Yuvagalam Padayatra Nara lokesh

కేడర్ ఆనందోత్సాహాల నడుమ హోరెత్తిన 100వరోజు యువగళం! సంఘీభావంగా  యాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి, కుటుంబసభ్యులు 100రోజుల పాదయాత్రకు గుర్తుగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరణ

శ్రీశైలం: రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 100వరోజు ప్రభంజనంలా సాగింది. శ్రీశైలం నియోజకవర్గంలో బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర జాతరను తలపించింది.  టిడిపి కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ యువగళం 100వ రోజు పాదయాత్ర సాగింది.  యువనేత లోకేష్ తో కలిసి తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబసభ్యులు అడుగులు వేశారు. జైలోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో యువగళం పాదయాత్ర మార్గం హోరెత్తింది. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు,  3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది.  నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో తల్లి భువనేశ్వరితో కలిసి యువనేత లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారు.  100 రోజుల పాదయాత్ర కు గుర్తుగా టిడిపి నేతలు 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఇన్చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు జ్జాపికను యువనేతకు అందజేశారు.  లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న నారా భువనేశ్వరి, కుటుంబ సభ్యులు  లోకేశ్వరి,  హైమావతి,  ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కాటమనేని దీక్షిత, కాంటమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.  100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంప్ సైట్ లో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి, యువత అధ్యక్షడు పొగాకు జైరాం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో యువనేత సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం సంతజూటూరు నుంచి భోజనవిరామానంతరం సంతజూటూరు నుంచి కొనసాగిన పాదయాత్రలో యువనేతతో పాటు తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లోకేష్ తో పాటు నందమూరి కుటుంబసభ్యులను చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. జనసమూహాన్ని అదుపు చేయలేక వాలంటీర్లు, యువగళం బృందాలు నానా తంటాలు పడ్డారు. దారిపొడవునా లోకేష్, తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబసభ్యులకు జనం నీరాజనాలు పట్టారు. యువనేతకు దారిపొడవునా మహిళలు దిష్టితీసి హారతులిచ్చారు. పాదయాత్ర దారిలో మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను లోకేష్ ఓపిగ్గా ఆలకిస్తూ భరోసా ఇచ్చారు. పాదయాత్ర 100వరోజుకు చేరుకున్న సందర్భంగా  నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. పరమటూరు క్రాస్ వద్ద పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రానికి చేరుకుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:

వచ్చే ఆదాయం కాస్త ఫైన్లకే సరిపోతోంది!

-షేక్ ఇనయతుల్లా, బండిఆత్మకూరు

నేను ట్రావెల్స్ కు కారు కిరాయికి తిప్పుతుంటాను. డీజిల్ రేట్లు, టాక్సులు విపరీతంగా పెరిగాయి. వారంలో వివిధరకాల సాకులతో ఐదారు సార్లు ఫైన్లు వేస్తున్నారు. వచ్చే కాసిని డబ్బులు ఫైన్లకే సరిపోతున్నాయి. బాడిగలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. టిడిపి హయాంలో సబ్సిడీపై 2లక్షలు ఇస్తే కారు కొనుక్కున్నాను. పాపకు పెళ్లి చేస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. గతంలో 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 600 వస్తోంది. మా అబ్బాయికి బి.టెక్ పూర్తయి రెండేళ్లయింది. ఉద్యోగం లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ అరాచక ప్రభుత్వం పోతేనే మాలాంటి వారి బతుకులు బాగుపడతాయి.

రవాణా చార్జీలు భారంగా మారాయి

-ఇస్మాయిల్, చికెన్ షాపు యజమాని, బండిఆత్మకూరు

నేను చికెన్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. వ్యాపారం ఏమీ బాగోలేదు. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ట్రాన్స్ పోర్టు ధరలు పెరిగాయి. ఫారంలో 120 ఉంటే షాపుకు చేరేసరికి లైవ్ చికెన్ రూ.150 అవుతోంది. గతంలో 400 ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి వస్తోంది. సొంత స్థలం ఉంది కానీ, ఈ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలంటే భయమేసి వాయిదా వేసుకున్నాను. ట్రాక్టర్ ఇసుక రూ.10వేలకు పైనే పలుకుతోంది. మా పాప ఫార్మసీ చదువుతోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తామని చేయలేదు. దీంతో గత ఏడాది 1.70లక్షలు కట్టాను. నిత్యావసర వస్తువులు, గ్యాస్, డీజిల్ అన్ని ధరలు పెరిగాయి. సామాన్యుడు బతకడం కష్టంగా ఉంది.

ఎరవుల ధరలు విపరీతంగా పెరిగాయి

-సుబ్రహ్మణ్యం, రైతు, బుక్కాపురం

నేను 10ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. అరటి, వరిపంటలు వేస్తే గతఏడాది రూ.4లక్షలు నష్టం వచ్చింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఎరువులు, పురుగుమందులు ధరలు విపరీతంగా పెరిగాయి. 28:28 ఎరువు కట్ట గతంలో రూ.700 ఉంటే ఇప్పుడు 2వేలు అయింది. గత ప్రభుత్వంలో 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించేవారు. ఇప్పుడు ఆ పథకం మూలనపెట్టారు. మా అబ్బాయి బి.టెక్ చదువుతున్నాడు. మా బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు సిఎం కావాలి.

ఎన్నిసార్లు అడిగినా పింఛను ఇవ్వడం లేదు

-శివయ్య, లింగాపురం

నేను వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాను. బిడ్డలు పెళ్లిచేసుకొని వెళ్లిపోయారు. నాకు ఎటువంటి పొలం లేదు. బతకడానికి ఎటువంటి ఆధారం లేదు. పించనుకు దరఖాస్తు చేస్తే పట్టించుకోలేదు. వాలంటీరు, సచివాలయంలో ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉపయోగం లేదు. కూలీ పని దొరికిన రోజు భోజనం ఉంటుంది. లేనిరోజు పస్తులే. నాకు పింఛను ఇప్పించండి. 50ఎకరాల పొలం ఉన్నవారికి కూడా పెన్షన్ వస్తోంది. నాలాంటి వాడికి పెన్షన్ ఇవ్వడం లేదు.

పాద‌యాత్ర…అరాచ‌క స‌ర్కారుపై జ‌నజైత్రయాత్ర‌

-ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన లోకేష్

యువ‌గ‌ళం పాద‌యాత్ర అరాచ‌క స‌ర్కారుపై జ‌న‌జైత్రయాత్రగా చ‌రిత్రలో నిలిచిపోతుంద‌ని TDP నేత‌లు పేర్కొన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం వందరోజులు పూర్తయిన సంద‌ర్భంగా పాద‌యాత్ర  విశేషాల‌తో టిడిపి నేత కేశినేని శివ‌నాథ్(చిన్ని) ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు.   శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం బోయరేవుల క్యాంప్ సైట్ వ‌ద్ద సోమ‌వారం యువ‌నేత నారా లోకేష్ ప్రత్యేక సంచిక “జ‌న‌హృద‌య‌మైనారా లోకేష్‌“ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి పీత‌ల సుజాత‌, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం టిడిపి ఇన్చార్జి బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, డూండి రాకేష్, యువగళం మీడియా కోఆర్డినేటర్ బీవీ. వెంకట రాముడు, భాష్యం ప్రవీణ్‌, టిడిపి నేత‌లు పాల్గొన్నారు.

చెంచులకోసం ప్రత్యేక ఉపాధి పథకాలు అమలుచేస్తాం అడవుల్లో స్వేచ్చగా ఫలసాయాన్ని పొందే హక్కు కల్పిస్తాం గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం ఎకో టూరిజంతో గిరిజనుల ఉపాధి మెరుగుపరుస్తాం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చెంచులకు పక్కా ఇళ్లు చెంచులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

శ్రీశైలం: టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెంచుల కోసం ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. సంతజూటూరులో చెంచు సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ….  చెంచులకు ప్రత్యేక అటవీ హక్కులు ఉన్నాయి. మీ హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అడవికి వెళ్లి స్వేచ్చగా ఫలసాయాన్ని పొందే హక్కు కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెంచు గూడెం లో పక్కా ఇళ్లు, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ , ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. ఐటిడిఏ ద్వారా అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలను చెంచు లకు అందజేస్తాం. గిరిజనలు తయారు చేసే ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ చెయ్యడానికి ప్రత్యేక అవుట్ లెట్స్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. ఏకో టూరిజం ఏర్పాటు చేసి గిరిజనులు, చెంచులకి ప్రయోజనాలు కలిగేలా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చెంచుగూడెంలను అభివృద్ది చేసే బాధ్యతని నేను తీసుకుంటా.

చెంచులకు భూములు కేటాయిస్తాం

100 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా చెంచు సోదరులతో సమావేశం అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చెంచుల్లో పోరాట స్ఫూర్తి ఎక్కువ. బ్రిటిష్ వారిపై పోరాడి నల్లమల లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్న చరిత్ర చెంచులది. చెంచులు నిజాయితీగా ఉంటారు. సాయం పొందితే మర్చిపోరు. కృతజ్ఞతగా ఉంటారు. చెంచులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చింది టిడిపి. గిరిజనుల మేలు కోసం ఐటిడిఎ ఏర్పాటు చేసింది టిడిపి. చెంచులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. అరకు కాఫీ కి ప్రంపంచం వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది టిడిపి. ఆర్డిటి లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని చెంచులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతాం. టిడిపి హయాంలో తాండా లో గ్రావిటీ ప్రాజెక్టులు నిర్మించి తాగునీటి సమస్య ను పరిష్కరించాం. చెంచు లకి భూములు కేటాయించి పట్టాలు ఇస్తాం. వ్యవసాయం కోసం బోర్లు వెయ్యడం తో పాటు సోలార్ మోటార్లు బిగిస్తాం, దగ్గర లో ఉన్న చెరువుల ద్వారా పైప్ లైన్ ద్వారా సాగునీరు అందిస్తాం. బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తాం.

అటవీ అధికారులు వేధింపులు లేకుండా చేస్తాం

వైసిపి నాయకులు చెంచు లను అవమానించే విధంగా మాట్లాడటం దారుణం. వేధించడం అన్యాయం. ఆఖరికి చెంచుల నిధులు కూడా కొట్టేశారు వైసిపి. టిడిపి హయాంలో గిరిజనుల అభివృద్ధి కోసం 15 వేల కోట్లు ఖర్చు పెట్టాం. టిడిపి వచ్చిన వెంటనే ఐటిడిఏ లను ప్రక్షాళన చేస్తాం. చెంచులు అంతరించి పోయే జాతుల్లో ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మలని ప్రత్యేకంగా పరిగణించి మిమ్మలని కాపాడుకుంటాం. చెంచు పిల్లల చదువు కోసం ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, చెంచుల నే టీచర్లు గా నియమిస్తాం. చెంచులకు ఫారెస్ట్ అధికారుల వేధింపులు లేకుండా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాది లోనే చెంచులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. అందరం కలిసి గృహ ప్రవేశం చేద్దాం. చెంచుల్లో ఉన్న బాధ, ఆవేదన నాకు అర్దం అయ్యింది. బ్యాక్ లాగ్ పోస్టులు అన్ని భర్తీ చేసి చెంచులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

యువనేత ఎదుట చెంచుల ఆవేదన

యువనేత ఎదుట పలువురు చెంచులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంకటమ్మ మాట్లాడుతూ… జగన్ పాలనలో చెంచు గూడెం లో ప్రత్యేక ఉపాధి హామీ పనులు, పక్కా ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నాం. అడవిలోకి వెళ్ళడానికి అటవీ శాఖ అధికారులతో వేధింపులు ఎదుర్కుంటున్నాం. ఐటిడిఏ ల ద్వారా చెంచు లకు ఎటువంటి సాయం అందడం లేదని తెలిపింది. వీరన్న మాట్లాడుతూ… 42 చెంచు గూడెంలు ఇబ్బంది పడుతున్నాం. మా హక్కుగా ఇవ్వాల్సిన భూములు ఇవ్వడం లేదు. మాకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వైసిపి ప్రభుత్వం లో మాకు ఏ మేలు జరగకపగా, వేధింపులు ఎక్కువ అయ్యాయి. అడవి మా హక్కు. జగన్ మా హక్కు హరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లింగమ్మ మాట్లాడుతూ…. బోర్లు లేవు. ఎన్నికల ముందు సాగునీరు కోసం బోర్లు అందిస్తామని అన్నారు. ఇప్పుడు అధికారులను అడిగితే పోయి జగన్ ని అడగమని అంటున్నారు. కనీసం లోన్లు కూడా రావడం లేదు. టెట్ నిబంధన ఉండటం వలన చెంచు లు టీచర్ పోస్టులు పొందలేకపోతున్నారు. గతంలో చెంచులకు టీచర్ పోస్టులు వచ్చేవని చెప్పారు.

ధాన్యంకుప్పను పరిశీలించిన యువనేత లోకేష్

శ్రీశైలం నియోజకవర్గం మోతుకూరు గ్రామంలో కళ్లంలో ఆరబోసిన ధాన్యం కుప్పను యువనేత లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతు లక్ష్మీదేవి మాట్లాడుతూ… మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉన్నా ఉపయోగంలేదు.  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.1940కి కొనకపోవడంతో, మిల్లర్లకు రూ.1500కి అమ్ముకుంటున్నాం. ఎకరంలో వరిపంట వేశాను, కూలీఖర్చులు, పెట్టుబడులన్నీ పెరిగిపోయాయి. ఇలాగైతే మాకు ఎటువంటి లాభంలేదు.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ధాన్యం మొత్తాన్ని కొంటానన్న జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో తొంగొని రైతులను గాలికొదిలేశారు. ధాన్యం కొనుగోలుచేయాలని అడిగిన రైతులను పౌరసరఫరాల మంత్రి ఎర్రిపప్పలని దూషిస్తున్నాడు. మరో ఏడాది ఓపిక పడితే ప్రజలే తేలుస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరిగా డ్వాక్రా సంఘాల ద్వారా ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. పంటపెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.

మిరపచేలో కూలీలను కలిసిన నారా లోకేష్

శ్రీశైలం నియోజకవర్గం పెదదేవలాపురం శివార్లలో మిరపచేలో పనిచేస్తున్న కూలీలను కలిసిన యువనేత లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. రైతుకూలీ మరియమ్మ మాట్లాడుతూ… నా కొడుకు సునీల్ ఎంఎ చదివాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం రావడంలేదు. జగన్ ఉద్యోగాలిస్తానని మోసం చేశాడు. మీరు వచ్చాక ఉద్యోగాలు ఇప్పించాలని కోరింది. శాంతమ్మ మాట్లాడుతూ…మా పిల్లలు నలుగురు డిగ్రీ పూర్తిచేసి బి.ఇడి చదివారు, డిఎస్సీ లేకపోవడంతో ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. మెగా డిఎస్సీతో ఉద్యోగాలివ్వాలని విన్నవించింది. మరికొందరు మహిళా కూలీలు మాట్లాడుతూ… 45ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. కొంతమందికి ఎప్పటినుంచో ఇస్తున్న పెన్షన్ తీసేశారని వాపోయారు. పొలంపనులకు చేసుకుంటున్న తమకు గతంలో చంద్రన్న బీమా ఉండేది,  జగన్ ప్రభుత్వం వచ్చాక తీసేశారని చెప్పారు.

నారా లోకేష్ మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువకులు, రైతులు, రైతుకూలీలు అందరూ బాధితులే. జగన్ మాయమాటలు నమ్మిన లక్షలాది యువత అప్పులు చేసి కోచింగులు తీసుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ప్రకటించి, టీచర్ ఉద్యోగాలు భర్తీచేస్తాం. 45ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న జగన్…. రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లు పీకేశాడు. టిడిపి అధికారంలోకి రాగానే జగన్ రద్దుచేసిన పెన్షన్లన్నీ పునరుద్దరిస్తాం. వ్యవసాయ కూలీలకు చంద్రన్న బీమా వర్తింపజేస్తాం.

Also, read this blog: Yuvagalam Padayatra: Inspiring Youth to Walk Towards Progress and Social Impact

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *