కర్నూలు దుమ్మురేపిన యువగళం పాదయాత్ర యాత్రను అడ్డుకునేందుకు వైసిపి లాయర్ల విఫలయత్నం లోకేష్ ను చూసేందుకు రోడ్లవెంట బారులు తీరిన జనం

కర్నూలు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో హోరెత్తింది. యువనేత పాదయాత్రతో నగరంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయి, జనసంద్రంగా మారాయి. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలను నగరవాసులు లోకేష్ దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కోర్టు భవనం ముందు న్యాయవాదులు లోకేష్ ను కలిసి సంఘీభావం తెలిపారు.  టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో న్యాయవాదులు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీ ని జగన్ తరలించారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారు. అమరావతి లోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టు లో వైసిపి ప్రభుత్వం తెలిపింది. విశాఖ లో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు పేర్కొన్నారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ మాది కాదు. కర్నూలులోడ హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. యువనేత కర్నూలు పర్యటనలో వినతులు వెల్లువెత్తాయి. ఎస్సీలు, యాదవులు, వీరశైవులు, బిసిలు, నగర ప్రజలు, ఎలక్ట్రికల్ వర్కర్లు తదితరులు యువనేతను కలిసి సమస్యలు చెప్పుకున్నారు.

యాత్రను అడ్డుకునేందుకు బ్లూ మీడియా పాట్లు!

యువగళం పాదయాత్ర ను అడ్డుకోవడానికి బ్లూ మీడియా  నానా పాట్లు పడుతోంది. 10 మందిని పోగేసి పాదయాత్రలో నిరసన అంటూ హై డ్రామా మొదలెట్టింది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించగా, యువనేత లోకేష్ వైసిపి లాయర్లకు గట్టిగా కౌంటరించారు. హైకోర్టు తెస్తానంటూ మాటిచ్చి మోసం చేసిన జగన్ ఇంటి ముందు నిరసన తెలపాలని అన్నారు.  బుగ్గన బెంగుళూరు వెళ్లి విశాఖ లో హై కోర్టు అన్నారు. సుప్రీం కోర్టులో అమరావతి లోనే హైకోర్టు అని అఫిడవిట్ వేశారని చెప్పారు. వైసిపి న్యాయవాదులు, సాక్షి, బ్లూ మీడియా నిరసన చెయ్యాల్సింది జగన్ ఇంటి ముందు, నా ముందు కాదని ఘాటుగా బదులిచ్చారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నాం. -అచ్చెమ్మ, మున్సిపల్ కార్మికురాలు

మున్సిపాలిటీలో నేను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నాను. ఎటువంటి సెలవులేకుండా నెలంతా పనిచేస్తే రూ.7వేలు ఇస్తున్నారు. ఒకరోజు సెలవుపెట్టినా రూ.250 కట్ చేస్తారు. నా భర్త అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తుండగా, రూ.6వేలు ఇస్తున్నారు. 5గురు పిల్లలు ఉన్నారు. అందరినీ ప్రభుత్వ స్కూళ్లలోనే చదివిస్తున్నారు. ఇంటి అద్దె రూ.2,500 చెల్లిస్తున్నాను. రేషన్ తప్ప ఏమీ రావడంలేదు. చాలీచాలని ఆదాయంతో బతుకుబండి లాగడం కష్టంగా ఉంది.

పనులు దొరకడమే కష్టంగా ఉంది

కృష్ణయ్య, బేలుదారి కార్మికుడు

తాండ్రపాడు నుంచి కర్నూలు వచ్చి కూలీ పని చేస్తున్నా. గడియారం హాస్పటల్ సెంటర్ లో నిలబడితే పని ఉన్నరోజున మేస్త్రీలు వచ్చి తీసుకెళతారు. లేనిరోజు ఇంటికి వెళ్లాల్లిందే. వారంలో 4రోజులు మాత్రమే పనిదొరుకుతుంది. పని దొరకని రోజు ట్యాంకర్లు శుభ్రం చేసే పనికి వెళ్తుంటాను. గతంలో పనిలేని రోజున రూ.5రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్ లో ఆకలితీర్చుకునే వాళ్లం. ఇప్పుడు ఇంటివద్ద నుంచే తెచ్చుకుంటున్నాం. మళ్లీ అన్నా క్యాంటీన్ పెడితే మాలాంటి వారికి ఆసరాగా ఉంటుంది.

అన్యాయంగా ఉద్యోగాల నుంచి పీకేశారు

-వరుణ్, సర్వేష్, కర్నూలు

అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేసే మమ్మల్ని 2021 ఆగస్టులో ఉద్యోగాల నుంచి తొలగించారు.  2016లో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో మా నియామకాలు జరిగాయి. మరికొందరు 2004 నుండి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,545 మంది, కర్నూల్ జిల్లాలో 160 మందిని తొలగించారు. మీరు ఔట్ సోర్సింగ్ వాళ్లు అందుకే తొలగించాము అని సమాధానం చెప్తున్నారు..కానీ 104 ఉద్యోగులను మాత్రం కొనసాగిస్తున్నారు. కోవిడ్ సమయంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి సేవలందించాం. మాకు న్యాయం చేయాలి.

జ‌గ‌న్ రెడ్డి..ఈ బ్రిడ్జి నువ్వు క‌ట్టావా?

కర్నూలు శివారు జోహార్ పురం వద్ద హంద్రీనీవా నదిపై గత ప్రభుత్వంలో నిర్మించిన బ్రిడ్జి వద్ద సెల్ఫీ దిగిన యువనేత లోకేష్ జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. టిడిపి ప‌థ‌కాల‌కి పేర్లు మార్చాడు. N Chandrababu Naidu గారు చేసిన శంకుస్థాప‌న‌ల‌కే మ‌ళ్లీ శిలాఫ‌ల‌కాలు వేసి డ‌బ్బా కొట్టుకుంటూ జ‌గ‌న్ రెడ్డి అయ్యాడు. నాలుగేళ్ల పాల‌న‌లో ఒక్క అభివృద్ధి ప‌నీ చేయ‌డం చేత‌కాని జ‌గ‌న్ రెడ్డి కర్నూలు ఓల్డ్ సిటీ -జొహారాపురం మధ్య హంద్రీ నదిపై టిడిపి నిర్మించిన వారధిని మాత్రం తాను నిర్మించాన‌ని డ‌ప్పు కొట్టుకుంటున్నాడు. టిడిపి స‌ర్కారు 90 శాతం బ్రిడ్జి ప‌నులు పూర్తి చేస్తే, 10 శాతం ప‌నులు పూర్తి చేసి ఆరంభించ‌డానికి జ‌గ‌న్ రెడ్డికి నాలుగేళ్లు ప‌ట్టింది. బ్రిడ్జికి ఈ చివ‌ర‌, ఈ చివ‌ర మ‌ట్టి క‌ప్పలేని జ‌గ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానులు క‌డ‌తాడ‌ట‌! భోగాపురంలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నిర్మించేసి డబుల్ డెక్కర్ విమానాలు దింపుతాడ‌ట‌ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

విద్యతో వికాసం..వైద్యంతో ఆరోగ్యం -అంద‌రికీ అందించిందే తెలుగుదేశం – నారా లోకేష్‌కి కృత‌జ్ఞత‌లు తెలిపిన త‌ల్లిదండ్రులు

తెలుగుదేశం ప్రభుత్వం అందించిన విదేశీ విద్య అవ‌కాశాలు వేల‌కుటుంబాల్లో వెలుగులు నింపాయి. వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించిన సాయంతో వేలాది ప్రాణాలు నిలిచాయి. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో ప్రయోజ‌నం పొందిన వారు,  పాద‌యాత్రగా త‌మ ప్రాంతానికి వ‌చ్చిన తెలుగుదేశం తేజం యువ‌నేత నారా లోకేష్‌ని క‌లిసి TDP చేసిన మేలు మ‌ర‌వ‌లేమ‌ని చెబుతున్నారు. విదేశీ విద్య ప‌థ‌కం కింద సాయం అందుకుని జ‌ర్మనీలో చ‌దువుకున్న త‌న‌యుడు అక్కడే ఉన్నతోద్యోగంలో సెటిల‌య్యాడ‌ని, మా కుటుంబం సంతోషంగా ఉండ‌టానికి తెలుగుదేశం ప్రభుత్వమే కార‌ణ‌మ‌ని బాల‌గంగాధ‌ర్ తిల‌క్ పేర్కొన్నారు. లోకేష్‌కి స్వీట్లు అంద‌జేసి థ్యాంక్స్ చెప్పారు. పాప‌కి వైద్యచికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 ల‌క్షలు మంజూరు చేసిన చంద్రబాబు త‌న కంటిదీపాన్ని కాపాడార‌ని ఓ త‌ల్లి లోకేష్‌ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసింది.

టిడిపి వచ్చాక పన్నుల విధానాన్ని ప్రక్షాళన చేస్తాం ఆర్యవైశ్యులకు అండగా నిలచింది టిడిపినే! రోశయ్య పేరుతో మ్యూజియం ఏర్పాటుచేస్తాం ఆర్యవైశ్యులతో ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్

కర్నూలు: టిడిపి అధికారంలోకి వచ్చాక పన్నుల విధానాన్ని ప్రక్షాళన చేసి, వ్యాపారులకు ఉపశమనం కలిగిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. బోర్డు ట్యాక్స్, చెత్తపన్ను వంటివాటితో వ్యాపారులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా నిలచేది టిడిపి మాత్రమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలులోని శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ… రోశయ్యకు ప్రతి పుట్టినరోజుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాడిని. రాజకీయాలకు అతీతంగా రోశయ్య పని చేశారు. రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్ వెళ్లలేదు. రోశయ్య కాంగ్రెస్ అయినా మాకు ఆయనంటే గౌరవం. రోశయ్యకు తగిన గౌరవం కల్పిస్తాం. మ్యూజియం ఏర్పాటు చేసి, ఆయన సేవల తాలూకా ఆనవాళ్లు మ్యూజియంలో ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య పెద్దవాదనలు జరిగినప్పుడు రోశయ్య సంధాన కర్తగా ఉండేవారు.  రోశయ్య సీఎం అయ్యాక చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించారు. రోశయ్య చనిపోవడంతో ఆర్యవైశ్యుల్లో పెద్దదిక్కు లేకుండా పోయింది. ఆర్యవైశ్యుల్లో పేదరికం ఉందని చెప్పగానే చంద్రబాబు రూ.30 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మారాక కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. టీడీపీ వచ్చాక దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. పేదరికానికి కులం, మతం ఉండదు.

వైసిపి పాలనలో ఆర్యవైశ్యులూ బాధితులే!

కొన్ని కులాలతో పాటు ఆర్యవైశ్యులకు వైసీపీ పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ కులాల పట్ల వైసీపీకి ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవాలి. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎవర్ని కదిలించినా బాధితులుగా ఉన్నారు.  టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయా.? కానీ వైసీపీ నేతలు మాత్రం వారి పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తాపై దాడి చేసిరు. తెనాలిలో కార్పొరేటర్ ను కొట్టారు. వైశ్యులపై ఈ ప్రభుత్వంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దాడులకు పాల్పడిన వారిని చంద్రబాబు వదిలిపెట్టరు. రౌడీషీటర్లనందరినీ జైల్లో పెడతాం. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. వైశ్యులకి రక్షణ కల్పిస్తాం.

ఎంతమందిపై కేసులు పెడతారు?

 పోలీసులు కూడా బయటకు వచ్చి మేము కూడా ఈ ప్రభుత్వంలో బాధితులమే అని వాపోతున్నారు. పక్కరాష్ట్రాల అభివృద్ధిని చూసి అసూయ పడాల్సి వస్తోంది.  సమర్థవంతమైన పాలన లేక రాష్ట్రం వెనకబడుతోంది. అందరిలో చైతన్యం రావాలి..ఒక్కరిపై కేసు పెడతారు..వెయ్యి మందిపై పెడతారా.?  కర్నూలు ఎందులో తక్కువ..అభివృద్ధికి అన్ని అర్హతలున్నాయి. ఏపీ బ్రాండ్ దెబ్బతింది. అమర్ రాజా ఎక్కువ పన్ను చెల్లిస్తుంది..అలాంటి కంపెనీని తెలంగాణకు తరిమారు.  ఇప్పడు ఈ – కామర్స్ వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కల్పించాలి. కర్నూలులో టిడిపి హయాంలో 1000 మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. నాలుగేళ్లుగా సోలార్ ప్లాంట్ పై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.  మళ్లీ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ పోర్టల్ సమస్య కూడా పరిష్కరిస్తాం.

ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చాం

ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, షాపుల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తగ్గించాలి. చెత్తపన్ను కట్టకపోతే చెత్త తెచ్చి షాపు ముందు పోస్తున్నారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించాలి. ఆర్యవైశ్యులను రాజ్యసభకు పంపింది టీడీపీనే. శిద్ధా రాఘవరావుకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చాం. 2014 నుండి 2019 వరకు మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. తప్పకుండా వైశ్యులను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాద్యత తీసుకుంటాం.  ఇద్దరు ఎంపీలు, 14 ఎమ్మెల్యేలను గెలిపించండి కర్నూలును మేము అభివృద్ధి చేస్తాం.  ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసింది టీడీపీనే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూట్రల్ గా ఉన్నవాటిల్లోకి రాజకీయాలు తెచ్చారు .మీ సమక్షంలో మార్పులు జరగాలి..వాటికి మేము సహకరిస్తాం. విదేశాలకు వెళ్లి చదవాలన్న ఆశ చాలా మందిలో ఉంది. ఏపీకి మంచి వనరులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనూ ఆంధ్రులు ఉన్నారు. వారికి మంచి అవకాశాలు కల్పిస్తే సొంత రాష్ట్రానికి వచ్చి పనులు చేసుకుంటారు. ఆర్థికంగా వెనకబడిన ఓసీలకు కేంద్రం 10 రిజర్వేషన్ అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం అమలు చేయలేదు..మేము వచ్చాక అమలు చేస్తాం.

లోకేష్ ను కలిసిన మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు

ఎస్సీ వర్గీకరణ అమలుచేసి, మాదిగలకు న్యాయం చేయాలి. గత ప్రభుత్వంలో అమలుచేసిన రైతులకు భూమి కొనుగోలు పథకం, బోర్లు, ఉచిత విద్యుత్, ఎన్ఎస్ఎఫ్ డిసి బ్యాంకు లికేజి పునరుద్దరించాలి. ప్రస్తుత ప్రభుత్వం 1998 డిఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో రోస్టర్ పాయింట్ అమలుచేయలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. కర్నూలు 23వవార్డు శ్రీరామ్ నగర్ సుద్దవంక వరద నీరు కాలనీలోకి ప్రవహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు ఈ కాలనీలో అత్యధికంగా ఉన్నందున ఫ్లడ్ వాల్ నిర్మించాలి.

లోకేష్ మాట్లాడుతూ…

గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలుచేసిన 27సంక్షేమ పథకాలను రద్దుచేసిన జగన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.33,504 కోట్లను జగన్ దారి మళ్లించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం. సుద్దవంక వద్ద రక్షణగోడ నిర్మించి శ్రీరామ్ నగర్ కాలనీవాసులకు ముంపు బారినుంచి విముక్తి కల్పిస్తాం.

యువనేతను కలిసిన 50వ డివిజన్ ప్రజలు

కర్నూలు 50వ డివిజన్ టిడ్కో బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా డివిజన్ లో 1200మంది గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకోసం రూ.లక్ష చొప్పున చెల్లించాం. ఇంతవరకు ఇళ్లను పూర్తిచేసి ఇవ్వలేదు. వార్డుల్లో మంచినీరు సరిగా రావడంలేదు, నీటి సమస్య ఇబ్బందిగా ఉంది. బిసి కార్పొరేషన్ లో లోన్లు తీసుకున్న 18మంది రజకులు లోన్లు క్లియర్ చేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదు. 50వవార్డులో పార్కు, లైబ్రరీ ఏర్పాటుచేయాలి. మా వార్డులో విద్యుత్ స్తంభాలు, విద్యుత్, డ్రైనేజి సమస్యలు ఉన్నాయి. మా సమస్యల పరిష్కారానికి చొరవచూపండి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

టిడిపి ప్రభుత్వ హయాంలో 90శాతానికి పైగా పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను మిగిలిన పనులు పూర్తిచేసి ఇవ్వకుండా సైకో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. పట్టణాలు, నగరాల్లో పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ద, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక 50 వడివిజన్ తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరిస్తాం. 50వ డివిజన్ లో ఖాళీస్థలాన్ని గుర్తించి పార్కు, లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

యువనేతను కలిసిన కర్నూలు బండిమిట్ట వాసులు

మా ప్రాంతంలో కరెంటు స్తంభాల వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజి, వాటర్ పైపులు కలిసి ఉండటంతో తాగునీరు కలుషితమవుతోంది. మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రేషన్ బళ్ల కోసం గంటలతరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. డీలర్ల వద్ద రేషన్ ఇచ్చే విధానాన్ని పునరుద్దరించాలి. పెట్రోలు, గ్యాస్ ధరలు తగ్గించాలి. తమ ప్రాంతంలో చాలామందికి పింఛన్లు తీసేశారు. అర్హులందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. అర్హులందరికీ టిడ్కో ఇళ్లు ఇవ్వాలి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

జగన్ ప్రభుత్వం పన్నులు పెంచడంలో చూపిన చొరవ సౌకర్యాల కల్పనలో చూపడం లేదు. కమీషన్ల కోసం రేషన్ బళ్లను కొనుగోలు చేసి జనానికి చుక్కులు చూపిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత రేషన్ సరఫరా విధానాన్ని సమీక్షిస్తాం. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించి, ధరలను అదుపులోకి తెస్తాం. అర్హులైన వారదరికీ పెన్షన్లు, ఇళ్లు మంజూరు చేస్తాం.

యువనేతను కలిసిన వీరశైవ ఐక్యవేదిక ప్రతినిధులు

కర్నూలు వీరశైవ ఐక్యవేదిక ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీరశైవులకు అర్చకత్వం, పాలకమండళ్లలో సముచిత స్థానం కల్పించాలి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మా సామాజికవర్గీయులు అత్యధికంగా ఉన్నందున చట్టసభల్లో అవకాశం కల్పించాలి. వీరశైవ లింగాయత్ ల ఓబిసిల్లో చేర్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలి. ప్రస్తుత ప్రభుత్వం వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుచేసినా ఎటువంటి నిధులు కేటాయించలేదు. మా కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి.

లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో కనీసం కుర్చీలు కూడా లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వివిధ సామాజికవర్గాలను దారుణంగా మోసగించింది. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ కు దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం. శివాలయాల్లో వీరశైవ అర్చకులకు అవకాశాం కల్పిస్తాం. వీరశైవులను ఓబిసి జాబితాలో చేర్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తాం.

యువనేతను కలిసిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఎపిలో 5లక్షలమంది ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్లు ఉన్నారు. ఎలక్ట్రికల్ వర్కర్లకు సంవత్సరానికి ఆరునెలల మాత్రమే పని దొరుకుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వృత్తిలోకి రావడానికి కొత్తవారు మొగ్గుచూపడం లేదు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, వృత్తిభద్రత లేకపోవడంతో ఇతర వృత్తుల్లోకి వెళ్తున్నారు.  ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. ప్రమాదాల్లో చనిపోయిన వారికి రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృత్తిపని చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణపనులు ఆగిపోవడంతో ఎలక్ట్రికల్ వర్కర్లు ఉపాధి కోల్పోయారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి వృత్తిపని వారందరికీ చేతినిండా పని కల్పిస్తాం. ఎలక్ట్రికల్ వర్కర్లకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. ఎలక్ట్రికల్ వర్కర్లకు సబ్సిడీపై పరికరాలు అందజేస్తాం.

యువనేతను కలిసిన వడ్డెర సామాజిక వర్గీయులు

కర్నూలు దర్వేష్ ఖాద్రి దర్గా వద్ద వడ్డెర సామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  రాష్ట్రంలో 35లక్షలమంది వడ్డెర కులస్తులం ఉన్నాం. తీవ్ర పేదరికంలో ఉన్న మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. కొండ ప్రాంతాల్లో క్వారీ పనిచేసే వడ్డెర్లు ప్రమాదంలో మరణిస్తే రూ.10లక్షల బీమా కల్పించాలి. వడ్డెర్లకు కటింగ్ మిషన్లు, జెసిబి, టిప్పర్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందించాలి. బేలుదారి, మట్టిపనిచేసే వడ్డెర్లకు బీమా సౌకర్యం కల్పించాలి. వడ్డెర కులస్తులకు బ్యాంకు లింకేజి ద్వారా కాకుండా బిసి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

వడ్డెర్లకు గతంలో ప్రభుత్వం కేటాయించిన క్వారీలను వైసిపి నేతలు లాక్కుని తీవ్ర అన్యాయం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నేతలు ఆక్రమించిన క్వారీలను వడ్డెర్లకు అప్పగిస్తాం. వడ్డెర్లకు యంత్రపరికరాలు, పనిముట్ల కొనుగోలుకు  కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ప్రమాదంలో మృతిచెందిన వడ్డెర సోదరులకు చంద్రన్న బీమాను వర్తింపజేస్తాం. వడ్డెర్లకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

యువనేతను కలిసిన కర్నూలు బంగారుపేట వాసులు

కర్నూలు 13వవార్డు బంగారుపేట వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కర్నూలు 13వవార్డు ఆర్టీసి బస్టాండు, రైల్వేస్టేషన్ లకు కూతవేటు దూరంలో ఉంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కాలనీ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మా వార్డులో అత్యధికంగా నివసిస్తున్న నీలిషికారి తెగవారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా నీలిషికారి తెగవారిని ఎస్టీ జాబితాలో చేర్చాలి. నీలిషికారి తెగవారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. 13వవార్డులో డ్రైనేజి సమస్య అధికంగా ఉంది. వర్షం వస్తే వీధులు మోకాటిలోతు నీటితో నిండిపోతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా వార్డు సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

వైసిపి నాయకులకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో పేదలు నివసించే బస్తీలను మురికికూపాలుగా మార్చేసింది. పేదలు నివసించే ప్రాంతాల్లో కనీసం తాగునీరు, డ్రైనేజి వంటి సౌకర్యాలను కల్పించడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం. నీలిషికారి తెగవారి ఉపాధికి చర్యలు తీసుతీసుకుంటాం.

ఆటోకూలీలను కలిసి కష్టాలు తెలుసుకున్న లోకేష్

కర్నూలు గడియారం హాస్పటల్ సెంటర్ లో ఆటోకూలీలను కలిసిన లోకేష్, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు శివారు ప్రాంతాలు అయిన గిందిపర్ల, తాండ్రపాడు, దొడ్డిపాడు, సుందరయ్య నగర్ కి చెందిన కూలీలు నారా లోకేష్ ని కలిసారు. ఆటోకూలీలు మాట్లాడుతూ…ప్రతి రోజు భవన నిర్మాణ పనుల కోసం 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి కర్నూలు కి వస్తున్నాం. ప్రతి రోజూ రూ.100 ఖర్చు వస్తుంది. వారంలో 3 రోజులు పని దొరకడమే కష్టం గా మారింది. పని దొరికితే రూ.600 కూలీ వస్తుంది, లేకపోతే మధ్యాహ్నం 12 వరకూ చూసి తెచ్చుకున్న భోజనం ఇక్కడే చేసి ఇంటికి వెళ్ళిపోతాం. స్థానికంగా పనులు లేక ఇంత దూరం రావాల్సి వస్తుంది. పిల్లల్ని ఇళ్లలో వదిలి పనులకు వస్తున్నాం అంటూ కూలీలు బాధపడ్డారు. తాము తెచ్చుకున్న భోజనం బాక్సులను ఆటోకూలీలు లోకేష్ కు చూపించారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ….

మీ గ్రామాలకు అవసరమైన బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగానే చేతినిండా పనులు దొరికేలా చేస్తాం. ఆటోకార్మికులకు సంక్షేమ పథకాలను అమలుచేస్తాం, అర్హులైన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తాం. మరో ఏడాది ఓపిక పట్టండి… మీ కోసం పనిచేసే చంద్రన్న ప్రభుత్వం రాబోతోంది.

లోకేష్ ను కలిసిన బిసి సంఘ ప్రతినిధులు

ఉమ్మడి కర్నూలు జిల్లా బిసి సంఘ ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బిసిలకు 50శాతం సీట్లు కేటాయించాలి. బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసేలా వత్తిడితేవాలి. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలుచేయాలి. ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంటు గడప తొక్కని బిసి కులాలకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధుల మాదిరిగా నామినేట్ చేయాలి. బిసిల సామాజికరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. కేంద్ర, రాష్ట్రాల్లో బిసిల జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో 56శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించాలి. జాతీయస్థాయిలో బిసిల అభివృద్దికి రూ.లక్షకోట్లతో సబ్ ప్లాన్ ఏర్పాటుచేయాలి. పాతపద్ధతిలో పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేయాలి. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. పంచాయితీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ ను 50శాతానికి పెంచి, చట్టబద్ధత కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలో రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారమళ్లించిన జగన్మోహన్ రెడ్డి. వైసిపి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అమలుచేసిన 100 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా బిసిలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక బిసిలపై 26వేల తప్పుడు కేసులు నమోదు చేసి వేధించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. గత ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. బిసిలకు చట్టసభల్లో అత్యధిక ప్రాధాన్యత నిచ్చిన పార్టీ తెలుగుదేశం, గతంలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఆర్థికమంత్రి వంటి కీలకపదవులను బిసిలకు కేటాయించాం. రాబోయేరోజుల్లో బిసిలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకుంటాం. బిసిల సంక్షేమం కోసం పాటుపడే చంద్రన్నను ముఖ్యమంత్రి  చేసేందుకు మీవంతు సహకారం అందించండి.

యువనేతను కలిసిన కర్నూలు నగర ప్రముఖులు

కర్నూలు కాళికామాత గుడి వద్ద నగర ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కర్నూలు నగరంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా పన్నులు పెంచారు. దీంతో కర్నూలులో సామాన్యుడు బతకాలంటే కష్టతరంగా మారింది. పట్టణంలో ఇంటిపన్నులు 15 శాతం పెంచారు. ట్యాక్సులు పెంచడం తప్ప గత నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు.  వర్షం వస్తే కర్నూలు నగర వీధులు తటాకాలను తలపిస్తున్నాయి. డ్రైన్లలో మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. కర్నూలు నగరప్రజల సంక్షేమాన్ని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గాలికొదిలేశారు. మీరు వస్తున్నారని తెలిసి హడావిడిగా రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కర్నూలులో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చండి.

టీకొట్టు నిర్వాహకుడితో లోకేష్ మాటామంతీ

కర్నూలు జమ్మిచెట్టు బజారులో యువనేత లోకేష్ ఓ టీస్టాల్ వద్ద టీతాగి, నిర్వాహకుడితో కొద్దిసేపు ముచ్చటించారు. వ్యాపారం ఎలాఉందని యువనేత వాకబు చేశారు. టీస్టాల్ నిర్వాహకుడు అబ్దుల్లా మాట్లాడుతూ… కరెంటు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. కరోనా తర్వాత వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే ఉంది. పన్నులు, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు పెరగడంతో భారంగా జీవితాన్ని లాగాల్సి వస్తోంది. ధరలు తగ్గిస్తే మాలాంటి వారికి వెసలుబాటుగా ఉంటుంది.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్యుడు బతకడమే కష్టంగా మారింది. గత నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.2.5లక్షల భారం మోపారు. 10రూపాయల ఇచ్చి వందలాగేస్తూ ప్రజలను పీడిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోలు, డీజిల్, నిత్యవసరాల ధరలను తగ్గిస్తాం. రాష్ట్రంలో అడ్డగోలుగా పెంచిన పన్నుల విధానాన్ని సమీక్షించి ప్రజలపై భారాన్ని తగ్గిస్తాం.

యువనేతను కలిసిన కర్నూలు బుధవారపుపేట వాసులు

కర్నూలు 14వవార్డు బుధవారపుపేట వాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత 40సంవత్సరాలుగా బుధవారపుపేట జయశ్రీ పెట్రోలు బంకు వెనుకవైపు దాదాపు 86కుటుంబాలు ఇళ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. ఇందులో చాలావరకు ముస్లిం మైనారిటీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు.  హంద్రీనది ఒడ్డున నివసించేవారికి గతంలో రక్షణ గోడ నిర్మించాలని శంకుస్థాపన కూడా చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దానిని నిలిపివేశారు. దీనివల్ల హంద్రీనదికి వరదలు వచ్చినపుడు, తుంగభద్రనదిలో బాక్ వాటర్ సమయంలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. బుధవారపుపేటలో రోడ్లు, కల్వర్టులు, కరెంటు పోల్స్ ఏర్పాటుచేయాలి. 14వవార్డులో హిందూ, ముస్లిం శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలి.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

వైసిపి ప్రభుత్వానికి పన్నుల వసూలుపై  ఉన్న శ్రద్ధ, నగరవాసులకు సౌకర్యాలు కల్పించడంలో లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక బుధవారపుపేట వాసులకు పట్టాలు అందజేస్తాం. హంద్రీనదికి రక్షణ గోడ నిర్మించి ముంపు సమస్యను పరిష్కరిస్తాం. తాగునీరు, రోడ్లు, విద్యుత్ సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తాం. బుధవారపుపేటలో హిందూ, ముస్లిం శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం.

యువనేతను కలిసిన యాదవ సామాజికవర్గీయులు

కర్నూలు కుమ్మరిగేటు వద్ద యాదవ హక్కుల పోరాటసమితి ప్రతినిధులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటుచేయాలి. జి.ఓ.నెం.559, 1016 ప్రకారం ప్రతి గ్రామ సొసైటీకి 5ఎకరాల భూమి కేటాయించాలి. 50సంవత్సరాలు దాటిన గోవులు, గొర్రెల కాపరులకు రూ.3వేల పెన్షన్ ఇవ్వాలి. రాజధానిలో యాదవ సంఘ భవనాన్ని నిర్మించాలి. పాల డెయిరీ చైర్మన్ పదవులు యాదవులకు కేటాయించాలి. యాదవ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. అడవులపై యాదవులకు హక్కు కల్పించాలి. యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి. జనాభా ప్రాతిపదికన యాదవులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

యాదవులకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చిన పార్టీ తెలుగుదేశం. గత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్థికమంత్రి, టిటిడి బోర్డు చైర్మన్ పదవులను యాదవులకు కేటాయించాం. జనాభా ప్రాతిపదికన యాదవ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం. గోవులు, గొర్రెల కాపరులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం. జనాభాను బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో యాదవ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. రాజధానిలో యాదవ సంఘ భవనానికి స్థలం కేటాయిస్తాం.

దివ్యాంగుడిని కలిసిన యువనేత నారా లోకేష్

కర్నూలు 17వవార్డులోని శివాలయం వీధి నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఓ దివ్యాంగుడి ఇంటిలోకి వెళ్లిన యువనేత లోకేష్ అతని కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుడు నరేష్ గౌడ్ తల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ… 35సంవత్సరాలుగా వచ్చే పెన్షన్ ను వైసిపి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే నిష్కారణంగా తొలగించారు. ప్రభుత్వాసుపత్రి రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న మరో కుమారుడి ఉద్యోగాన్ని కూడా అన్యాయంగా తీసేశారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

అధికారంలోకి వచ్చాక 6లక్షల పెన్షన్లు తొలగించిన జగన్మోహన్ రెడ్డి. టిడిపి అధికారంలోకి ఉన్నపుడు దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్లు ఖర్చుచేశాం. టిడిపి అధికారంలోకి రాగానే నరేష్ గౌడ్ కు పెన్షన్ అందజేస్తాం. మరో ఏడాది ఓపిక పట్టండి… చంద్రన్న ప్రభుత్వం మీ అందరికీ అండగా నిలుస్తుంది.

Also, read this blog: Mobilizing Youth for Positive Change with Yuvagalam Padayatra

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *