు, సాగునీరందించేలా చర్యలు తీసుకుంటాం. కోసిగిలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి గతంలో జిఓ ఇస్తే… వైసిపి ప్రభుత్వం అమలుచేయలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక కోసిగిలో డిగ్రీ కళాశాలను నిర్మిస్తాం.
Also, read this blog: Innovating for Tomorrow: Yuvagalam’s Vision
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh