ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు నీరాజనాలు కోడుమూరు నియోజకవర్గంలో సమస్యల వెల్లువ సంఘీభావం తెలిపిన బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని యాత్రలో పాల్గొన్న మాజీమంత్రులు ఆలపాటి, అఖిలప్రియ

కోడుమూరు: యువనేత Nara lokesh యువగళం పాదయాత్ర 94వరోజు (మంగళవారం) కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా కోడుమూరు ప్రజలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. కోడుమూరు నియోజకవర్గం పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు, రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయం, వెంకయ్యపల్లి, రాంభూపాల్ నగర్, మిలటరీ కాలనీ, తాండ్రపాడు మీదుగా గార్గేయపురం శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు, ఎస్సీలు, మైనారిటీలు, ఈడిగలు, వృద్ధులు, వికలాంగులు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గార్గేయపురం శివార్లలో టిడిపి హయాంలో చెక్ డ్యామ్ నిర్మాణం ద్వారా టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన సరస్సు వద్ద యువనేత సెల్ఫీ దిగారు. అడుగడుగునా యువనేతను చూసేందుకు మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం పోటీపడ్డారు. పార్టీ కార్యకర్తలు గజమాలలతో యువనేతను సత్కరించారు. బి.తాండ్రపాడు గ్రామస్తులు యువనేతకు వినతిపత్రం సమర్పిస్తూ తమ గ్రామంలో పురాతన కాలంలో సువిశాలమైన చెరువును ఎమ్మెల్యే బినామీలు పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కోడుమూరు పాదయాత్రలో యువనేతకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు పాదయాత్రలో పాల్గొన్నారు. బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని, చిన్నల్లుడు భరత్, మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమా అఖిలప్రియ, ఆలూరు నియోజకవర్గ ఇన్ చార్జి కోట్ల సుజాతమ్మ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, సత్తెనపల్లి పార్టీ నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు లోకేష్ కు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు.  94వరోజు యువనేత 10.5 కిలోమీటర్ల దూరం నడిచారు. యువగళం పాదయాత్ర ఇప్పటివరకు 1189 కిలోమీటర్లు పూర్తయింది.

యువగళం పాదయాత్రలో వ్యక్తమైన సమస్యలు:

అర్హత సాధించినా ఉద్యోగం ఇవ్వలేదు

-నరేష్, దివ్యాంగుడు, మిలటరీ కాలనీ.

 మిలటరీ కాలనీకి చెందిన నేను దివ్యాంగుడిని. నాది 2013లో డిగ్రీ పూర్తి అయింది. పెన్షన్ వస్తున్నా అది నా అవసరాలకు సరిపోక ఇబ్బందులు పడుతున్నా. ఈ ప్రభుత్వంలో వదిలిన సచివాలయం ఉద్యోగాల్లో అర్హత సాధించా. కానీ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్లకు నచ్చిన వాళ్లకు ఇస్తున్నారు. నేను బీసీనే… కానీ బీసీలలోనే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. నేను దివ్యాంగుడినని పక్కనబెట్టేసారు. నా కోటాలో ఉద్యోగం రావాల్సి ఉన్నా రాలేదు.

ట్రాక్టర్ కు కిరాయిలు లేవు

-డి.మధు,  తాండ్రపాడు

ఎస్సీ కార్పొరేషన్ లో  మా అమ్మ పేరు మీద గతంలో ట్రాక్టర్ వచ్చింది. నా భార్య పేరు మీద లక్ష రూపాయలు హౌసింగ్ లోన్ లోన్ వచ్చింది.  మా అన్న ఆటో కొనుక్కునేందుకు లక్ష రూపాయలు సబ్సిడీ వచ్చింది. టిడిపి హయాంలో మేము అత్యధికంగా లబ్ధి పొందాం.  చంద్రబాబు ఇచ్చిన ట్రాక్టర్ తోనే గతంలో ఇసుక బాడుగలకు పెట్టేవాళ్ళం. అన్ని ఖర్చులు పోను రోజూ రూ.2,000 దాకా మిగిలేవి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే టిప్పర్లు మాత్రమే నడుపుకుంటున్నారు. ట్రాక్టర్లకు పని ఉండటం లేదు. ఎవరన్నా ట్రాక్టర్లను బాడుగకు  ఇసుక తోలుకునేందుకు పిలిస్తే బాడికి తోలే వాళ్ళను బెదిరిస్తున్నారు. టిప్పర్లతో మాత్రమే ఇసుక తోలుకోవాలంట.

పట్టాలిచ్చారు…స్థలం చూపించలేదు!

-అయ్యస్వాములు, గొందిపల్లి

 మా గ్రామంలోనే నాకు సెంటు పట్టాలో భాగంగా ఇంటి స్థలం ఇచ్చామని వాలంటీర్లు వచ్చి బుక్కులు ఇచ్చారు.  కానీ ఆ సెంటు స్థలం ఎక్కడ ఉందో చూపించమంటే మాత్రం ఏడాది నుంచి చూపించడం లేదు.  స్థలం చూపించినప్పుడు నా పేరు బుక్ లో ఎందుకు అని ప్రశ్నించా.  నాకే కాదు మా గ్రామంలో ఉన్న అందరికీ ఇదే జరిగింది.  ఏడాది నుంచి అడుగుతానే ఉన్నాం కానీ పట్టించుకోలేదు

లక్షన్నర బిల్లులు ఆగిపోయాయి

-రాజేష్, గూడూరు.

ప్రభుత్వం నిర్మించే చిన్న వాటర్ ట్యాంకులు, బ్రిడ్జి, చప్టాలకు మేము సెంట్రింగ్ సరఫరా చేస్తాము. సెంట్రింగ్ పెట్టినందుకుగాను ప్రభుత్వం నుంచి లక్షన్నర రావాలి. నాలుగు నెలలుగా పెండింగ్ పడిన బిల్లులు ఇవ్వలేదు. మా వద్దకు పనికి వచ్చే  మేస్త్రీలు, కూలీలు మాపై ఒత్తిడి  తెస్తుంటే అప్పు తెచ్చి చెల్లించాం.  మాలాంటి చిన్నాచచితకా వాళ్లకు కూడా బిల్లులు ఇవ్వకుంటే పనులు చేయడం కష్టం అవుతుంది.

కరువుసీమకు జలకళ…చంద్రన్న దార్శనికత!

గార్గేయపురం చెరువు వద్ద సెల్ఫీ దిగిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హంద్రీనది చెంతనే ఉన్న గుక్కెడు నీళ్లివ్వల్లేని జగన్మోహన్ రెడ్డి అయితే, వర్షపునీటిని ఒడిసిపట్టి రాయలసీమకు జలకళ తెచ్చిన అపర భగీరథుడు మన N Chandrababu Naidu.  కరువుసీమలో కళకళలాడుతున్న ఈ జలాశయం కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం శివార్లలో ఉంది. కొండల్లో నుంచి వచ్చే వర్షపునీటికి చెక్ డ్యామ్ నిర్మాణం ద్వారా అడ్డుకట్టవేసి, సుందరమైన సరస్సుగా మార్చారు చంద్రబాబునాయుడు. ఈ ప్రాంతంలో ఆహ్లాదమైన బోటింగ్ ఏర్పాటుచేసి, టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేశారు. చంద్రబాబు గారి దార్శనికతకు ఇదొక మచ్చుతునక మాత్రమేనని యువనేత లోకేష్ అన్నారు.

యువనేతను కలిసిన దళితులు

కోడుమూరు నియోజకవర్గం వెంకయ్యపల్లి దళితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీలోన్లు నిలిపేశారు. సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది. గతంలో ఎన్ఎస్ఎఫ్ డిసి పథకం కింద దళితులకు వాహనాలు ఇచ్చేవారు. ఇప్పుడు నిలిపివేశారు. బ్యాంకు లింకేజీ లోన్లు నిలిపేశారు. చిరు వ్యాపారులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడంలేదు. రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వడంలేదు, బోర్లు వేయడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.

లోకేష్ స్పందిస్తూ…

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎస్సీలకు సంక్షేమం, రక్షణ రెండూ కరువయ్యాయి. గత నాలుగేళ్లలో రూ.28,147కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించిన జగన్ రెడ్డి. దళితులను వైసీపీ నాయకులు చంపిన వారికి వైసీపీ నాయకులు సన్మానాలు, పాలాభిషేకాలు చేస్తున్నారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న దుర్మార్గపు పాలన వైసీపీ. గత టిడిపి ప్రభుత్వం దళితులకోసం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను జగన్ రద్దుచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఎస్సీలపై తప్పుడుకేసులు పెట్టి వేధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్సీ రైతులకు గతంలో మాదిరి పూర్తి సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేస్తాం. ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిల్స్ ను తిరిగి ప్రారంభిస్తాం.

లోకేష్ ను కలిసిన నూతిరెడ్డిపల్లి గ్రామస్తులు

కోడుమూరు నియోజకవర్గం నూతిరెడ్డిపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన రోడ్లను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వంలో వేసిన వీధిలైట్లు పాడైపోయాయి. కొత్త లైట్లు వేయడం లేదు. గ్రామంలోని డ్రైనేజీలు నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు ఇళ్లల్లోకి వస్తున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.

లోకేష్ స్పందిస్తూ…

జగన్ రెడ్డి సీఎం అయ్యాక గ్రామీణాభివృద్ధిని గాలికొదిలేశాడు. TDP హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల వీధి దీపాలు వేశాం. నేడు పంచాయితీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కు కూడా డబ్బులేని దుస్థితి కల్పించాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక పాడైపోయిన రోడ్లను పునర్నిర్మిస్తాం.  అవసరమన చోట ఎల్ ఇడి లైట్లు ఏర్పాటు చేస్తాం. నిలిచిపోయిన డ్రైనేజీ పనులను పూర్తిచేస్తాం.

యువనేతను కలిసిన పూడూరు గ్రామస్తులు

కోడుమూరు నియోజకవర్గం పూడూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి. రోడ్లు సరిగా లేకపోవడంతో అంబులెన్సు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతులకు సబ్సిడీలు అందడం లేదు. గ్రామంలోని పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది. వీధి దీపాలు చెడిపోతే పట్టించుకునేవారు లేరు. మా గ్రామానికి బస్సు సౌకర్యం, వైద్య సదుపాయం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు సంబంధించిన రూ.8,600కోట్లను వైసీపీ దొంగిలించారు. పంచాయితీ సర్పంచ్ లు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించారు. పాడైపోయిన రోడ్లపై కనీసం తట్ట మట్టిపోసే దిక్కులేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మళ్లీ గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపయాలకు పెద్దపీట వేస్తాం. గ్రామపంచాయితీలకు నిధులు, అధికారాలు ఇచ్చి బలోపేతం చేస్తాం.

యువనేతను కలిసిన ఈడిగ సామాజిక వర్గీయులు

కోడుమూరు నియోజకవర్గం నందనపల్లి ఈడిగ సామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 1997లో గీత కార్మికుల ఉపకులాలన్నింటినీ ఒకటిగా చేస్తూ జిఓ నెం.16ను విడుదలచేశారు. మా ఐదు ఉపకులాలకు ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గీత కార్మికుల కార్పొరేషన్ కు రూ.100కోట్లు కేటాయించాలి. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.20లక్షలు పరిహారం ఇవ్వాలి. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 30శాతం కేటాయించాలి. ఈత, తాటి, కర్జూర మొక్కలు ఇచ్చి ఉచితంగా బోర్లు ఏర్పాటుచేయాలి. టీఎఫ్ టి లైసెన్సులు మంజూరు చేయాలి, నీరా కేఫ్ లు ఏర్పాటుచేయాలి.

లోకేష్ స్పందిస్తూ…

కులాల మధ్య గొడవలు సృష్టించి చలికాచుకోవడం వైసీపీ నైజం. విధులు, నిధులు లేని కార్పొరేషన్లతో బీసీలను వైసీపీ మోసం. ఆదరణ పథకం రద్దు చేసి బీసీలకు తీరని ద్రోహం చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక గీతకార్మికులకు ఉపాధి హామని అనుసంధానం చేస్తాం. మద్యం షాపుల్లో గీత కార్మికులకు రిజర్వేషన్ అమలుచేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో నీరా కేఫ్ లు ఏర్పాటుచేస్తాం. గౌడ, ఈడిగ ఉపకులాల మధ్య అంతరాన్ని తొలగించి ఏకతాటిపైకి తెస్తాం.

యువనేతను కలిసిన కోడుమూరు ముస్లింలు

కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం గ్రామ ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ముస్లింలకు శ్మశానవాటిక చాలా పవిత్రమైనది. మా గ్రామంలో మైనారిటీల ఖబరస్థాన్ పరిస్థితి దుర్భరంగా ఉంది. గుంతలు, రాళ్లు, ముళ్లపొదలు, పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక ఖబరస్థాన్ ను బాగుచేయించి, ప్రహరీ నిర్మించాలి. శ్మశానవాటిక ఈనాం భూముల్లో ఉంది. దాన్ని ఆన్ లైన్లో నమోదు చేసి, కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి.

లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీల ఆస్తులకు రక్షణ కరువైంది. శ్మశానాలను సైతం వదలకుండా వైసిపి నేతలు కబ్జా చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించి, మైనారిటీల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఖబరస్థాన్ లకు ప్రహరీగోడలు నిర్మించి, రక్షణ కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన గార్గేయపురం గ్రామస్తులు

మా గ్రామంలో డ్రైనేజీలు సమస్య అధికంగా ఉంది. సిసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేదు. మురుగునీరు ఇళ్లలోకి వస్తోంది. దోమల బెడద అధికంగా ఉంది. వీధి దీపాలు చెడిపోవడంతో రాత్రిపూట తిరగడం ఇబ్బందిగా ఉంది. వైసీపీ నాయకులు ఎవరూ మా సమస్యల్ని పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ అండో కో కు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ గ్రామాల అభివృద్ధిపై లేదు. వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజి వంటి సమస్యలను పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయి ఇచ్చి, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.

యువనేతను కలిసిన బి.తాండ్రపాడు గ్రామస్తులు

కోడుమూరు నియోజకవర్గం బి.తాండ్రపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గ్రామంలో గంగమ్మ చెరువు కబ్జాకు గురైంది.  గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లతోపాటు, మంజూరైన ఇళ్ల పట్టాలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు, అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాలి. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్డు విస్తరణ పనులు నిలిపివేశారు. ట్రాఫిక్ జామ్ అయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

దాదాపు రూ.500 కోట్ల విలువైన బి.తాండ్రపాడు చెరువును వైసిపి భూమాఫియా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి దోచుకుంటోంది. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు రంగులువేసుకొని, లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక సెంటుపట్టా పేరుతో రూ.7వేలకోట్లు దోచుకున్నారు. వైసిపి మాఫియాల కారణంగా కొండలు, గుట్టలు, చెరువులు మాయమవుతున్నాయి. టిడిపి అధికారంలోకి రాగానే చారిత్రక ప్రాధాన్యత కలిగిన తాండ్రపాడు చెరువు ఆక్రమణలపై విచారణ జరిపించి, భూములను స్వాధీనం చేసుకొని తిరిగి చెరువును ఏర్పాటుచేస్తాం. కోడుమూరు ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేల అవినీతిని బాగోతాన్ని బయటకుతీసి ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం. రోడ్డు విస్తరణ పనులు చేపట్టి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం.

Also, read this blog: Yuvagalam is an Initiative for Empowering Youth

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *